- యూట్యూబ్ ఇప్పుడు వీడియోలను ఆటోమేటిక్‌గా 27 భాషల్లో డబ్ చేసే సదుపాయం అందిస్తోంది
- ఏఐ ఆధారిత వాయిస్ టెక్నాలజీ సహజమైన టోన్‌తో డబ్బింగ్‌ను అందిస్తుంది
- క్రియేటర్లు గ్లోబల్ ఆడియన్స్‌ను సులభంగా చేరుకునే అవకాశం పొందారు
Also Read: నుమాయిష్‌లో నోరూరించే రుచుల జాతర.. ఫుడ్ స్టాళ్లకు నగరవాసుల నుండి భారీ స్పందన
2023లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ఈ సదుపాయం, 2024లో నాలెడ్జ్ మరియు ఇన్ఫర్మేషన్ వీడియోలకు మాత్రమే పరిమితమైంది. అయితే తాజా అప్‌డేట్‌తో మ్యూజిక్ వీడియోలు మినహా దాదాపు అన్ని రకాల వీడియోలకు ఈ ఫీచర్ వర్తించనుంది. యూట్యూబ్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2025 డిసెంబర్ నాటికి రోజుకు సగటున 60 లక్షల మందికి పైగా వీక్షకులు కనీసం 10 నిమిషాల పాటు ఆటో-డబ్బింగ్ కంటెంట్‌ను వీక్షిస్తున్నారు.
కొత్త ఫీచర్ల ముఖ్యాంశాలు
- 27 భాషల్లో ఆటో డబ్బింగ్ – వీడియోలను ఆటోమేటిక్‌గా పలు భాషల్లో వినే అవకాశం
- ఎక్స్‌ప్రెసివ్ స్పీచ్ టెక్నాలజీ – డబ్ చేసిన వాయిస్ సహజంగా, ఒరిజినల్ స్పీకర్ టోన్‌కు దగ్గరగా ఉండేలా రూపొందింపు
- ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఆప్షన్ – వీక్షకులు తమకు నచ్చిన భాషను ముందుగా సెటప్ చేసుకునే సౌకర్యం
ఈ అప్‌డేట్‌తో యూట్యూబ్ క్రియేటర్లకు తమ కంటెంట్‌ను గ్లోబల్ ఆడియన్స్‌కి సులభంగా చేరవేయడానికి ఒక పెద్ద అవకాశంగా మారింది. మరోవైపు వీక్షకులకు తమకు తెలియని భాషల్లో ఉన్న వీడియోలను కూడా అర్థమయ్యే విధంగా ఆస్వాదించే అవకాశం లభించింది. డిజిటల్ కంటెంట్ వినియోగంలో భాషా అవరోధాలను తొలగించడంలో యూట్యూబ్ ఈ అడుగు కీలక మైలురాయిగా నిలుస్తోంది.