రోహిణి నక్షత్రంలో సూర్యుడి సంచారం.. మేషం నుంచి కన్యారాశి అంతా అదృష్టమే..!

సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి (Rohini Nakshatra) ప్రవేశించాడు. ఈ సూర్య నక్షత్ర గోచారం (Surya Nakshatra Gochar) కారణంగా మేషం నుంచి కన్య వరకు కొన్ని రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు, గౌరవం, అదృష్టంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Sun Transit | జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడి నక్షత్ర మార్పును అత్యంత కీలక పరిణామంగా భావిస్తారు. ఎందుకంటే ఇది వ్యక్తి ఆత్మవిశ్వాసం, వృత్తి పురోగతి, సామాజిక గౌరవంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని నమ్మకం. సూర్య భగవానుడు వృషభ రాశిలోని రోహిణి నత్రక్షంలో ప్రవేశించాడు. చంద్రుడి అధిపత్యం ఉండే ఈ నక్షత్రం సౌఖ్యం, ఆకర్షణ, సంపదలకు ప్రతీకగా పేర్కొంటారు. సూర్యగ్రహ నక్షత్ర సంచారం కారణంగా మేషరాశి నుంచి కన్యా రాశి వరకు ప్రభావం కనిపించనుంది. కొందరికి కొత్త అవకాశాలు, ఆర్థికంగా పురోగతి, ఉద్యోగోన్నతి తదితర శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి.

మేష రాశి

ప్రస్తుతం ధనస్థానమైన రెండో ఇంటిపై సూర్యుడి ప్రభావం పడుతున్నది. దీంతో ఆదాయం పెంచుకోవడం, పొదుపు చేయడం తదితర అంశాలపై దృష్టి సారిస్తారు. కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించే అవకాశం ఉంటుంది. మీ మాటతీరు ఎదుటివారిని ఆకట్టుకుంటుంది. ఫలితంగా మీకు లాభం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, కోపంతో మాట్లాడటం, కఠిన పదజాలాన్ని ఉపయోగించడంతో సంబంధాలు దెబ్బతినే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండడం అవసరం.

వృషభ రాశి

సూర్యుడు వృషభ రాశిలో సంచరించడం వల్ల ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ ఆకర్షణ పెరుగుతాయి. లక్ష్యాలను సాధించడంలో మరింత దృఢనిశ్చయంతో ముందుకు సాగుతారు. ఉద్యోగం చేసేచోట గుర్తింపు పెరగడంతో పాటు గౌరవం రెట్టింపవుతుంది. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. అయితే, అహంకారం, మొండితనానికి దూరంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు కలిగే అవకాశాలున్నాయి.

మిథున రాశి

సూర్యుడి ప్రభావం ద్వాదశ స్థానంపై పడుతుండడంతో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనలు కూడా కొంత ఇబ్బంది పెట్టవచ్చు. విలాసవంతమైన విషయాలపై ఖర్చు చేసే పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. అనవసర ఖర్చులను నియంత్రించుకుంటే పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి.

కర్కాటక రాశి

పదకొండో ఇంటిపై సూర్యుడి ప్రభావం పడుతుండడంతో లాభ స్థానం మరింత బలపడనుంది. దాంతో ఆదాయం పెరగడం, కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిచయాలు, ఉన్నతాధికారుల సహకారం వల్ల ఉద్యోగరంగంలో పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల ఉంటుంది. మీకు అత్యంత సన్నిహితులపై ఎక్కువగా అంచనాలు పెట్టుకోకపోవడం మంచిది.

సింహ రాశి

సూర్యుడు దశమస్థానంలో బలంగా ఉండటంతో ఉద్యోగం, వృత్తి రంగాల్లో పురోగతికి అవకాశాలుంటాయి. మీ కష్టం, నాయకత్వ నైపుణ్యాలకు ప్రశంసలు దక్కే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండగా.. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే, సహచరులపై ఒత్తిడి తీసుకురాకుండా జాగ్రత్తగా మెలగడం మంచిది.

కన్యా రాశి

భాగ్యస్థానమైన తొమ్మిదో ఇంటిపై సూర్యుడి ప్రభావం ఉండటంతో విద్య, ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు లభిస్తాయి. గురువులు, పెద్దల మార్గదర్శనం వృత్తి జీవితానికి కొత్త దిశ చూపే సూచనలు ఉన్నాయి. అదృష్టం అనుకూలంగా ఉండటంతో దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, చిన్న విషయాలకే అతిగా ఆలోచించడం మంచిది. లేకపోతే ఇబ్బందులుపడే అవకాశాలుంటాయి.

Read Also : రైతు నోట్లో మట్టికొట్టారు.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ ఘాటు లేఖ..!

Read Also : కాంగ్రెస్‌ సర్కారు తెలంగాణ గొంతు కోసేందుకు రెడీ అయ్యింది.. మాజీ మంత్రి సింగిరెడ్డి విమర్శలు..

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »