UPI Paymentsపై MDR Charges.. ఈ 7 Transactions మాత్రం Free

UPI Paymentsపై MDR Charges అమలులోకి వచ్చినా కొన్ని లావాదేవీలు ఉచితంగానే ఉంటాయి. Customerలు Charges లేకుండా చేయగల 7 రకాల UPI Transactions ఇవే.

UPI MDR Charges
UPI MDR Charges

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21 : కేంద్ర ప్రభుత్వం UPI లావాదేవీలకు సంబంధించి కొత్త విధానం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ 15 నుంచి రూ.2,000కు పైగా Customer నుంచి స్వీకరించే UPI Paymentsపై వ్యాపారులకు MDR Charges వర్తించనున్నట్లు సమాచారం. అయితే ఈ చార్జీల భారం Customerపై పడదని, వ్యాపారుల నుంచే వసూలు చేయనున్నట్లు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో కొన్ని రకాల UPI లావాదేవీలను మాత్రం ఎలాంటి Charges లేకుండా ఉచితంగా నిర్వహించుకోవచ్చు.

UPI Paymentsపై MDR Charges అమలులోకి వస్తే రూ.2,000కు పైగా Customer నుంచి స్వీకరించే Paymentsపై వ్యాపారులు Banks, Payment Operatorsకు Charges చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఈ భారం Customerలపై మోపే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే Customerలపై అదనపు భారం వేయకూడదని, MDR Chargesను వ్యాపారుల నుంచే వసూలు చేయాలని సూచించినట్లు సమాచారం.

RBI, NPCI నిబంధనల ప్రకారం కొన్ని UPI లావాదేవీలకు ఎలాంటి Charges ఉండవు. వ్యక్తి నుంచి మరో వ్యక్తికి UPI ద్వారా డబ్బులు పంపించుకోవడం పూర్తిగా ఉచితం. రోజువారీ Cash Limitకు లోబడి చేసే ఈ Transactionsపై ఎలాంటి Charges చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే ఇతరుల నుంచి UPI ద్వారా డబ్బులు స్వీకరించడంపైనా Charges ఉండవు.

చిన్న వ్యాపారులు, కిరాణా Shops వంటి వాటి వద్ద నెలకు రూ.లక్ష వరకు చేసే నగదు బదిలీలపై కూడా Charges ఉండవని పేర్కొంటున్నారు. దీంతో ఈ పరిమితిలోపు Transactionsను ఎలాంటి అదనపు భారం లేకుండా చేసుకోవచ్చు.

వ్యాపారుల వద్ద రూ.2,000లోపు చేసే UPI Paymentsకు కూడా Charges ఉండవు. రూ.2,000కు పైగా Customer నుంచి స్వీకరించే UPI Paymentపైనే MDR Charges వర్తిస్తాయని సమాచారం. ఈ Chargesను Customer నుంచి వసూలు చేయకుండా వ్యాపారులే భరించాల్సి ఉంటుంది.

Government Challans, Taxes, Services, Fundsకు సంబంధించి చేసే UPI Transactions కూడా ఉచితంగానే ఉంటాయి. అయితే Utility Bills విషయంలో Charges వర్తించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

UPI Auto Mandate Transactions కూడా పూర్తిగా ఉచితమని సమాచారం. Utility Bills, OTT Subscriptions, SIP Payments వంటి వాటిని Auto Payment Modeలో చెల్లించినప్పుడు అదనపు Charges ఉండవని పేర్కొంటున్నారు.

అలాగే పెద్ద వ్యాపారుల వద్ద రూ.2,000లోపు చేసే UPI Transactionsకు కూడా Charges ఉండవు. రూ.2,000 పరిమితి దాటినప్పుడు వర్తించే MDR Chargesను వ్యాపారుల నుంచి Banks, Payment Institutions వసూలు చేస్తాయి.

మొత్తంగా UPI వినియోగదారులపై MDR Charges భారం వేయకూడదని కేంద్రం స్పష్టం చేసినట్లు సమాచారం. Customer నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »