POCSO Case | కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధిత మైనర్ బాలిక తల్లి సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. తమ కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులు, భయాందోళనలు, న్యాయపోరాటంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఆమె ఆ ప్రకటనలో వివరంగా వెల్లడించారు. ఇది పగతోనో, ప్రచార ఉద్దేశంతోనో చేయడం కాదని, కేవలం తమ బాధను సమాజానికి తెలియజేయడానికేనని ఆమె స్పష్టం చేశారు. తాము సాధారణ మధ్యతరగతి కుటుంబమని, ఎలాంటి రాజకీయ అండదండలు లేవని పేర్కొన్న ఆమె.. ‘మా కూతురికి రక్షణ, గౌరవం, భవిష్యత్తు అందరి పిల్లల్లాగే ఉండాలి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఈ రోజు తమ బిడ్డ కోసం న్యాయం కోరుతూ సమాజంలోని వ్యవస్థలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని వాపోయింది.
Read Also : బండి సంజయ్ కొడుకుపై లుక్ అవుట్ నోటీసు జారీ చేయాలి.. కవిత డిమాండ్
Hyderabad New Elevated Corridor: హైదరాబాద్‌లో నాలుగు లైన్లతో కొత్త హైవే.. హెచ్ఎండీఏ ప్రతిపాదనలు
Bandi Bageerath Bail: తొమ్మిది రోజులు పరారీ, 49 రోజులుగా జ్యుడీషియల్ కస్టడీ.. భగీరథ్ బెయిల్ పిటిషన్లో ఏముంది?
National Ice Skating: ఐస్ స్కేటింగ్‌లో హైదరాబాద్ కుర్రాడి అద్భుతం.. జాతీయ పోటీల్లో మూడు గోల్డ్ మెడల్స్ సొంతం!
2025లోనే భగీరథ్‌తో పరిచయం..
గతంలో బండి సంజయ్ ఇంటికి, ఆయన అనుచరుడు సంగప్ప కోరితే వెళ్లామని.. కానీ, బండి సంజయ్ బెదిరింపులకు దిగారని ఆరోపించారు. దీంతోపాటు తమ కుటుంబం పైన సామాజిక మాధ్యమాల ద్వారా, వ్యక్తుల ద్వారా జరుగుతున్న బెదిరింపులు, దాడులు తీవ్రమైన భయాన్ని కలిగిస్తున్నాయని వాపోయారు. తమ బిడ్డ పుట్టిన తేదీకి సంబంధించి కావాలనే వివాదం రేపి న్యాయపరమైన విచారణ ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన కుమార్తెకు 2025లో బండి భగీరథ్‌తో పరిచయం ఏర్పడిందని, అది మొదట సాధారణ పరిచయంగా ప్రారంభమై ఆ తర్వాత మానసికంగా ప్రభావితం చేసే స్థాయికి చేరిందని ఆమె ఆరోపించారు. పదేపదే ఒత్తిడి, ప్రలోభాల ద్వారా తన కుమార్తెను మానసికంగా నియంత్రించినట్లు తెలిపారు. క్రమంగా ఆమె పూర్తిగా అతని ప్రభావంలోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె ఇష్టం లేకపోయినా అనేక సందర్భాల్లో ఒత్తిడి ఎదుర్కొన్నదని, శారీరక సంబంధం కోసం కూడా పదేపదే బలవంతం చేసినట్లుగా ఆరోపించారు. తీవ్ర ప్రతిఘటన చేసిన సందర్భాల్లోనూ ఒత్తిడి కొనసాగిందన్నారు. 2025 డిసెంబర్ 31 రాత్రి నుంచి 2026 జనవరి ఒకటిన తెల్లవారుజామున మోయినాబాద్‌లో తన కుమార్తెపై తీవ్ర ఘటన జరిగిందని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు ఇష్టం లేకపోయినా మద్యం సేవించాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చారని, అనంతరం అచేతన స్థితిలో ఉన్న సమయంలో అనుచితంగా ప్రవర్తించి శారీరకంగా దాడి చేశారని ఆరోపించారు.
Read Also :వాత మొదలైంది.. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.3 పెంపు..!
శారీరక సంబంధం కోసం ఒత్తిడి..
అనేకసార్లు శారీరక సంబంధం కోసం ఒత్తిడి కొనసాగిందని, ఈ ఘటనలతో తమ కుమార్తె తీవ్ర మానసిక వేదనకు గురైందని తెలిపారు. చివరికి 2026 మార్చి–ఏప్రిల్ సమయంలో చట్టపరంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఏప్రిల్ 22న సంగప్ప అనే వ్యక్తి తమ ఇంటికి వచ్చి మాట్లాడారని, ఆ తర్వాత ఏప్రిల్ 23న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటికి వెళ్లినట్లు ఆమె వివరించారు. అక్కడ తమకు భరోసా లభిస్తుందని ఆశించామని, బాధితురాలైన కూతురు తల్లిదండ్రులుగా ఆ భేటీకి వెళ్లామని, తమకు భరోసా, రక్షణ కలుగుతుందని అనుకున్నామని.. కానీ, మంత్రి ఇంటి నుంచి భయాందోళనలతో బయటకు వచ్చాయని తెలిపారు. కేంద్రమంత్రి రాజకీయ ప్రాబల్యం, మద్దతుదారుల ద్వారా, అనుచరులతో తమ కుటుంబానికి కష్టాలు తప్పవు అని, జరగబోయే పరిణామాల గురించి బండి సంజయ్ చేసిన చెప్పిన మాటలు, హెచ్చరికలు, బెదిరింపులు తమని తీవ్రంగా భయపెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి తమ కుటుంబం నిరంతర భయంతో జీవిస్తున్నామని తెలిపారు. తర్వాత ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి పోక్సో చట్టం కింద ఫిర్యాదు ఇచ్చామని తెలిపారు.
Read Also : ₹1.5 కోట్ల ట్యాక్స్ బకాయి: జయలలితా హైదరాబాద్ ఇల్లు సీజ్
జ్యురిడిక్షన్ పేరుతో సమస్యలు
అయితే, తొలుత ఫిర్యాదు నమోదు విషయంలో ఆలస్యం జరిగిందని, ఐదు గంటలకు పైగా స్టేషన్‌లో వేచి ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జ్యురిస్డిక్షన్ సమస్యల పేరుతో ఫిర్యాదును ముందుకు సాగనివ్వలేదని, చివరికి జీరో ఎఫ్‌ఐఆర్ కోసం పట్టుబట్టిన తర్వాత రశీదు ఇచ్చారని పేర్కొన్నారు. మొదట నమోదు చేసిన ఫిర్యాదులో తీవ్రమైన సెక్షన్లు చేర్చలేదని, ప్రజల ఆందోళన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి మరింత వివరాలతో వాంగ్మూలం తీసుకున్న అనంతరం తీవ్రమైన సెక్షన్లు నమోదు చేసినట్లు తెలిపారు. తమపై సోషల్ మీడియా ద్వారా, వ్యక్తుల ద్వారా బెదిరింపులు, దుష్ప్రచారం జరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమార్తె ఫోటోలు, గుర్తింపు బయటకు తీసుకురావడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇది చట్టవిరుద్ధమని హెచ్చరించారు. పుట్టిన తేదీ వంటి అంశాలపై కావాలనే వివాదం సృష్టించి విచారణను ఆలస్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆమె ఆరోపించారు. నిందితుడు బండి భగీరథ్ ఇంకా స్వేచ్ఛగా ఉన్నాడని, తమ కుటుంబానికి తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే పిల్లకీ జరగకూడదని, కేసును నిష్పాక్షికంగా, స్వతంత్రంగా, న్యాయబద్ధంగా విచారించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Latter (లెటర్‌పై క్లిక్ చేయండి)