రామ్‌చరణ్‌పై ట్రోల్స్‌.. అర్ధరాత్రి బుమ్రాకు క్షమాపణలు చెప్పిన ‘పెద్ది’ స్టార్‌..!

రామ్‌చరణ్‌ (Ram Charan) భోపాల్‌లో జరిగిన Peddi పెద్ది (Peddi) మ్యూజిక్‌ లాంచ్‌లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) గురించి పొరపాటుగా మాట్లాడిన మాటలకు సోషల్‌ మీడియాలో ట్రోరలింగ్‌ జరుగుతోంది. దాంతో రామ్‌చరణ్‌ అర్ధరాత్రి క్షమాపణ చెప్పడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

Ram Charan made a mistake on stage; had to apologize to Jasprit Bumrah at midnight
రామ్‌చరణ్‌పై ట్రోల్స్‌.. అర్ధరాత్రి బుమ్రాకు క్షమాపణలు చెప్పిన ‘పెద్ది’ స్టార్‌..!

Ramcharan | గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రం పెద్ది. ఈ మూవీ ఈవెంట్‌ శనివారం భోపాల్‌లో జరిగింది. ఈ వేడుకలో అభిమానులతో రామ్‌ చరణ్‌ ముచ్చటించాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్‌ జట్టు స్టార్‌ బౌలర్‌కు అర్ధరాత్రి వేళ క్షమాపణలు చెబుతూ ట్వీట్‌ పెట్టాడు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ అంశంలో రామ్‌ చరణ్‌పై దారుణంగా ట్రోలింగ్‌ జరుగుతోంది. అసలు ట్రోలింగ్‌కు కారణం ఏంటీ? బుమ్రాకు ఎందుకు క్షమాపణలు చెప్పాల్సిందో తెలుసుకుందాం. ఈవెంట్‌లో రామ్‌ చరణ్‌ స్టేజ్‌పైకి వచ్చాక యాంకర్‌ ర్యాపిడ్‌ ఫైర్‌ నిర్వహించారు. పెద్దిలో రామ్‌ చరణ్‌ క్రికెటర్‌ పాత్రలో కనిపించనున్న నేపథ్యంలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలే అడిగారు. ఇందులో ప్రముఖ క్రికెటర్ల పేర్లు చెప్పగా.. వారిపై ఒక్క మాటలో స్పందించమని యాంకర్‌ కోరారు. క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ పేరు చెప్పగానే.. ‘ఆయన క్రికెట్‌ కెరీర్‌ చాలాదీర్ఘకాలం కొనసాగింది’ అని రామ్‌ చరణ్‌ తెలిపాడు. మహేంద్ర సింగ్‌ ధోనీ గురించి మాట్లాడుతూ మిస్టర్‌ కూల్‌ అంటూ ప్రశంసించాడు. రోహిత్‌ శర్మ అందరికీ ఇష్టమైన ఆటగాడని, విరాట్‌ పేరు చెప్పగా ఫైర్‌ అంటూ స్పందించాడు.

Read Also : ఏపీకి రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌.. భారీగా పెట్టుబ‌డులు పెడుతున్న ద్విచ‌క్ర వాహ‌నాల కంపెనీ..!

అర్ధరాత్రి క్షమాపణలు..

చివరగా స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా పేరు చెప్పగా.. ‘జస్ప్రీత్‌ బుమ్రా గారికి నేను మీకు పెద్ద అభిమానిని. నాకు ఫుట్‌బాల్‌ చాలా ఇష్టం. మీరు దాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. లవ్‌ యూ సర్‌’ అంటూ చెప్పాడు. దాంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. క్రికెటర్‌ బుమ్రాను ఫుట్‌బాలర్‌గా చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే, వీడియోలు వైరల్‌ కావడంతో రామ్‌చరణ్‌ వెంటనే స్పందించాడు. శనివారం అర్ధరాత్రి సోషల్‌ మీడయా వేదికగా బుమ్రాకు క్షమాపణలు చెప్పాడు. ‘కొన్నిసార్లు పేర్లు మర్చిపోతుంటాను. జస్ప్రీత్‌ బుమ్రా గారికి నా క్షమాపణలు. ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణంలో ఈ పొరపాటు జరిగింది. మీ ఆటకు నేను పెద్ద అభిమానిని. మీరు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఎప్పుడూ ఒత్తిడిలో పెట్టే తీరు ప్రతి భారతీయుడికి గర్వకారణం’ అని పోస్టు పెట్టాడు పెద్ది.

Read Also : తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్ర‌తాపం.. నిజామాబాద్‌లో అత్య‌ధికంగా 45.7 డిగ్రీలు..

సోషల్ మీడియాలో ట్రోలింగ్‌

అయితే, రామ్‌చరణ్‌ వివరణ ఇచ్చినా నెటిజన్లు ట్రోలింగ్‌ను ఆపలేదు. ‘బుమ్రాను ఏ ఆటగాడితో పొల్చుకొని కన్ఫ్యూజ్‌ అయ్యారు? అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, పెద్ద కార్యక్రమాల్లో ఇలాంటి పొరపాట్లు సహజమేనని, వెంటనే క్షమాపణ చెప్పడం రామ్‌చరణ్‌ వినయానికి నిదర్శనమని కొందరు అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పెద్ది మూవీలో రామ్‌ చరణ్‌ ఒక వైపు కూలీగా, మరో వైపు స్పోర్ట్స్‌మెన్‌గా కనిపించనున్నాడు. క్రికెట్‌తో పాటు రెజ్లింగ్‌ నేపథ్యంలో ఆయన పాత్ర ఉండనుంది. ఉప్పెన ఫేమ్‌ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. దివ్యేందు శర్మ, శివరాజ్‌కుమార్‌, జగపతిబాబు, రవికిషన్‌, బొమన్‌ ఇరానీ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ జూన్‌ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Read Also : Rajanna Sircilla | ధాన్యానికి అనుగుణంగా లారీల సంఖ్య పెంచాలి.. క‌లెక్ట‌ర్ గ‌రిమ అగ్ర‌వాల్ ఆదేశం

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »