సాంకేతిక పరివర్తనలో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న బిట్రాంజ్.. ఏఐ ఆధారిత ఎంటర్‌ప్రైజ్ వృద్ధిపై దృష్టి!

ప్రముఖ బిజినెస్ టెక్నాలజీ , ఈఆర్‌పీ (ERP) పరిష్కారాల సంస్థ అయిన బిట్రాంజ్ (bTranz), ఇవాళ తమ 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో సాంకేతిక ఆవిష్కరణలు, కస్టమర్ భాగస్వామ్యాలు , వ్యాపార వృద్ధిలో విజయవంతంగా దశాబ్ద కాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకను నిర్వహించారు.

సాంకేతిక పరివర్తనలో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న బిట్రాంజ్.. ఏఐ ఆధారిత ఎంటర్‌ప్రైజ్ వృద్ధిపై దృష్టి!

హైదరాబాద్: ప్రముఖ బిజినెస్ టెక్నాలజీ , ఈఆర్‌పీ (ERP) పరిష్కారాల సంస్థ అయిన బిట్రాంజ్ (bTranz), ఇవాళ తమ 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో సాంకేతిక ఆవిష్కరణలు, కస్టమర్ భాగస్వామ్యాలు , వ్యాపార వృద్ధిలో విజయవంతంగా దశాబ్ద కాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సంస్థ “ఈఆర్‌పీ అమలులో ఏఐ పాత్ర” (Role of AI in ERP Implementation) అనే అంశంపై ఒక ప్రత్యేక ప్యానెల్ చర్చను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ హైదరాబాద్ సెంటర్ హెడ్ అంజాద్ ఖాన్ పఠాన్, జియో ప్లాట్‌ఫారమ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎం.వి.రెడ్డి, ఎన్-ల్యాబ్స్ ఏఐ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సంజీవ్ దేశ్‌పాండే వంటి ప్రముఖ వక్తలు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

గడిచిన దశాబ్ద కాలంలో బిట్రాంజ్ ఒక సాధారణ ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడర్ స్థాయి నుంచి విస్తృతమైన బిజినెస్ టెక్నాలజీ , డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ భాగస్వామిగా ఎదిగింది. వ్యాపార సంస్థలకు అవసరమైన ఈఆర్‌పీ, ఒరాకిల్ సొల్యూషన్స్, క్లౌడ్, ఆటోమేషన్, అప్లికేషన్ డెవలప్‌మెంట్ , ఇతర ఎంటర్‌ప్రైజ్ సాంకేతిక సేవలను అందిస్తూ నిరంతరం అండగా నిలుస్తోంది.

బిట్రాంజ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ షేకర్ పాషా (Shaker Pasha) మాట్లాడుతూ.. గడచిన దశాబ్దం తమకు నిరంతర పరిణామ క్రమంతో కూడిన గొప్ప ప్రయాణమని పేర్కొన్నారు. కస్టమర్ల సాంకేతిక అవసరాలు సంప్రదాయ ఈఆర్‌పీ అమలు విధానాల నుంచి క్లౌడ్, ఆటోమేషన్, అనలిటిక్స్ , ప్రస్తుతం ఏఐ ఆధారిత పరివర్తన వైపు మారుతున్న కొద్దీ తాము కూడా వారితో పాటే ఎదుగుతూ వచ్చామని వివరించారు. వ్యాపారాల్లో ఎదురయ్యే వాస్తవ సవాళ్లను పరిష్కరించడానికి , విలువను సృష్టించడానికి సాంకేతికతను ఉపయోగించడంపైనే ఎల్లప్పుడూ దృష్టి సారించామని, రెండో దశాబ్దంలోకి అడుగుపెడుతున్న వేళ ఏఐ సృష్టించబోయే నూతన అవకాశాల పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నామని తెలిపారు.

సంస్థ వృద్ధి ప్రయాణంలో హైదరాబాద్ నగరం బలమైన సాంకేతిక నిపుణుల లభ్యతతో కీలకమైన పాత్ర పోషిస్తోందని, గ్లోబల్ సేవల డెలివరీ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరింత వ్యూహాత్మకంగా నిలుస్తుందని కంపెనీ భావిస్తోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏఐ ఆధారిత ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్, క్లౌడ్ ట్రాన్స్‌ఫార్మేషన్, ఆటోమేషన్, డేటా అనలిటిక్స్‌పై మరింత ఫోకస్ పెట్టాలని బిట్రాంజ్ నిర్ణయించింది.

రాబోయే దశాబ్దంలో తర్వాతి తరం ఎంటర్‌ప్రైజ్ పరివర్తన దిశగా అడుగులు వేస్తున్న సంస్థలకు నమ్మకమైన టెక్నాలజీ భాగస్వామిగా మారడమే తమ లక్ష్యమని షేకర్ పాషా స్పష్టం చేశారు. కస్టమర్లు మరింత చురుగ్గా, భవిష్యత్తుకు సంసిద్ధంగా ఉండేలా సాంకేతికత, ప్రతిభ , ఆవిష్కరణలలో నిరంతరం పెట్టుబడులు పెడతామని చెప్పారు. తదుపరి దశాబ్దంలో సాంకేతిక సామర్థ్యాలను విస్తరించుకుంటూ, భారత్-మధ్యప్రాచ్య (ఇండియా-మిడిల్ ఈస్ట్) టెక్నాలజీ వ్యవస్థ వృద్ధికి తన వంతు సహకారాన్ని అందించేందుకు సంస్థ సిద్ధమవుతోంది.

About Author:

Vidya Burujukadi

కంటెంట్ రైటర్‌గా మన వార్త వెబ్ సైట్‌కి విద్య.బి పనిచేస్తున్నారు. ప్రధానంగా బిజినెస్ వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను ఆమె అందిస్తారు. విద్యకు తెలుగు మీడియా…

More About Author »