పెళ్లి వీడియోతో స‌ర్‌ప్రైజ్ చేసిన ర‌ణ‌బాలి టీమ్.. విజ‌య్, ర‌ష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుష్…!

ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగిన విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న వివాహం తర్వాత, ఇప్పుడు ‘రణబాలి’ సినిమా టీమ్ షేర్ చేసిన పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది రియ‌ల్ లైఫ్ వీడియో కాదు.. సినిమాలోన

Ranabaali wedding glimpse

టాలీవుడ్‌లో మొన్నటివరకు లవ్ బర్డ్స్‌గా పేరుగాంచిన రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ , నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్నా ఇప్పుడు అధికారికంగా భార్యభర్తలయ్యారు. రాజస్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో ఉన్న ITC మెమంటోస్ ఉద‌య్‌పూర్ హోటల్‌లో ఫిబ్రవరి 26న వీరి వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరైన ఈ వేడుక టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వివాహం అనంతరం శుక్రవారం ఈ కొత్త దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇక మార్చి 4న హైదరాబాద్‌లోనే రిసెప్షన్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

‘రణబాలి’ టీమ్ సర్‌ప్రైజ్

ఇదిలా ఉంటే, అభిమానులను మరోసారి సర్‌ప్రైజ్ చేస్తూ ‘రణబాలి’ చిత్రబృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అయితే ఇది ఇటీవల జరిగిన అసలైన పెళ్లి వీడియో కాదు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ర‌ణ‌బాలి లోని వెడ్డింగ్ సాంగ్ గ్లింప్స్ మాత్రమే.

Also Read: తాజా సంచలనం – విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ వెనక కీలక రహస్యాలు, కొడుకు కూడా దూరమయ్యాడు!

‘ఏందయ్య సామీ..’ అంటూ సాగే ఈ పెళ్లి పాటలో విజయ్-రష్మికల కెమిస్ట్రీ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ జంట, మూడోసారి కలిసి నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్

ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో విజయ్ ‘రణబాలి’ పాత్రలో కనిపిస్తుండగా, రష్మిక ‘జయమ్మ’గా ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

గత వారం రోజులుగా విజయ్-రష్మిక పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వీరి పెళ్లి వార్తలతో అభిమానులు ఉత్సాహంగా ఉండగా, ఇప్పుడు సినిమా వెడ్డింగ్ వీడియో రావడంతో ఆ హైప్ మరింత పెరిగింది. నిజ జీవితంలో పెళ్లి చేసుకున్న ఈ జంట, రీల్ లైఫ్‌లో కూడా పెళ్లి సన్నివేశాలతో అలరించబోతుండటం విశేషం.

మొత్తానికి, రియల్ వెడ్డింగ్ సంబరాల తర్వాత ‘రణబాలి’ రీల్ వెడ్డింగ్ గ్లింప్స్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చాయి. ఇక సెప్టెంబర్ 11న ఈ జంట మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. గ‌తంలో విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక జంట న‌టించిన గీతా గోవిందం చిత్రం పెద్ద హిట్ అయింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన డియ‌ర్ కామ్రేడ్ కాస్త నిరాశ ప‌రిచింది. ఇక ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడో సారి వీరి కాంబోలో వ‌స్తున్న ర‌ణ‌బాలి చిత్రం ఎంత పెద్ద హిట్ అవుతుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో
ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »