హోలీ ధమాకా .. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 164 రోజుల వ్యాలిడిటీ, 2GB హైస్పీడ్ డేటా!

ప్రభుత్వ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) హోలీ సందర్భంగా ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రత్యేక లిమిటెడ్ టైమ్ ఆఫర్ ప్రకటించింది. రూ.997 రీఛార్జ్ ప్లాన్‌పై అదనంగా 14 రోజుల వ్యాలిడిటీ అ

BSNL 997 plan

హోలీ పండుగను పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. సాధారణంగా రూ.997 ప్లాన్‌కు 150 రోజుల వ్యాలిడిటీ ఉండగా, ఈ పండుగ ఆఫర్ కింద అదనంగా 14 రోజులు జోడించి మొత్తం 164 రోజుల వరకు వ్యాలిడిటీ అందిస్తోంది. ముఖ్యంగా ఈ అదనపు వ్యాలిడిటీ కోసం కస్టమర్లు ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆఫర్ గడువు

  • బీఎస్ఎన్ఎల్ ఆఫర్ మార్చి 1 నుంచి మార్చి 31, 2026 వరకు అందుబాటులో ఉంటుంది.
  • లిమిటెడ్ టైమ్ ఆఫర్ కావడంతో నిర్దిష్ట గడువులోపు రీఛార్జ్ చేసుకున్నవారికే ఈ ప్రయోజనం లభిస్తుంది.
  • ఆఫర్ గడువు ముగిసిన తర్వాత సాధారణ ప్లాన్ వ్యాలిడిటీ మాత్రమే వర్తిస్తుంది.

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కొత్త లుక్ రివీల్ – పవన్ ఫ్యాన్స్‌కు పండగ!

రూ. 997 ప్లాన్ బెనిఫిట్స్

ఈ ప్లాన్ కేవలం అదనపు వ్యాలిడిటీ మాత్రమే కాకుండా ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది:

  • రోజుకు 2GB హై-స్పీడ్ డేటా
  • రోజువారీ డేటా లిమిట్ పూర్తయ్యాక స్పీడ్ తగ్గుతుంది.
  • అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్
  • దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు పరిమితిలేని కాలింగ్ సదుపాయం.
  • దీర్ఘకాల వ్యాలిడిటీతో ఎక్కువకాలం రీఛార్జ్ అవసరం లేకుండా సేవలు వినియోగించే అవకాశం.

రీఛార్జ్ చేయడం ఎలా?

  • బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ ప్లాన్‌ను వివిధ మార్గాల్లో రీఛార్జ్ చేసుకోవచ్చు:
  • బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా
  • బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్‌లో లాగిన్ అయి
  • ఇతర థర్డ్-పార్టీ రీఛార్జ్ యాప్‌ల ద్వారా
  • సమీపంలోని మొబైల్ రిటైలర్ వద్ద

థర్డ్-పార్టీ యాప్ ఉపయోగిస్తే బీఎస్ఎన్ఎల్ ఎంపిక చేసి, మీ లొకేషన్ మరియు మొబైల్ నంబర్ నమోదు చేసి రూ.997 ప్లాన్‌ను సెలెక్ట్ చేసి పేమెంట్ చేయాలి. ఆఫర్ కాలంలో రీఛార్జ్ చేస్తే అదనపు 14 రోజుల వ్యాలిడిటీ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.

వినియోగదారులకు లాభం

దీర్ఘకాల వ్యాలిడిటీతో పాటు రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలు ఉండటంతో ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌గా నిలుస్తోంది. హోలీ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ఇది నిజంగానే పండగ ఆఫర్‌గా మారింది. పండుగ సీజన్‌లో తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సేవలు పొందాలనుకునే వారికి ఈ ఆఫర్ మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »