శ్రీశైలం వెళ్లే ముందు ఇది తప్పక తెలుసుకోండి

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఆలయ దర్శన వేళలు, సేవల ధరలు, ఆన్‌లైన్ బుకింగ్, ఉచిత సౌకర్యాలు, లడ్డూ ప్రసాదం త్వరగా పొందే మార్గం, చిన్నారులతో వెళ్లేవారికి ఉన్న ప్రత్యేక సదుపాయాలపై పూర్తి సమాచారం.

Srisailam Mallikarjuna Swamy
Srisailam Mallikarjuna Swamy
  • వాట్సాప్ ద్వారానే దర్శనం, సేవలు, ప్రసాదాలు బుక్ చేసుకునే అవకాశం.
  • ఆన్‌లైన్ చెల్లింపుతో లడ్డూ ప్రసాదం తక్కువ సమయంలో పొందొచ్చు.
  • ఒక సంవత్సరం లోపు చిన్నారితో వెళ్తే తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శన సౌకర్యం.

దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా శ్రావణమాసం, కార్తీకమాసం, సెలవు రోజులు, పండుగల సమయంలో భారీగా రద్దీ ఉంటుంది.

అయితే ముందుగానే కొన్ని విషయాలు తెలుసుకుంటే దర్శనం, సేవలు, ప్రసాదాలు, వసతి వంటి అంశాల్లో సమయం ఆదా చేసుకోవచ్చు. భక్తులకు ఉపయోగపడే ముఖ్యమైన వివరాలు ఇవే.

సాధారణ రోజుల్లో ఆలయ దర్శనం ఇలా..

మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో ఉదయం 3 గంటలకు మంగళవాయిద్యాలతో ఆలయ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.

ఉదయం 4.30 గంటల నుంచి మహామంగళహారతి అనంతరం సర్వదర్శనం ప్రారంభమవుతుంది. అనంతరం అభిషేకాలు, శీఘ్ర దర్శనం, సామూహిక సేవలు, సర్వదర్శనం నిర్ణీత సమయాల ప్రకారం కొనసాగుతాయి.

శని, ఆదివారం, సోమవారం మరియు పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శన సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.

ప్రముఖ నిత్యార్జిత సేవలు.. ఎంత ఖర్చవుతుంది?

శ్రీశైలం దేవస్థానంలో భక్తుల కోసం పలు ఆర్జిత సేవలు అందుబాటులో ఉన్నాయి.

కొన్ని ముఖ్యమైన సేవలు…

  • శ్రీ స్వామివారి గర్భాలయ అభిషేకం – ₹5,000
  • సామూహిక అభిషేకం – ₹1,500
  • అమ్మవారి కుంకుమార్చన – ₹500 నుంచి ₹1,000
  • గణపతి హోమం – ₹1,116
  • రుద్రహోమం – ₹1,500
  • చండీహోమం – ₹1,500
  • మృత్యుంజయ హోమం – ₹1,500
  • స్వామివారి కల్యాణోత్సవం – ₹1,000
  • సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం – ₹1,000
  • అన్నప్రాశనం – ₹1,000
  • అక్షరాభ్యాసం – ₹500
  • గోపూజ – ₹300
  • వాట్సాప్ ద్వారానే దర్శనం బుక్ చేసుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘మన మిత్ర’ వాట్సాప్ సేవ ద్వారా శ్రీశైలం దర్శనం, ఆర్జిత సేవలు, ప్రసాదాలు, విరాళాలు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.

అందుకోసం…

  • 9552300009 నంబర్‌ను సేవ్ చేయాలి.
  • వాట్సాప్‌లో Hi అని మెసేజ్ పంపాలి.
  • Temple Booking Services ఎంపిక చేయాలి.
  • Srisailam ఆలయాన్ని ఎంచుకోవాలి.
  • కావాల్సిన దర్శనం, సేవ లేదా ప్రసాదాన్ని ఎంపిక చేసి డిజిటల్ చెల్లింపు చేయాలి.
  • అనంతరం QR కోడ్‌తో ఈ-టికెట్ మీ ఫోన్‌కు వస్తుంది.

అధికారిక వెబ్‌సైట్‌లో కూడా బుకింగ్

  • భక్తులు దర్శనం, వసతి, ఆర్జిత సేవలను ముందుగానే దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.
  • దీంతో రద్దీ రోజుల్లో ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది.
  • లడ్డూ ప్రసాదం కోసం ఎక్కువసేపు క్యూలో నిలబడాల్సిన అవసరం లేదా?
  • చాలా మంది భక్తులకు తెలియని విషయం ఏమిటంటే…
  • లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద QR కోడ్ స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో చెల్లింపు చేసే సౌకర్యం కూడా ఉంది.

సాధారణ కౌంటర్ల వద్ద ఎక్కువ మంది భక్తులు క్యూలో ఉండగా, ఆన్‌లైన్ చెల్లింపు చేసిన వారి కోసం ప్రత్యేక కౌంటర్ ఉంటుంది.

నా అనుభవం…

నేను శ్రీశైలం వెళ్లిన రోజున సాధారణ కౌంటర్ వద్ద సుమారు 30 మందికి పైగా క్యూలో ఉండగా, ఆన్‌లైన్ కౌంటర్ వద్ద ఇద్దరు మాత్రమే ఉన్నారు.

మొబైల్‌లో UPI లేదా డిజిటల్ పేమెంట్ సౌకర్యం ఉంటే చాలా తక్కువ సమయంలోనే ప్రసాదాలు తీసుకోవచ్చు. కౌంటర్ వద్ద ఉన్న సూచన బోర్డులలో కూడా ఈ విధానం వివరంగా చూపిస్తారు.

ఉచితంగా లభించే సౌకర్యాలు

శ్రీశైలం దేవస్థానం భక్తుల కోసం పలు ఉచిత సౌకర్యాలు కల్పిస్తోంది.

  • ఉచిత సర్వదర్శనం
  • క్యూ లైన్లలో తాగునీరు
  • అల్పాహారం
  • 34 RO ప్లాంట్ల ద్వారా మంచినీరు
  • 400కు పైగా నీటి కుళాయిలు
  • పరిశుభ్రమైన క్యూ కాంప్లెక్స్
  • ఉచిత అన్నప్రసాదం

అన్నపూర్ణ భవనంలో ప్రతిరోజూ…

  • ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భోజన ప్రసాదం
  • రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అల్పాహారం
  • భక్తులకు ఉచితంగా అందజేస్తారు.
  • వసతి, తలనీలాలు సమర్పించే సౌకర్యం
  • శిఖరేశ్వరం, హటకేశ్వరం, పాతాళగంగ మార్గాల్లో దేవస్థానం ఆధ్వర్యంలో వసతి సముదాయాలు ఉన్నాయి.

అలాగే పాతాళగంగ మార్గంలో ఆధునిక కేశఖండనశాల ఏర్పాటు చేశారు. ఉదయం 4.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులు తలనీలాలు సమర్పించవచ్చు.

చిన్నపిల్లలతో వెళ్లేవారికి శుభవార్త

ఒక సంవత్సరం లోపు చిన్నారి ఉంటే తల్లిదండ్రులిద్దరికీ ప్రత్యేక దర్శనంలో అవకాశం కల్పిస్తున్నారు.

ఈ సౌకర్యంతో చిన్నారులతో వచ్చిన కుటుంబాలు ఎక్కువసేపు క్యూలో నిలబడకుండా దర్శనం చేసుకోవచ్చు.

మా అనుభవం…

మేము శ్రీశైలం దర్శనానికి వెళ్లినప్పుడు సర్వదర్శనం సుమారు 30 నిమిషాల్లోనే పూర్తైంది.

దర్శనం ప్రశాంతంగా జరిగింది. లడ్డూ ప్రసాదం కూడా ఆన్‌లైన్ చెల్లింపు విధానం వల్ల చాలా త్వరగా పొందగలిగాం. ముందుగానే ఈ సమాచారం తెలిసి ఉంటే యాత్ర మరింత సులభంగా, సమయాన్ని ఆదా చేసుకుంటూ పూర్తి చేయవచ్చు.

Also Read: ప్రేక్షకులు ఎప్పుడూ చూడని కథ ఇదేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »