నేటి రాశిఫలాలు : మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఎలా ఉందంటే?

ఈరోజు దినఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉంది? ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, కుటుంబం, ఆరోగ్యం, పూజా పరిహారాలపై పూర్తి రాశిఫలాలు తెలుసుకోండి.

today horoscope september 10 2026
today horoscope september 10 2026

ఈ రోజు 12 రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, కుటుంబం వంటి అంశాల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశివారు జాగ్రత్తగా ఉండాలి? ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిదో తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి కొత్త అవకాశాలు కలిసొచ్చే సూచనలు ఉన్నాయి. ప్రారంభించిన పనుల్లో చాలా వరకు పురోగతి సాధిస్తారు. పెద్దల సహకారం లభించడం వల్ల కొన్ని సమస్యలు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది.

అనుకూల దైవం: శ్రీ అష్టవినాయక స్వామి
పూజ:అష్టవినాయక స్వామి స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతికి సంబంధించిన శుభవార్తలు అందవచ్చు. వ్యాపారంలో మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి.

అనుకూల దైవం: శ్రీ ధర్మశాస్తా స్వామి
పూజ: అయ్యప్ప స్వామికి అర్చన నిర్వహించడం శుభప్రదం.

 మిథున రాశి

మిథున రాశి వారికి ధనపరంగా అనుకూలత ఉంటుంది. కొత్త ప్రయత్నాలు సానుకూల ఫలితాలను అందించవచ్చు. ఉద్యోగానికి సంబంధించిన కొన్ని సమస్యలపై సమావేశాలు, చర్చలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో పరిష్కరించాల్సిన అంశాలు ఎదురవుతాయి. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలి.

అనుకూల దైవం: ఆంజనేయస్వామి
పూజ: హనుమాన్ దండకాన్ని పారాయణం చేసి సింధూర అర్చన చేయడం మంచిది.

 కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలకమైన సమావేశాల్లో ఆచితూచి మాట్లాడాలి. అవసరం లేని అభిప్రాయాలు చెప్పడం, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.

అనుకూల దైవం: శ్రీమన్నారాయణుడు
పూజ: సుదర్శన స్వామి స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.

 సింహ రాశి

సింహ రాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన రోజు. ఉన్నతాధికారులతో ముఖ్యమైన సమావేశాలు జరిగే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. కుటీర పరిశ్రమలు నిర్వహించే వారికి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబ అవసరాల కారణంగా చిన్నచిన్న ఖర్చులు పెరుగుతాయి.

అనుకూల దైవం: మహాగౌరీ అమ్మవారు
పూజ: పార్వతీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం మంచిది.

కన్య రాశి

కన్య రాశి వారికి వ్యాపార కార్యకలాపాల ద్వారా ప్రయోజనాలు లభిస్తాయి. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో అవకాశాలతో పాటు గుర్తింపు కూడా లభించవచ్చు. సమాజంలో గౌరవం, మర్యాద పెరగడంతో పాటు కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి రావచ్చు.

అనుకూల దైవం: సిద్ధి వినాయక స్వామి
పూజ: గణపతి అష్టకాన్ని పారాయణం చేయడం మంచిది.

తుల రాశి

తుల రాశి వారికి దూర ప్రయాణాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆస్తులకు సంబంధించిన నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. కోర్టు లేదా న్యాయపరమైన వ్యవహారాల్లో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి.

అనుకూల దైవం: శ్రీకృష్ణ పరమాత్ముడు
పూజ: శ్రీకృష్ణుడికి తులసి అర్చన చేసి వెన్నను నైవేద్యంగా సమర్పించడం మంచిది.

 వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఉద్యోగపరంగా శ్రమ పెరుగుతుంది. వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం. బంధువుల సహకారంతో ముఖ్యమైన కుటుంబ కార్యక్రమాలను పూర్తి చేసుకోగలుగుతారు. ఆస్తి వివాదాలకు సంబంధించి కొంత పురోగతి లేదా పరిష్కారం లభించవచ్చు.

అనుకూల దైవం: పరమేశ్వరుడు
పూజ: శివార్చన చేయడంతో పాటు పేదలకు అన్నదానం చేయడం మంచిది.

 ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు కష్టపడతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేయాలి. ఉద్యోగానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి రావచ్చు. కుటుంబ సభ్యుల సహకారం అవసరమయ్యే సందర్భాలు ఎదురవుతాయి.

అనుకూల దైవం: శ్రీ ఉమామహేశ్వర స్వామి
పూజ: అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.

 మకర రాశి

మకర రాశి వారికి రాజకీయ, సామాజిక కార్యక్రమాలకు సంబంధించిన సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు రావచ్చు. విమర్శలు, ప్రతివిమర్శలకు దూరంగా ఉండటం మంచిది. అనవసరమైన కార్యక్రమాల్లో సమయం వృథా చేయకుండా ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలి. కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవాలి. పిల్లల చదువులో వారికి అండగా నిలవాలి.

అనుకూల దైవం: మహా సరస్వతీ అమ్మవారు
పూజ: సరస్వతీ అమ్మవారి స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.

 కుంభ రాశి

కుంభ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. స్థానచలనం లేదా ఉద్యోగ మార్పుకు సంబంధించిన సూచనలు కనిపిస్తున్నందున ముఖ్యమైన నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం.

అనుకూల దైవం: ఆంజనేయస్వామి
పూజ: హనుమత్ బడవానల స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ప్రయాణాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలు తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశాలను పరిశీలిస్తారు. కొత్త ప్రణాళికల విషయంలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

అనుకూల దైవం: శ్రీ సుబ్రహ్మణ్యస్వామి
పూజ: స్వామివారి భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.

గమనిక: ఇవి సాధారణ రాశిఫలాల ఆధారంగా రూపొందించిన దినఫలాలు మాత్రమే. వ్యక్తిగత జాతక పరిస్థితులను బట్టి ఫలితాలు మారవచ్చు.

Horoscope by Sri Rayaprolu MallikarjunaSarma

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »