హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు ముదిరింది. ఒకవైపు పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని నేతలు చెబుతున్నా, లోలోపల మాత్రం ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరియు రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్ మధ్య చోటుచేసుకున్న తాజా ‘చిట్ చాట్’ వివాదం ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతోంది.
అసలు వివాదం ఏమిటి?
బీజేపీ కిమ్ జోంగ్ ఉన్ బాటలో నడుస్తోంది.. ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటోంది: సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
ముస్లింలను ఉద్యోగాల నుంచి బహిష్కరించాలా? బీజేపీ నేత నాజియా ఎలాహీ ఖాన్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం
బీహార్లో మారుతున్న సరికొత్త రాజకీయం.. నితీష్ కుమార్ రాజీనామా, కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి
పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నానని, బహిరంగంగా బూతులు మాట్లాడుతున్నానని తనపై ఎంపీ లక్ష్మణ్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారని ధర్మపురి అరవింద్ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై లక్ష్మణ్ స్పందిస్తూ.. తాను పార్టీలో లేఖలు రాసే సంస్కృతికి వ్యతిరేకమని, కేవలం సీఎస్ఆర్ (CSR) నిధుల కోసం మాత్రమే లేఖలు రాస్తానని స్పష్టం చేశారు.
అరవింద్ ‘స్టేషనరీ’ సెటైర్లు:
లక్ష్మణ్ వ్యాఖ్యలపై ధర్మపురి అరవింద్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
“2004 నుండి ఇప్పటివరకు తెలంగాణలో 5 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (1120 స్థానాలకు గాను) బీజేపీ గెలిచింది కేవలం 18 సీట్లు మాత్రమే. ఈ విషయం గూగుల్‌లో సెర్చ్ చేసినా తెలుస్తుంది. ఈ ఫలితాల గురించి అప్పట్లో లేఖలు రాసి అధిష్టానానికి ఎందుకు చెప్పలేదు? అప్పుడు స్టేషనరీ సరిపోలేదా?” అంటూ ఎద్దేవా చేశారు.
పార్టీని అభివృద్ధి చేయడంలో విఫలమైనప్పుడు లేఖలు రాయకుండా, ఇప్పుడు తన మీద ఫిర్యాదులు చేయడం కోసం స్టేషనరీని ఎందుకు దండగ చేస్తున్నారని అరవింద్ ప్రశ్నించారు.
కేబినెట్ విస్తరణే కారణమా?
త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనుందని, తెలంగాణ నుండి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ మంత్రి పదవి రేసులో ఉన్న నేతలు ఒకరిపై ఒకరు అధిష్టానానికి నెగిటివ్ రిపోర్టులు పంపుతున్నారని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
కేవలం ఈ ఇద్దరే కాకుండా, మరికొందరు ఎంపీలు కూడా తమ అసమ్మతిని లేఖల ద్వారా ఢిల్లీకి చేరవేసినట్లు సమాచారం.
మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో, కీలక నేతల మధ్య ఇలాంటి విభేదాలు పార్టీ శ్రేణుల్లో అయోమయానికి గురిచేస్తున్నాయి. అధిష్టానం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Also Read: తెలంగాణకు ‘రెడ్’ అలర్ట్: ఏప్రిల్ 12 నుంచి నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. 44°C దాటనున్న ఉష్ణోగ్రతలు!