Gold Rate: అక్షయ తృతీయకు ముందే షాక్.. ఆకాశాన్ని తాకిన పసిడి ధర.. నేడు తులం బంగారం ఎంతంటే?

అక్షయ తృతీయ వేళ ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు. 24 క్యారెట్ల బంగారం తులం రూ.1,55,780కి చేరగా, వెండి కిలో ఏకంగా రూ.2.80 లక్షలకు పెరిగింది.

Today gold rate
Today gold rate

హైదరాబాద్: బుల్లియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సామాన్యుల అంచనాలకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కొంత మేర తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా, గ్లోబల్ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల అనిశ్చితి పసిడిని పరుగులు పెట్టిస్తోంది. అక్షయ తృతీయ పర్వదినానికి కొద్దిరోజుల ముందే ధరలు ఆకాశాన్ని తాకడం షాపింగ్ ప్రియులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 18, 2026 రోజు తాజా రేట్లు ఇవే.

బంగారం ధరలు:

  • నిన్నటితో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల బంగారంపై (10 గ్రాములు) రూ. 810 మేర పెరిగింది.
  • 24 క్యారెట్ల (స్వచ్ఛమైన) బంగారం: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో తులం ధర రూ. 1,55,780 (గ్రాము ధర రూ. 15,578) కు చేరుకుంది.
  • 22 క్యారెట్ల (ఆభరణాల) బంగారం: ఇదే నగరాల్లో తులం ధర రూ. 1,42,800 (గ్రాము ధర రూ. 14,280) వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు:

  • పసిడి బాటలోనే వెండి కూడా భారీ ఎత్తున పరుగులు తీసింది. నిన్నటితో పోలిస్తే కేజీ వెండిపై ఏకంగా రూ. 5,000 పెరుగుదల నమోదైంది.
  • తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కేజీ వెండి ధర రూ. 2,80,000 మార్కును తాకింది.

గమనిక: పైన పేర్కొన్న ధరలు మార్కెట్ ఒడిదొడుకులపై ఆధారపడి ఉంటాయి. జీఎస్టీ (GST) , మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయి. ఖచ్చితమైన ధరల కోసం మీ సమీపంలోని జ్యువెలరీ షోరూమ్‌ను సంప్రదించడం మంచిది.
Also Read: 

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »