Gold And Silver Prices: మళ్లీ మొదలైన గోల్డ్ రన్.. ఒక్కరోజే భారీగా పెరిగిన ధర..తులం బంగారం ఇప్పుడు ఎంతంటే?

హైదరాబాద్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.380 పెరిగి రూ.1,54,420కి చేరగా, వెండి ధర రూ.2,70,000 వద్ద స్థిరంగా ఉంది.

Gold price drop in Hyderabad market showing 24 carat and 22 carat gold rates with wedding season buying trend
Gold price drop in Hyderabad market showing 24 carat and 22 carat gold rates with wedding season buying trend

హైదరాబాద్: అక్షయ తృతీయ ముగిసిన తర్వాత వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు, ఇప్పుడు మళ్లీ రివర్స్ గేర్ వేశాయి. గత కొన్ని రోజులుగా ఊరటనిచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా పెరగడంతో కొనుగోలుదారుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. అసలు ఈ పెరుగుదల తాత్కాలికమేనా? లేక ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతాయా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

నేడు మార్కెట్ ధరలు (హైదరాబాద్‌):

  • ఏప్రిల్ 27న నమోదైన తాజా ధరల ప్రకారం.. పసిడి ధరలు ఇలా ఉన్నాయి.
  • 24 క్యారట్ల బంగారం: 10 గ్రాములపై రూ. 380 పెరిగి, ప్రస్తుతం రూ. 1,54,420 కి చేరింది.
  • 22 క్యారట్ల బంగారం: 10 గ్రాములపై రూ. 350 పెరిగి, రూ. 1,41,550 వద్ద కొనసాగుతోంది.
  • 18 క్యారట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ. 1,15,820 గా ఉంది.
  • వెండి: కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 2,70,000 వద్ద స్థిరంగా ఉంది.

ధరలు పెరగడానికి కారణాలేంటి?

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

అంతర్జాతీయంగా డాలర్ స్వల్పంగా బలహీనపడటం బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల పురోగతి కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ నెలకొన్న అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతానికి ధరలు స్వల్పంగా పెరిగినా, గ్లోబల్ మార్కెట్‌లో పరిస్థితులు మెరుగుపడితే ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

పైన పేర్కొన్న ధరలు ఈ రోజు ఉదయం 10 గంటల వరకు అందిన సమాచారం మేరకు మాత్రమే. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రకారం రోజులో ధరలు మారే అవకాశం ఉంది.
Also Read:

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »