హైదరాబాద్‌లో నేడు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

ఉప్పల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి జలమండలి పైప్‌లైన్ జంక్షన్ పనులు చేపడుతోంది. దీంతో నేడు (జూలై 27) ఉదయం 10 గంటల నుంచి పలు ప్రాంతాల్లో 24 గంటల పాటు మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు HMWSSB ప్రకటించింది.

hyderabad-water-supply-disruption-
hyderabad-water-supply-disruption-
  • హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB)
  • 24 గంటల పాటు మంచినీటి సరఫరాకు అంతరాయం
  • నేడు (27 జూలై 2026) ఉదయం 10 గంటల నుంచి 28 జూలై ఉదయం 10 గంటల వరకు
  • ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన పైప్‌లైన్ జంక్షన్ పనులు

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు (జూలై 27) మంచినీటి సరఫరాకు 24 గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) కీలక ప్రకటన విడుదల చేసింది.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న గ్రేడ్ సెపరేటర్ (ఫ్లైఓవర్) పనులను వేగవంతం చేయడానికి కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు (KWSP) ఫేజ్-2 రింగ్ మెయిన్-2కు చెందిన 1600 మిల్లీమీటర్ల వ్యాసం గల ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్‌పై జంక్షన్ పనులు చేపడుతున్నారు.

ఎందుకు నీటి సరఫరా నిలిపివేస్తున్నారు?

ఉప్పల్ జంక్షన్ నుంచి వరంగల్ హైవే వైపు రహదారి ఇప్పటికే మూసివేసిన నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడం, ఫ్లైఓవర్ P15 ఫౌండేషన్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడం లక్ష్యంగా ఈ అత్యవసర పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కారణంగా రేపు (27 జూలై) ఉదయం 10 గంటల నుంచి 28 జూలై  ఉదయం 10 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేయనున్నారు.

నీటి సరఫరా నిలిచే ప్రాంతాలు

ఈ ప్రాంతాల ప్రజలు ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలని జలమండలి సూచించింది.

ఫతేనగర్
హస్మత్‌పేట్
ప్రకాశ్‌నగర్
నాచారం
హెచ్‌ఎంటీ నగర్
బీరప్పగడ్డ
హబ్సిగూడ
రామంతాపూర్
వెంకటరెడ్డి నగర్
ఉప్పల్
మేకలమండి
భోలక్‌పూర్ (పాక్షికంగా)
పద్మారావు నగర్
బన్సీలాల్‌పేట్
బౌద్ధనగర్
తార్నాక (పాక్షికంగా)
సీతాఫల్‌మండి
మెట్టుగూడ
లాలాపేట్ (పాక్షికంగా)
నార్త్ లాలాగూడ
అడ్డగుట్ట
బాలానగర్
సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాంతం
ఎంఈఎస్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధి
ప్రజలకు HMWSSB సూచనలు

నీటి సరఫరా నిలిచే ప్రాంతాల్లో నివసించే ప్రజలు అవసరమైనంత నీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలని, నీటిని పొదుపుగా వినియోగించాలని జలమండలి కోరింది. పనులు పూర్తయిన వెంటనే పైప్‌లైన్‌ను పునరుద్ధరించి దశలవారీగా నీటి సరఫరాను పునఃప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.

నగరాభివృద్ధిలో భాగమే ఈ పనులు

ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే నిర్మాణ పనుల కారణంగా తాత్కాలికంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నందున ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »