స్విట్జర్లాండ్‌లోనే హనీమూన్‌ షూట్‌ చేయాలా..? నిర్మాతలను కడిగిపారేసిన కమల్‌ హసన్‌..!

సినిమా రంగంలో పెరుగుతున్న భారీ బడ్జెట్‌లు, అవసరం లేని ఖర్చులపై కమల్ హాసన్ (Kamal Haasan) గళమెత్తారు. విదేశీ షూటింగ్‌ల మోజు, నిర్మాణ వ్యయాల పెరుగుదలపై ప్రశ్నలు లేవనెత్తుతూ, కార్మికుల హక్కులు కాపాడుతూ ఖర్చులపై నియంత్రణ అవసరమని ఆయన స్పష్టం చేశారు.

Kamal Haasan
స్విట్జర్లాండ్‌లోనే హనీమూన్‌ షూట్‌ చేయాలా..? నిర్మాతలను కడిగిపారేసిన కమల్‌ హసన్‌..!

Kamal Haasan | భారతీయ సినిమారంగంలో పెరుగుతున్న భారీ బడ్జెట్‌, అనవసర ఖర్చులపై విశ్వనటుడు కమల్‌ హసన్‌ త్రీవంగా స్పందించారు. ప్రస్తుత ఆర్థిక ఒత్తిడులు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య విదేశాల్లో షూటింగ్‌లపై ఎక్కువగా మొగ్గు చూపడడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఈ మేరకు సినీ ప్రముఖులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రతి ప్రేమకథను పారిస్‌ వీధుల్లోనే చూపించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ప్రతి హనీమూన్‌ సన్నివేశం స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు షూట్‌ చేయాలంటూ ప్రశ్నించారు. ప్రేమకు ఫారిన్ కరెన్సీ అవసరం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ఇంధనం, రవాణా ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో సినీ పరిశ్రమలో ఖర్చులపై నియంత్రణ అవసరమని ఆయన పిలుపునిచ్చారు.

Read Also : INCA అవార్డ్స్ 2026: ఉత్తమ నటుడిగా నాగచైతన్య.. రష్మికకు ఉత్తమ నటి అవార్డు! ఏప్రిల్ 16న వేడుక

అయితే, ఈ పొదుపు చర్యల పేరుతో కార్మికులపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భారం పడకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. కార్మికుల వేతనాలు, భద్రత, ఆహారం, రవాణా, వసతి వంటి అంశాల్లో కోతలు విధించడం సరికాదని సూచించారు. పరిశ్రమ నడిచేది వారి కష్టంతోనేనన్న విషయాన్ని గుర్తు చేశారు విశ్వనటుడు. ఆ భారాన్ని వారిపై పడకుండా చూడాలని చెప్పారు. సినిమా రంగంలో అసలు సమస్య కార్మిక వేతనాలు కాదన్నారు. అవసరం లేని హంగులు, విదేశీ లొకేషన్లపై మోజు, నిర్మాణంలో జాప్యం, భారీగా పెరిగిన ప్రొడక్షన్‌ స్టయిల్‌ మాత్రమే కారణమని విమర్శించారు. భారత్‌లోనే ఎన్నో సుందరమైన ప్రదేశాలున్నాయని, వాటినే సరిగ్గా వినియోగించుకుంటే ఖర్చులు భారీగానే తగ్గించొచ్చన్నారు. గతంలో భారీ బడ్జెట్‌ సినిమాలను సైతం ఎక్కువగా హంగులు లేకుండా విజయవంతంగా చిత్రీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Read Also : Devi Putrudu : దేవీపుత్రుడు: 25 ఏళ్ల ‘ద్వారక’ మిస్టరీ.. అప్పట్లో టాలీవుడ్ బాహుబలి, కానీ బాక్సాఫీస్ దగ్గర ఎందుకు బోల్తా పడింది?

ఈ సమస్యపై నిర్మాతలు, నటులు, కార్మిక సంఘాలు, ఫైనాన్షియర్లు, ఓటీటీ వేదికలు కలిసి చర్చించి ఈ దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కమల్ హాసన్ పిలుపునిచ్చారు. సినిమా ఆర్థిక వ్యవస్థను ఇప్పుడే కాపాడుకుంటేనే రేపటి పరిశ్రమకు భద్రత ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కమల్‌ హసన్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలకు పలువురు మద్దతు ప్రకటించారు. సినిమా అనేది కేవలం ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకునేనని.. విదేశాల మోజులో పడి ఆర్థికంగా నష్టపోకూడదని విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. టెక్నాలజీ, విదేశీ షూటింగ్‌లు, భారీ సెట్లు, స్టార్ కాస్టింగ్‌తో ఒక్కో ప్రాజెక్ట్‌ బడ్జెట్‌ వందల కోట్లకు చేరుతోంది. చిన్న, మధ్యస్థాయి సినిమాలకు కూడా ప్రొడక్షన్‌ ఖర్చులు భారంగా మారుతుండడంతో నిర్మాతలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఖర్చుల నియంత్రణపై ఉండాల్సిందేనన్న చర్చ మరోసారి ఊపందుకుంది.

Read Also : రాజభోగాలు వదిలేసిన ‘బుద్ధుడు’.. జనం కోసం శ్రమిస్తున్న ‘కర్మయోగి’: పవన్‌పై డైరెక్టర్ బాబీ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »