ఒక కిడ్నీ కాదు.. రెండు కిడ్నీలు అమ్మాలి! యాపిల్ ఫోల్డ్ ఐఫోన్ ధర తెలిస్తే షాకే

Apple తొలి ఫోల్డ్ ఐఫోన్‌ను లాంచ్ చేసింది. రూ.2,99,900 ప్రారంభ ధరతో వస్తున్న ఈ ఫోన్‌లో 7.6 అంగుళాల Super Retina XDR డిస్‌ప్లే, మూడు కెమెరాలు, ప్రీమియం ఫోల్డింగ్ డిజైన్ ఉన్నాయి.

Apple Foldable iPhone
Apple Foldable iPhone

Apple కొత్త ఫోల్డ్ ఫోన్.. ధర రూ.2.99 లక్షలు! డిజైన్, డిస్‌ప్లే, కెమెరాలు అదిరిపోయాయ్

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ మరో సంచలనానికి తెరతీసింది. తొలిసారిగా ఫోల్డ్ అయ్యే ఐఫోన్‌ను (iPhone Duo)తీసుకొచ్చింది. యాపిల్ లాంచ్ చేసిన ఈ కొత్త ఫోల్డ్ ఫోన్ డిజైన్, డిస్‌ప్లే, కెమెరాల విషయంలో ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఐఫోన్లలోనే అతిపెద్ద డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ను తీసుకురావడం ఆసక్తిని పెంచుతోంది.

రూ.2.99 లక్షల నుంచి ధర

ఈ కొత్త ఫోల్డ్ ఐఫోన్ ధర రూ.2,99,900 నుంచి ప్రారంభమవుతుంది. యాపిల్ లాంచ్ ఈవెంట్‌లో వెల్లడించిన అంచనాలకు తగ్గట్టుగానే దీని ధర ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రీ-ఆర్డర్లు అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుండగా.. ఫోన్ అక్టోబర్ 23 నుంచి అందుబాటులోకి రానుంది.

 రెండు కలర్స్‌లో ఫోన్

డిజైన్ పరంగా ఈ ఫోన్‌కు యాపిల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. ల్యాండ్‌స్కేప్, పోర్ట్రెయిట్ మోడ్‌లలో ఉపయోగించుకునేలా ఫోల్డింగ్ డిజైన్‌ను రూపొందించారు. డ్యూరబిలిటీ విషయంలోనూ ఫోన్ బలంగా ఉండేలా తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది.

ఈ ఫోల్డ్ ఐఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో లభించనుంది.

  •  నైట్ స్కై
  •  వైట్

 7.6 అంగుళాల డిస్‌ప్లే

ఫోన్‌లో 7.6 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే అందించారు. ఐఫోన్‌లోనే అతిపెద్ద డిస్‌ప్లేగా ఇది నిలుస్తుందని యాపిల్ చెబుతోంది.

డిస్‌ప్లేలో బ్రైట్‌నెస్, కలర్ రిచ్‌నెస్‌పై కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. పీక్ బ్రైట్‌నెస్ 3,000 నిట్స్ వరకు ఉంటుందని వెల్లడించారు. దీంతో వీడియోలు, ఫొటోలు, ఇతర కంటెంట్‌ను పెద్ద స్క్రీన్‌పై మరింత స్పష్టంగా చూసే అవకాశం ఉంటుంది.

 మూడు కెమెరాలు

కెమెరాల విషయానికి వస్తే ఈ ఫోన్‌లో మొత్తం మూడు కెమెరాలు ఉన్నాయి. వెనుక భాగంలో రెండు 48MP కెమెరాలు అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 12MP కెమెరా ఉంది.

ఫ్రంట్ కెమెరాను చిన్న పరిమాణంలో ఉంచినప్పటికీ ఫొటో, వీడియో క్వాలిటీ విషయంలో మంచి ఫలితాలు వచ్చేలా రూపొందించినట్లు తెలుస్తోంది.

ఫొటో క్వాలిటీపై ఫోకస్

ఈ ఫోన్ కెమెరాలతో తీసిన ఫొటోలు కూడా లాంచ్ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డీటెయిల్స్, కలర్స్ విషయంలో ఫొటోలు చాలా రిచ్‌గా కనిపించేలా కెమెరా సిస్టమ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

మొత్తంగా చూస్తే.. భారీ డిస్‌ప్లే, ఫోల్డింగ్ డిజైన్, మూడు కెమెరాలు, ప్రీమియం లుక్‌తో యాపిల్ కొత్త ఫోల్డ్ ఐఫోన్ మార్కెట్‌లో హై-ఎండ్ సెగ్మెంట్‌పై ఫోకస్ చేసింది. అయితే రూ.2,99,900 ప్రారంభ ధర కావడంతో ఇది ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలోనే ఉండనుంది.

About Author:

Vidya Burujukadi

కంటెంట్ రైటర్‌గా మన వార్త వెబ్ సైట్‌కి విద్య.బి పనిచేస్తున్నారు. ప్రధానంగా బిజినెస్ వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను ఆమె అందిస్తారు. విద్యకు తెలుగు మీడియా…

More About Author »