Niranjan Reddy | సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గొంతు కోసేందుకు సిద్ధమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. గోదావరి–కావేరి అనుసంధానంతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. గోదావరిలో తెలంగాణ వాటా తేలకముందే కావేరి అనుసంధానానికి ఒప్పుకోవడం వల్ల రాష్ట్రం శాశ్వతంగా గోదావరి జలాలపై హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. వరద జలాల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డిగా అంగీకరిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ విధానం కారణంగా కాళేశ్వరం, ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు. కావేరి అనుసంధానం పేరుతో గోదావరి నీళ్లను తరలించే పరిస్థితిలో, ఏపీ కృష్ణా జలాల్లో తన వాటాను వదులుకోవాలని తెలంగాణ డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని, దీనిపై రాతపూర్వక ఒప్పందం ఉండాలని సూచించారు.
Read Also : ప్రభుత్వ వర్సిటీల్లో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి అనుమతి..!
రాష్ట్రానికి దీర్ఘకాలిక నష్టం..
నాగార్జున సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉపయోగించడం వల్ల తెలంగాణకు దీర్ఘకాలిక నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. ఇక ఇచ్చంపల్లి, సమ్మక్క–సారక్క, ఇంద్రావతి లింక్ ప్రాజెక్టులు అమలైతే తెలంగాణలో వరద నియంత్రణ కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. గోదావరి–కావేరి అనుసంధానం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014ను ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 763 టీఎంసీలు, గోదావరిలో 1980 ట్రిబ్యునల్ ప్రకారం 968 టీఎంసీల వాటా ఉందని, వాటిని పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు వినియోగంపై గతంలో తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరాలు తెలిపి, రిజర్వాయర్‌ను దూరం చేశారని, తరువాత కాలంలో అవే నిబంధనలు పాటించకుండా చెన్నై తాగునీటి పేరుతో పోతిరెడ్డిపాడు ద్వారా అధికంగా నీటిని తరలించారని ఆయన ఆరోపించారు.
Read Also : మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40వేలు.. నరసన్నపేటలో ప్రకటించిన చంద్రబాబు..
సాగర్ నీటిని తరలించేందుకే అనుసంధానం..
అదే తరహాలో నాగార్జున సాగర్ నుంచి నీటిని ఏపీకి తరలించే ప్రయత్నాల్లో భాగంగానే గోదావరి–కావేరి అనుసంధానం చేపడుతున్నారని, ఇది తెలంగాణకు శాశ్వత నష్టం కలిగిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ హక్కులు, వాటాలపై స్పష్టమైన డిమాండ్లు చేయకుండా తెలంగాణ కాంగ్రెస్ ‘గుడ్డిగా తలూపుతోందని’ ఆయన విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ప్రారంభమైన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లితే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టుపెడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎంపీలు కూడా పార్టీ అధిష్టానాల చేతుల్లో తోలుబొమ్మలుగా మారారని ఆరోపించారు.
Read Also : ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. భారీగా పెట్టుబడులు పెడుతున్న ద్విచక్ర వాహనాల కంపెనీ..!


