డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ బీస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్.. వైరల్ ఫోటోతో సోషల్ మీడియాలో సునామీ

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా త‌న మ‌జిల్ బాడీ ఫోటోతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాడు. డ్రాగ‌న్ కోసం చేసిన ఈ భారీ ట్రాన్స్‌ఫర్మేషన్ అభిమానుల్లో అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లింది.

Young Tiger Jr NTR showing his muscular back and beast transformation for Prashanth Neel's film Dragon.
Young Tiger Jr NTR showing his muscular back and beast transformation for Prashanth Neel's film Dragon.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన డెడికేషన్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగ‌న్ (వర్కింగ్ టైటిల్) కోసం ఆయన చేసిన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

సోమవారం (ఏప్రిల్ 13) ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. వెనుకకు తిరిగి కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తూ ఇచ్చిన పోజ్ అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది. “ఇది నిర్మించింది.. కొన్నది కాదు” అనే క్యాప్షన్‌తో ఆయన పెట్టిన ఈ పోస్టు ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది.

సునామి లోడింగ్..

ఈ ఫోటో బయటకు వచ్చిన వెంటనే ఫ్యాన్స్ రెచ్చిపోయారు. “బాడీ బాక్సాఫీస్”, “సునామీ లోడింగ్”, “ఫైర్” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ లుక్‌పై ప్రశంసలు కురిపిస్తూ అభిమానులు ఆ ఫోటోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.

ఇటీవల వరకు ఎన్టీఆర్ చాలా సన్నగా కనిపించడంతో అభిమానుల్లో సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు ఒక్కసారిగా మసిల్ బాడీతో దర్శనమివ్వడంతో ఆయన ప్లాన్ స్పష్టమైంది. మొదట బరువు తగ్గి, ఆ తర్వాత కండలు పెంచే విధంగా కఠినమైన ఫిట్‌నెస్ రొటీన్ ఫాలో అయ్యాడని తెలుస్తోంది. గుబురు గడ్డంతో స్టైలిష్‌గా కనిపిస్తూ మాస్ లుక్‌లో ఎన్టీఆర్ మరోసారి ఆకట్టుకుంటున్నాడు.

కెరీర్‌లో మైలురాయిగా..

ఈ నేపథ్యంలో ‘డ్రాగన్’ సినిమా షూటింగ్‌పై కూడా చర్చలు మొదలయ్యాయి. ఇటీవల ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిందని, లుక్ సెట్ కాలేదని, రీషూట్స్ జరుగుతున్నాయని రూమర్స్ వచ్చాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఎన్టీఆర్ తాజా లుక్ చూస్తే షూటింగ్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్టు స్పష్టమవుతోంది.

ఇక ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ పాత్రతో ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడని టాక్. అభిమానులు ఈ సినిమాను ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా భావిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

మరోవైపు, ఎన్టీఆర్ ఇటీవల వార్ 2 సినిమాలో నటించి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన ఈ చిత్రం యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది.

మొత్తానికి, ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ చేసిన ఈ భారీ ట్రాన్స్‌ఫర్మేషన్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని అప్‌డేట్స్ వస్తాయనే ఆసక్తితో అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Also read:

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »