ఇక పీఎఫ్ కోసం రోజులు వెయిట్ చేయాల్సిన పనిలేదు.. యూపీఐతో ఇన్‌స్టంట్ విత్‌డ్రా!

కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ 3.0 సంస్కరణల్లో భాగంగా ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెస్తోంది, దీని ద్వారా ప్రయాణికులు తమ పీఎఫ్ నిధులను తక్షణమే పొందే అవకాశం కలగనుంది.

EPFO New App - Instant PF Withdrawal via UPI and ATM

పీఎఫ్ నుంచి బ్యాంక్ ఖాతాకు నేరుగా నిధులు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సేవలను మరింత ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తోంది. ఏప్రిల్ 1, 2026 నుండి ప్రారంభం కాబోతున్న సరికొత్త మొబైల్ అప్లికేషన్ ద్వారా పీఎఫ్ నిధుల ఉపసంహరణ ప్రక్రియను బ్యాంకింగ్ సేవల స్థాయికి చేర్చాలని కేంద్ర కార్మిక శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలంటే క్లెయిమ్ ఫారమ్ నింపి, కొన్ని రోజుల పాటు వేచి చూడాల్సి వచ్చేది. కానీ, కొత్త వ్యవస్థలో యూపీఐ (UPI) పిన్ ఉపయోగించి నిమిషాల వ్యవధిలోనే లేదా గరిష్టంగా 24 గంటల్లో నగదును పొందే సౌలభ్యం కలుగుతుంది.

75 శాతం నిధులు ఇన్‌స్టంట్‌గా.. భద్రతకు పెద్దపీట ఈ కొత్త విధానంలో చందాదారులు తమ పీఎఫ్ కార్పస్‌లో 75 శాతం వరకు నిధులను తక్షణమే విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 25 శాతం నిధులను రిటైర్మెంట్ అవసరాల కోసం అలాగే భద్రపరుస్తారు. ఈ ప్రక్రియ అంతా అత్యంత సురక్షితంగా సాగేలా ఆధార్ ఓటీపీ (Aadhaar OTP) మరియు బయోమెట్రిక్ సెక్యూరిటీ (Biometric Security) ఫీచర్లను జోడిస్తున్నారు.

దీనివల్ల మోసాలకు తావులేకుండా, అసలైన లబ్ధిదారులకే నగదు అందుతుంది. ముఖ్యంగా అత్యవసర వైద్య చికిత్సలు, విద్య, వివాహం వంటి అవసరాల కోసం పీఎఫ్ డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

ఏఐ టూల్స్‌తో భ‌య‌ప‌డుతున్నారా .. సాఫ్ట్‌వేర్ రంగానికి భారీ దెబ్బ ప‌డ‌నుందా.. టెక్ దిగ్గజాలు ఏం చెబుతున్నారంటే..!

ఏటీఎంల ద్వారా పీఎఫ్ విత్‌డ్రా సాధ్యమేనా? అవును, కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న మరో కీలకమైన అంశం పీఎఫ్ నిధులను ఏటీఎంల (ATM) ద్వారా నేరుగా విత్‌డ్రా చేసుకునే అవకాశం. ఏప్రిల్ 2026 నాటికి ఈ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చేలా సాఫ్ట్‌వేర్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే 100 డమ్మీ అకౌంట్లతో ప్రయోగాత్మక పరీక్షలు (Trial Runs) జరుగుతున్నాయి. ఇది అమల్లోకి వస్తే, పీఎఫ్ ఖాతా ఒక సాధారణ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లాగా సులభంగా మారుతుంది. అయితే, ఈపీఎఫ్ఓకు బ్యాంకింగ్ లైసెన్స్ లేదు కాబట్టి, వారు బ్యాంకింగ్ భాగస్వాముల ద్వారా ఈ సేవలను అందించనున్నారు.

సామాజిక భద్రతలో కొత్త అధ్యాయం సుమారు 8 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ప్రస్తుతం క్లెయిమ్ సెటిల్‌మెంట్ కావడానికి ఆటో-మోడ్‌లో కూడా మూడు రోజులు పడుతోంది. కొత్త యాప్ మరియు యూపీఐ కనెక్టివిటీతో ఇది రియల్ టైమ్ (Real-time) లో పూర్తవుతుంది. దీనివల్ల ఈపీఎఫ్ఓపై ఉన్న పనిభారం తగ్గడమే కాకుండా, పారదర్శకత కూడా పెరుగుతుంది. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చే ఈ విధానం కోసం చందాదారులు తమ యూఏఎన్ (UAN) కు ఆధార్ మరియు మొబైల్ నంబర్‌ను అప్‌డేట్‌గా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »