-
దేశ రాజకీయ చరిత్రలో వైమానిక ప్రమాదాలు ఎన్నో విషాదాలను మిగిల్చాయి.
-
గతంలో వైమానిక ప్రమాదాల్లో మృతి చెందిన ప్రముఖ నేతలు
-
తాజాగా, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు.
మహారాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా కుదిపేసే విషాద ఘటన ఈరోజు చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పుణె జిల్లా బారామతి సమీపంలో మంగళవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ ఘటనను ధృవీకరించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నిమిత్తం అజిత్ పవార్ బుధవారం ఉదయం 8 గంటలకు ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బారామతికి బయల్దేరారు. విమానంలో ఆయనతో పాటు మరో నలుగురు ప్రయాణిస్తున్నారు.
బారామతి విమానాశ్రయం సమీపానికి చేరుకున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నించగా, విమానం అదుపుతప్పి కుప్పకూలింది. నేలపై పడిన వెంటనే భారీగా మంటలు చెలరేగి, దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో విమానంలోని ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అజిత్ పవార్ మృతి వార్తతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు.
⇒ ఆగ్రాలో కిరాతక హత్య.. పెళ్లికి నిరాకరించిందని సహోద్యోగిని ముక్కలుగా నరికిన వ్యక్తి
గతంలో వైమానిక ప్రమాదాల్లో మృతి చెందిన ప్రముఖ నేతలు:
దేశ రాజకీయ చరిత్రలో వైమానిక ప్రమాదాలు ఎన్నో విషాదాలను మిగిల్చాయి. అజిత్ పవార్ ఘటన, గతంలో చోటుచేసుకున్న ఇలాంటి సంఘటనలను మళ్లీ గుర్తుకు తెస్తోంది.
వై.ఎస్. రాజశేఖర రెడ్డి :
- 2009 సెప్టెంబర్ 2
- నల్లమల అడవుల్లో హెలికాప్టర్ ప్రమాదం
- అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
జీఎంసీ బాలయోగి :
- 2002 మార్చి 3
- పశ్చిమ గోదావరి జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదం
- లోక్‌సభ స్పీకర్
మాధవరావు సింధియా :
- 2001
- ఉత్తరప్రదేశ్‌లో విమాన ప్రమాదం
- కాంగ్రెస్ సీనియర్ నేత
సంజయ్ గాంధీ :
- 1980
- ఢిల్లీలో విమానం నడుపుతూ ప్రమాదం
దోర్జీ ఖండు :
- 2011
- అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి
- హెలికాప్టర్ ప్రమాదం
ఓపీ జిందాల్ :
- 2005
- హర్యానా మంత్రి, పారిశ్రామికవేత్త
- హెలికాప్టర్ ప్రమాదం
విజయ్ రూపానీ :
- 2024
- అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం
- గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి
అజిత్ పవార్ మరణంతో ఈ విషాద జాబితాలో మరో కీలక పేరు చేరింది. ఈ ఘటన దేశ రాజకీయాల్లో తీరని లోటుగా మిగిలిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే సాంకేతిక సమస్య కారణంగా బారామతి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడని ఎలా గుర్తించారో ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
గాగుల్స్, చేతివాచీ ఆధారంగా అజిత్ పవార్‌ను గుర్తించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వాటి ఆధారంగానే ప్రమాదానికి గురైంది ఉప ముఖ్యమంత్రి అని తెలుసుకున్నామని అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత నాలుగైదు పేలుడు శబ్ధాలు వినిపించినట్లు వారు స్పష్టం చేశారు. తమ కళ్ల ముందే ప్రమాదం జరిగిందని, విమానం ఉన్నట్లుండి కిందకు వస్తుంటే అది కూలిపోయేలా ఉందని తమకు అర్ధమైందని పేర్కొన్నారు.