ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్.. ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్!

Foldable iPhone: యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్, ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. బుక్-ఫోల్డ్ డిజైన్, భారీ డిస్‌ప్లే, టచ్ ఐడీ, 48MP కెమెరాలతో 2026లో లాంచ్ అయ్యే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి.

Apple Foldable iPhone leaked design and features
Apple Foldable iPhone leaked design and features

Foldable iPhone

  • యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ‘బుక్-ఫోల్డ్ డిజైన్’తో 7.8 అంగుళాల మెయిన్ స్క్రీన్, 5.3 అంగుళాల కవర్ డిస్‌ప్లేతో రానుంది.

  • ఫేస్ ఐడీకి బదులుగా టచ్ ఐడీ, 48MP డ్యూయల్ కెమెరా సెటప్, టైటానియమ్ + అల్యూమినియం బాడీ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం.

  • 2026 సెప్టెంబర్‌లో ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉందని లీకులు చెబుతున్నాయి.

ఐఫోన్ అభిమానులకు అదిరిపోయే వార్త వెలువడింది. ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించిన డిజైన్, కొన్ని కీలక ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అవడంతో టెక్ ప్రపంచంలో ఆసక్తి నెలకొంది. లీకైన డిజైన్‌ను పరిశీలిస్తే, ఈ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ సిరీస్ మాదిరిగా ‘బుక్-ఫోల్డ్ లైక్ డిజైన్’లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

డిజైన్ హైలైట్స్

  • లీక్ అయిన చిత్రాల ప్రకారం ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ చాలా స్లీక్‌గా, ప్రీమియం ఫినిష్‌తో ఉండనుంది.
  • బటన్‌ల అమరికలో యాపిల్ కొత్త మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం.
  • వాల్యూమ్ బటన్లు ఫోన్ టాప్ ఎడ్జ్ కుడివైపున ఉండనున్నాయి
  • టచ్ ఐడీ కలిగిన పవర్ బటన్ కూడా కుడి వైపునే ఉంటుంది
  • కెమెరా కంట్రోల్ బటన్ కూడా కుడివైపునే ఉండనుంది
  • ఎడమ వైపున ఎలాంటి బటన్లు లేకుండా క్లీనర్ డిజైన్ ఇవ్వనున్నట్లు లీకులు చెబుతున్నాయి

కెమెరా సెటప్ ప్రత్యేకత :

  • ఫోల్డబుల్ ఐఫోన్ కెమెరా డిజైన్ ఇప్పటి వరకు వచ్చిన ఐఫోన్ మోడల్స్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉండనుందని తెలుస్తోంది.
  • ఫ్రంట్ కెమెరా సింగిల్ పంచ్-హోల్ డిజైన్‌లో ఉంటుంది
  • రియర్ కెమెరా ప్లాట్యూలో అడ్డంగా అమర్చిన డ్యూయల్ కెమెరా సెటప్
  • రెండు 48 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉండనున్నాయి
  • మైక్రోఫోన్, ఫ్లాష్ కూడా అదే ప్లాట్యూలో ఉంటాయి
  • ప్లాట్యూ బ్లాక్ కలర్‌లో ఉండి, ఫోన్ కలర్ ఏదైనా కెమెరా భాగం మాత్రం బ్లాక్‌గా ఉంటుంది
  • రెండు స్క్రీన్‌లలోనూ 18MP సెల్ఫీ కెమెరాలు ఏర్పాటు చేసే అవకాశం
  • ఒకటి ఫోన్ ఫోల్డ్‌లో ఉన్నప్పుడు వీడియో కాల్స్ కోసం
  • మరొకటి మెయిన్ డిస్‌ప్లే కోసం

డిస్‌ప్లే & ఫీచర్లు :

  • ఫోల్డబుల్ ఐఫోన్‌లో భారీ స్క్రీన్ అనుభవాన్ని అందించేలా యాపిల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
  • 7.8 అంగుళాల మెయిన్ ఫోల్డబుల్ డిస్‌ప్లే
  • 5.3 అంగుళాల కవర్ స్క్రీన్
  • ఫోన్ ఓపెన్ చేయకుండానే క్విక్ టాస్క్స్ చేయగల అవకాశం
  • ఫేస్ ఐడీకి బదులుగా టచ్ ఐడీ తీసుకురానున్నట్లు లీకులు
  • భారీ బ్యాటరీ సామర్థ్యం ఉండే అవకాశాలు

బిల్డ్ క్వాలిటీ & పనితీరు :

  • ఈసారి యాపిల్ మెటీరియల్స్ విషయంలో కూడా మార్పులు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
  • టైటానియమ్ + అల్యూమినియం మిక్స్ బాడీ నిర్మాణం
  • 12GB LPDDR5 ర్యామ్
  • యాపిల్ సరికొత్త C2 మోడమ్ సపోర్ట్
  • కేవలం రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే విడుదల చేసే అవకాశం

ఐఫోన్ 18 విడుదలపై లీకులు

  • ఫోల్డబుల్ ఐఫోన్‌తో పాటు ఐఫోన్ 18 సిరీస్ విడుదల తేదీలపై కూడా పలు నివేదికలు బయటకు వచ్చాయి.
  • 2026 సెప్టెంబర్‌లో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ విడుదల అవకాశం
  • అదే ఈవెంట్‌లో ఫోల్డబుల్ ఐఫోన్ కూడా లాంచ్ అయ్యే ఛాన్స్
  • ఐఫోన్ 18 స్టాండర్డ్ మోడల్ 2027 మార్చి–మే మధ్య విడుదల అయ్యే సూచనలు
  • ఐఫోన్ 18e, ఐఫోన్ ఎయిర్ 2 మోడల్స్ కూడా లైనప్‌లో ఉండనున్నట్లు సమాచారం

భారత్‌లో ఐఫోన్ క్రేజ్ :

భారత్‌లో ఐఫోన్‌లకు ఉన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. టెక్ నివేదికల ప్రకారం 2025లో భారత్‌లో యాపిల్ ఫోన్ల విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దేశంలోకి యాపిల్ ఫోన్ షిప్‌మెంట్లు సుమారు 14 మిలియన్ యూనిట్లకు చేరినట్లు సమాచారం. ఫోల్డబుల్ ఐఫోన్ అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే ధర, పూర్తి ఫీచర్లు, కెమెరా సామర్థ్యం వంటి వివరాలు స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.

Also Read: శాంసంగ్ మొబైల్స్ ఇష్ట‌ప‌డే వారికి గుడ్ న్యూస్.. గెలాక్సీ F70e 5G త్వరలో లాంచ్,ధ‌ర ఎంత అంటే..!

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »