శ‌త‌భిష న‌క్ష‌త్రంలోకి రాహువు.. ఈ మూడురాశుల వారు త‌స్మాత్ జాగ్ర‌త్త‌..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు (Rahu) శతభిష నక్షత్రం (Shatabhisha Nakshatra)లోకి ప్రవేశించడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సంచారం ప్రభావం అన్ని రాశులపై (Zodiac Signs) కనిపించినప్పటికీ వృషభం, కన్య, మకర రాశుల (Taurus, Virgo, Capricorn) వారికి ఎక్కువ జాగ్రత్త ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగ ఒత్తిడి (Job Stress), వ్యాపార సమస్యలు (Business Issues), ఆర్థిక ఒడిదుడుకులు (Financial Instability) ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Rahu Transit | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఛాయాగ్రహమైన రాహువు ఆదివారం శతభిష నక్షత్రం తొలి పాదంలోకి ప్రవేశించాడు. శతభిష నక్షత్రాన్ని రాహువుకు సొంత న‌క్ష‌త్రంగా భావిస్తారు. దీంతో ఈ సంచారం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. రాహువు స్థానం మార్పు ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై ప‌డ‌నుంది. కొన్ని రాశుల వారు ఈ కాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో మానసిక ఒత్తిడి, నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధత, ఆర్థిక ఇబ్బందులు వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చ‌రిస్తున్నారు.

వృషభ రాశి

వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తొంద‌ర‌పాటుతో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఖర్చులపై నియంత్రణ లేకపోతే ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఉన్నతాధికారులతో అభిప్రాయ భేదాలు త‌లెత్తే అవ‌కాశం ఉంది. చిన్న బాధ్యతలకే ఎక్కువ శ్రమ పడాల్సిన పరిస్థితి ఎదుర‌వుతుంది. చేసే పనుల్లో ఓర్పు పాటించడం అవ‌స‌రం. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవడం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుంది.

కన్య రాశి

కన్య రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మానసిక ఒత్తిడి, అలసట వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. చిన్న అపార్థాలు సైతం సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముంది. దాంపత్య జీవితంలో చిన్న విషయాలకే విభేదాలు తలెత్తవచ్చు. ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు పెరగడంతో ఆర్థిక సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది.

మకర రాశి

మకర రాశి వారు ఈ కాలంలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదు. ఉద్యోగ బాధ్యతలు పెరగడం, అదనపు పనిభారం కారణంగా మానసిక ఒత్తిడి అధికమయ్యే అవకాశం ఉంది. మాటతీరు, ప్రవర్తనలో సంయమనం పాటించడం అవసరం. లేకపోతే అనవసర వివాదాలు తలెత్తే అవకాశముంది. అయితే, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని సానుకూల పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పండితులు పేర్కొంటున్నారు.

Read Also : రోహిణి నక్షత్రంలో సూర్యుడి సంచారం.. మేషం నుంచి కన్యారాశి అంతా అదృష్టమే..!

Read Also : ఈరోజు రాశిఫలాలు.. ఆర్థిక లాభాలు ఎవరికి? జాగ్రత్తలు ఎవరికి?

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »