ఇబ్రహీంపట్నం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారంతో ప్రవర్తిస్తున్నారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. శనివారం ఇబ్రహీంపట్నంలో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన చైర్‌పర్సన్, కౌన్సిలర్లు మరియు సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కేటీఆర్ ప్రసంగంలోని ప్రధానాంశాలు:
1. ఫ్యూచర్ సిటీ ఒక ‘డ్రామా’:
ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి ‘ఫ్యూచర్ సిటీ’ కడతాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఏఐ (AI) చిత్రాలు, గ్రాఫిక్స్‌తో ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇది కేవలం తన కుటుంబ సభ్యులకు, అనుచరులకు భూములు కట్టబెట్టేందుకేనని ఆరోపించారు.
ఉన్న సిటీలో దోమల వల్ల జనం చనిపోతుంటే పట్టించుకోని ముఖ్యమంత్రి, కొత్త సిటీ కడతాననడం విడ్డూరమన్నారు.
2. భూముల కుంభకోణం – రైతులకు మోసం:
ఎన్నికలకు ముందు ఫార్మా సిటీ భూములను రైతులకు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు అదనంగా మరో 16,000 ఎకరాలను రైతుల నుంచి గుంజుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
నాడు భట్టి విక్రమార్క, సీతక్క పాదయాత్ర చేసి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇది క్లియర్ గా ‘బ్లాక్‌మెయిల్’ రాజకీయమేనని కేటీఆర్ ధ్వజమెత్తారు.

3. మున్సిపల్ ఎన్నికల్లో విజయం:
కాంగ్రెస్ ఎన్ని అక్రమాలకు పాల్పడినా ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగిరిందని కేటీఆర్ గర్వంగా ప్రకటించారు.
స్థానిక ఎమ్మెల్యే అరాచకాలను ఎదిరించి నిలిచిన యువ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
4. కాంగ్రెస్ భవిష్యత్తుపై జోస్యం:
రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతున్న అన్యాయాల వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చే 50 ఏళ్ల దాకా మళ్ళీ అధికారంలోకి రాదని కేటీఆర్ జోస్యం చెప్పారు. తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డిని చీత్కరించుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.
Also Read:


