శాంసంగ్ మొబైల్స్ ఇష్ట‌ప‌డే వారికి గుడ్ న్యూస్.. గెలాక్సీ F70e 5G త్వరలో లాంచ్,ధ‌ర ఎంత అంటే..!

Samsung Galaxy F70e 5G: శాంసంగ్ గెలాక్సీ F70e 5G భారీ 6,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 6 ఏళ్ల సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో రూ.15,000 లోపు ధరలో లాంచ్ కానుంది. బడ్జెట్ 5G సెగ్మెంట్‌లో ఈ ఫోన్ మంచి ఆప్షన్‌గా నిలవనుంది.

Samsung Galaxy F70e 5G with 6000mAh Battery and 120Hz Display
Samsung Galaxy F70e 5G with 6000mAh Battery and 120Hz Display

Samsung Galaxy F70e 5G

స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ మరో కొత్త 5జీ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురానుంది. శాంసంగ్ గెలాక్సీ F70e 5G పేరుతో రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ అధికారిక లాంచ్‌కు ముందే కీలక వివరాలు బయటకు వచ్చాయి. ప్రత్యేక మైక్రోసైట్ ద్వారా డిజైన్, కలర్ ఆప్షన్లు, డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా వంటి ఫీచర్లపై సమాచారం ఆన్‌లైన్‌లో దర్శనమిస్తోంది. బడ్జెట్ సెగ్మెంట్‌లో స్టైలిష్ లుక్, పెద్ద బ్యాటరీతో ఈ ఫోన్ ఆకట్టుకునే అవకాశముంది.

ఈ ఫోన్ లైమ్‌లైట్ గ్రీన్, స్పాట్‌లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. శాంసంగ్ అధికారిక ఈ-స్టోర్‌తో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

భారత్ లాంచ్ తేదీ & ధర (అంచనా):

  • లాంచ్ తేదీ: ఫిబ్రవరి 9, 2026
  • అంచనా ధర: రూ. 15,000 లోపు
  • ఖచ్చితమైన ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు

శాంసంగ్ గెలాక్సీ F70e 5G – స్పెసిఫికేషన్లు (అంచనా) :

  • డిస్‌ప్లే: 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లే
  • 120Hz రిఫ్రెష్ రేట్
  • 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
  • ప్రాసెసర్: మీడియాటెక్ డైమన్సిటీ 6300 చిప్‌సెట్
    ర్యామ్ & స్టోరేజ్:
  • 6GB వరకు ర్యామ్
  • 128GB వరకు స్టోరేజ్
  • మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరణ అవకాశం
  • బ్యాటరీ: 6,000mAh భారీ బ్యాటరీ
  • 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8

సాఫ్ట్‌వేర్ సపోర్ట్:

  • 6 జనరేషన్ OS అప్‌డేట్స్
  • 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ (లీక్‌ల ప్రకారం)

బిల్డ్ & సేఫ్టీ:

  • IP54 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్
  • వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ ఫినిషింగ్
  • నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ
  • సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్
  • 12 5G బ్యాండ్స్ సపోర్ట్

కెమెరా ఫీచర్లు (అంచనా) :

  • రియర్ కెమెరా:
  • 50MP ప్రైమరీ సెన్సార్
  • 2MP డెప్త్ సెన్సార్
  • ఫ్రంట్ కెమెరా: 8MP సెల్ఫీ కెమెరా

మొత్తానికి, స్టైలిష్ డిజైన్, పెద్ద బ్యాటరీ, లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ వంటి ఫీచర్లతో గెలాక్సీ F70e 5G బడ్జెట్ 5జీ సెగ్మెంట్‌లో మంచి పోటీని ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. ప్రత్యేకంగా యువతను దృష్టిలో పెట్టుకుని శాంసంగ్ ఈ మోడల్‌ను డిజైన్ చేసినట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు శుభవార్త.. ఏడాది వ్యాలిడిటీతో రెండు అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్లు

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: Samsung Galaxy F70e 5G ఎప్పుడు లాంచ్ అవుతుంది?

A: ఈ ఫోన్ ఫిబ్రవరి 9, 2026న భారత మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Q2: Galaxy F70e 5G ధర ఎంత ఉండొచ్చు?

A: అంచనాల ప్రకారం ఈ ఫోన్ ధర రూ.15,000 లోపు ఉండొచ్చు.

Q3: ఈ ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఎంత కాలం వస్తాయి?

A: లీక్‌ల ప్రకారం 6 Android OS అప్‌డేట్స్ మరియు 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందనున్నాయి.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »