తెలంగాణ హీట్‌వేవ్ అలర్ట్: 45 డిగ్రీలకు చేరనున్న ఎండలు

తెలంగాణలో రాబోయే 7 రోజులు భయంకరమైన వడగాల్పులు. అదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ సహా పలు జిల్లాలకు హీట్‌వేవ్ హెచ్చరిక. 45°C దాటనున్న ఎండలు.

Telangana heatwave map showing high temperatures in districts like Adilabad, Nizamabad, and Hyderabad with fire icons for alert.
Telangana heatwave map showing high temperatures in districts like Adilabad, Nizamabad, and Hyderabad with fire icons for alert.

హైదరాబాద్: వేసవి భానుడు తన ప్రతాపాన్ని చూపడం ప్రారంభించాడు. తెలంగాణలో నేటి నుండి భారీ వడగాల్పులు (Heatwave) వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

ఏ జిల్లాల్లో ఎంత ఎండ?

1. ఉత్తర తెలంగాణ (డ్రై హీట్ – 42°C నుండి 45°C):

అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయి. ఇక్కడ గాలిలో తేమ తక్కువగా ఉండి, ‘డ్రై హీట్’ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

2. దక్షిణ మరియు తూర్పు తెలంగాణ (ఉక్కపోతతో కూడిన ఎండ):

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41-43°C గా ఉన్నప్పటికీ, గాలిలో తేమ (Humidity) ఎక్కువగా ఉండటం వల్ల ‘రియల్ ఫీల్’ 42-45°C వరకు ఉంటుంది. అంటే ఎండ కంటే ఉక్కపోత ఎక్కువగా బాధిస్తుంది.
Also Read : Telangana Heat Alert : తెలంగాణలో ఎండల హెచ్చరిక – 25 జిల్లాల్లో 40°C వరకు ఉష్ణోగ్రతలు

3. హైదరాబాద్ అప్‌డేట్:

భాగ్యనగరంలో రాబోయే 7 రోజులు నిరంతరంగా 40°C నుండి 42°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. నగరం కాంక్రీట్ జంగిల్ కావడం వల్ల వేడి తీవ్రత రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది.

4. ఇతర జిల్లాలు:

నల్గొండ, గద్వాల జిల్లాల్లో కూడా 42-45°C వరకు ఎండలు రోస్ట్ చేయనున్నాయి. మిగిలిన జిల్లాల్లో 41-43°C మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయి.

ప్రజలకు సూచనలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

మధ్యాహ్నం ప్రయాణాలు వద్దు: ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు.

నీరు ఎక్కువగా తాగండి: దాహం వేయకపోయినా మంచి నీరు, ఓఆర్ఎస్ (ORS), మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి.

దుస్తులు: వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించండి. బయటకు వెళ్లినప్పుడు గొడుగు లేదా టోపీ వాడండి.

నీడన ఉండండి: పశువులను, పెంపుడు జంతువులను ఎండలో కట్టేయకుండా నీడలో ఉంచండి.

ఎండలు ప్రాణాంతకమయ్యే అవకాశం ఉన్నందున వృద్ధులు, చిన్నపిల్లలు మరియు గర్భిణీలు మరింత అప్రమత్తంగా ఉండాలి. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Also Read : అకాల వర్షాలకు ముగింపు.. మార్చి తొలి వారం నుంచి తెలంగాణలో తీవ్ర ఎండల హెచ్చరిక

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »