దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో తన జియో ఫోన్ వినియోగదారుల కోసం తక్కువ ధరల్లో పలు రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ముఖ్యంగా రూ.155 కన్నా తక్కువ ధరలో అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా, SMSల వంటి ప్రయోజనాలు కలిగిన ప్లాన్లు అందుబాటులో ఉండటం విశేషం. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
రూ.152 జియో ఫోన్ ప్రైమా ప్లాన్
ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 0.5GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. అదనంగా యాక్టివ్ ప్లాన్ ఉన్న వినియోగదారులకు 1GB ఎక్స్‌ట్రా హైస్పీడ్ డేటా కూడా అందుతుంది.
అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం కలదు. 300 ఉచిత SMSలు అందిస్తారు. అలాగే JioTV కు ఫ్రీ యాక్సెస్‌తో పాటు జియో క్లౌడ్‌లో ఉచిత స్టోరేజ్ సదుపాయం కూడా లభిస్తుంది.
Also Read: తిరుమల క్యూలైన్‌లో పాము కలకలం.. తెలంగాణ భక్తురాలికి కాటు, నిలకడగా ఆరోగ్యం
రూ.125 జియో ఫోన్ ప్రైమా ప్లాన్
23 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ రోజుకు 0.5GB డేటా అందిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ పూర్తయిన తర్వాత స్పీడ్ 64Kbpsకు తగ్గుతుంది.
అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంది. 300 ఫ్రీ SMSలు కూడా లభిస్తాయి. అదనంగా JioTV యాక్సెస్ మరియు జియో క్లౌడ్ స్టోరేజ్ సదుపాయం ఈ ప్లాన్‌లో ఉన్నాయి.
రూ.91 జియో ఫోన్ ప్రైమా ప్లాన్
బడ్జెట్ యూజర్ల కోసం రూపొందించిన ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంది. రోజుకు 100MB డేటా లభిస్తుంది. అదనంగా మొత్తం 200MB బోనస్ డేటా కూడా ఇస్తారు.
అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. 50 ఉచిత SMSలు లభిస్తాయి. అలాగే JioTV మరియు జియో క్లౌడ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
బడ్జెట్ యూజర్లకు బెస్ట్ ఆప్షన్
తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు కోరుకునే జియో ఫోన్ వినియోగదారులకు ఇవి ఉత్తమ ఎంపికలుగా చెప్పవచ్చు. కాలింగ్, డేటా, ఎంటర్‌టైన్‌మెంట్ అన్ని సౌకర్యాలతో ఈ ప్లాన్లు బడ్జెట్ సెగ్మెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.