3 తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. పెండింగ్ బిల్లుల క్లియర్‌కు గ్రీన్ సిగ్నల్

Telangana Government Employees Pending Bills: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనవరి పెండింగ్ బిల్లులు, సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ, GPF వంటి బకాయిల క్లియరెన్స్‌కు రూ.720 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Telangana Government Employees Pending Bills
Telangana Government Employees Pending Bills

Telangana Government Employees Pending Bills

  • తెలంగాణ ప్రభుత్వం జనవరి నెల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌కు రూ.720 కోట్ల నిధులు విడుదల చేయనుంది.

  • 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ, GPF తదితర బకాయిల చెల్లింపుకు ఆదేశాలు జారీ అయ్యాయి.

  • ప్రతి నెల సగటున రూ.700 కోట్లకు పైగా ఉద్యోగుల బిల్లుల క్లియరెన్స్ కొనసాగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త అందించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు, సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి అంశాలపై కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు నిధుల విడుదలకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం నింపుతోంది.

జనవరి నెలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల క్లియర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలుప‌గా, మొత్తం రూ.720 కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేయ‌నున్నారు. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ క్లియర్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకేసారి పెండింగ్ బకాయిల చెల్లింపు లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారు.

విడుదల చేయనున్న ఇతర బకాయిలు

  • గ్రాట్యుటీ బిల్లులు
  • జీపీఎఫ్ (GPF) మొత్తాలు
  • సరెండర్ లీవ్ అడ్వాన్సులు
  • ఇతర పెండింగ్ అలవెన్సులు, రీయింబర్స్‌మెంట్లు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం వేగం పెంచిందని స్పష్టం చేశారు. ప్రతి నెల సగటున రూ.700 కోట్లకు పైగా నిధులు విడుదల చేసే విధానం కొనసాగుతుందని తెలిపారు.

  • ఉద్యోగుల్లో ఆనందం
  • పెండింగ్ బిల్లుల కోసం ఉద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు.
  • సరెండర్ లీవులు ఎప్పుడు వస్తాయా అన్న ఆసక్తి నెలకొంది.
  • పలు ఉద్యోగ సంఘాలు గతంలో పలుమార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
  • ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ రావడంతో రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
  • కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న రోజే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బిల్లులు క్లియర్ చేయాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశమైంది. దీనిని రాజకీయంగా కూడా విశ్లేషిస్తున్నారు.

కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వ ఆశలు

  • హైదరాబాద్ మెట్రో విస్తరణకు నిధుల కేటాయింపు కోసం రాష్ట్రం పలుమార్లు విజ్ఞప్తి.
  • రాష్ట్ర రోడ్ల అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులపై ఆశ.
  • గత రెండు బడ్జెట్‌లలో నిరాశ ఎదురుకావడంతో ఈసారి ఎక్కువ అంచనాలు.
  • ఇప్పటికే కేంద్రానికి బడ్జెట్ ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం.

విశ్లేషకుల అభిప్రాయం

తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో కేంద్ర కేటాయింపులు పరిమితంగా ఉండొచ్చని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం.అయినప్పటికీ తెలంగాణకు కీలక ప్రాజెక్టులపై కొంతమేర నిధులు వచ్చే అవకాశం ఉందని మరికొందరు భావిస్తున్నారు.

మొత్తంగా చూస్తే, ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విడుదల నిర్ణయం రాష్ట్రంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించింది. ఇక కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఎవరికి వర్తిస్తుంది?

A: 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తుంది.

Q2: ఏ ఏ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయనుంది?

A: సరెండర్ లీవ్, గ్రాట్యుటీ బిల్లులు, GPF మొత్తాలు, ఇతర పెండింగ్ అలవెన్సులు, రీయింబర్స్‌మెంట్లు విడుదల చేయనుంది.

Q3: నిధుల విడుదల ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది?

A: జనవరి నెల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌తో పాటు దశలవారీగా నిధుల విడుదల ప్రారంభం కానుంది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »