తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్‌కు ఈరోజు బ్రేకింగ్ షాక్ తగిలింది. 1999 నుంచి విజయ్ జీవిత భాగస్వామిగా ఉన్న సంగీత చెంగల్పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఒక సినీ నటితో విజయ్‌కు వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ ఈ కీలక పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణకు అంగీకరించిన కోర్టు ఏప్రిల్ 20న హాజరు కావాలని విజయ్‌కు నోటీసు జారీ చేసింది.
విడాకుల వెనక కీలక రహస్యాలేమిటి?
విజయ్ విడాకుల వెనక పేరుకుపోయిన నొప్పి చాలా ఉందని తెలుస్తోంది. విజయ్‌తో కలిసి నటించిన ఒక స్టార్ హీరోయిన్ ఆ సినిమా పూర్తయిన తర్వాత ఏకంగా విజయ్ ఉంటున్న ఏరియాలోనే ఇల్లు కొనుక్కోవడం సంగీతలో అనుమానాలు పెంచిందని సమాచారం. దీన్ని తెలుసుకున్న సంగీత అప్పట్లోనే అమెరికా వెళ్లిపోయారని, గత కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య మాటలు కూడా లేవని వెల్లడవుతోంది. ఐదేళ్లుగా నరకం చూస్తున్నానని సంగీత చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నాగేంద్రన్ కూడా విజయ్‌కు నటి త్రిషతో లింక్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానిపై త్రిష ఓపెన్ లెటర్ విడుదల చేసి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నాగేంద్రన్ తర్వాత క్షమాపణ చెప్పారు. అయితే ఆ వివాదం సద్దుమణగకముందే సంగీత విడాకుల పిటిషన్ మళ్లీ పాత అనుమానాలన్నింటికీ బలం చేకూర్చింది.
Also Read: ‘జన నాయగన్’కు మళ్లీ షాక్ .. సెన్సార్ విషయంలో సింగిల్ బెంచ్ తీర్పు రద్దు, సినిమా రిలీజ్‌కు బ్రేక్
కొడుకు సంజయ్ కూడా దూరమయ్యాడు
విజయ్‌కు కుటుంబంలో ఇది మాత్రమే సంచలనం కాదు. ఆయన కొడుకు జాసన్ సంజయ్ కూడా తండ్రితో పూర్తిగా అంటిముట్టనట్లుగా ఉంటున్నాడని తాజా సమాచారం. సూపర్ స్టార్ కొడుకు అయ్యుండీ తండ్రి పేరు వాడుకోకుండా, సొంత గుర్తింపు తెచ్చుకోవాలని హీరో అవ్వకుండా దర్శకుడిగా మారాడు. ప్రస్తుతం టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌తో ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. కొడుకు ఇలా దూరంగా ఉండటం విజయ్ కుటుంబంలోని కలహాలను మరింత స్పష్టం చేస్తోంది.
రాజకీయ భవిష్యత్‌పై ప్రభావం తప్పదా?
విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వరసగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 2025లో TVK ర్యాలీలో 41 మంది మరణించిన సంఘటన, జన నాయగన్ సినిమాపై ఆంక్షలు, ఇప్పుడు భార్య విడాకుల పిటిషన్ — ఇవన్నీ ఒకదాని వెంట ఒకటిగా వచ్చి పడుతున్నాయి. ఎన్నికలకు ముందే సంగీత ఇలా ఓపెన్ అవడం వెనక రాజకీయ కుట్ర దాగుందా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. పర్సనల్ లైఫ్ వివాదాలు రాజకీయ ప్రత్యర్థులకు పదునైన అస్త్రంగా మారాయని పూర్తి వివరాలు తెలిసిన వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలన్నింటిపై విజయ్ ఇంతవరకూ అధికారిక స్పందన ఇవ్వలేదు.