Today Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు శుభఫలితాలు.. ఆర్థికంగా కూడా కలిసొచ్చే రోజు!

Today Horoscope: సెప్టెంబర్ 11, 2026 రాశిఫలాలు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈరోజు ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

today rasi phalalu
today rasi phalalu

ఈరోజు దినఫలాలు: సెప్టెంబర్ 11, 2026 శుక్రవారం రాశిఫలాల్లో కొన్ని రాశుల వారికి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. సమస్యల నుంచి ఉపశమనం పొందడం, ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకోవడం, ఉద్యోగ-వ్యాపారాల్లో పురోగతి సాధించడం వంటి ఫలితాలు కొన్ని రాశులకు ఉన్నాయి. మరికొన్ని రాశుల వారు మాత్రం పని, ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈరోజు 12 రాశుల వారికి దినఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో ఎదురవుతున్న సమస్యలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక, దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన బకాయిలను వసూలు చేసుకునే అవకాశం ఉంది.

అనుకూల దైవం:మహాలక్ష్మి అమ్మవారు
పూజ అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం

వృషభ రాశి

వృషభ రాశి వారికి సంతాన సంబంధమైన శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగం, వ్యాపార పరంగా ఒత్తిడి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల కారణంగా శ్రమ అధికమవుతుంది.

అనుకూల దైవం: శ్రీకృష్ణ పరమాత్ముడు
పూజ: జగన్నాథ అష్టకం పారాయణం

మిథున రాశి

మిథున రాశి వారికి ప్రయత్నపూర్వకంగా చేపట్టిన పనుల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. పనులు దశలవారీగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో లాభాలు కలిసొస్తాయి. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.

అనుకూల దైవం:మహాగణపతి
పూజ: గణపతి పంచరత్న స్తోత్ర పారాయణం

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు కుటుంబ పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. ఉద్యోగ సంబంధిత విషయాల్లో నిర్లక్ష్యానికి దూరంగా ఉండాలి. క్రమశిక్షణ ప్రయోజనకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ శుభకార్యాల కోసం ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం ఉంది.

అనుకూల దైవం: మల్లికార్జున స్వామి
పూజ:శివార్చన

సింహ రాశి

సింహ రాశి వారికి వృత్తి, ఉద్యోగ పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. తమపై ఉన్న బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో గతంతో పోలిస్తే కొత్త విధానాలను అనుసరించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక గందరగోళ పరిస్థితులను అధిగమించే అవకాశం ఉంది.

అనుకూల దైవం: సూర్యనారాయణ స్వామి
పూజ: ఆదిత్య హృదయం పారాయణం

కన్య రాశి

కన్య రాశి వారికి ముందుగా ప్రణాళిక చేసుకున్న పనులను సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంది.

అనుకూల దైవం: శ్రీ మహాకాళి అమ్మవారు
పూజ: కాళీ స్తోత్ర పారాయణం

తుల రాశి

తుల రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకోగలుగుతారు. అయితే గతంలో తీసుకున్న అప్పుల విషయంలో ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఎదురయ్యే అవాంతరాలను అధిగమించడంపై దృష్టి పెట్టాలి.

అనుకూల దైవం: శ్రీ మహావిష్ణువు
పూజ: సత్యనారాయణ స్వామికి తులసి అర్చన

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగ పరంగా అనుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కీలకమైన సమాచారం అందుతుంది. సమాజంలోని ప్రముఖులను కలిసే ప్రయత్నాలు జరుగుతాయి. సామాజిక, జన సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

అనుకూల దైవం: ఆంజనేయ స్వామి
పూజ: పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణం

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి స్నేహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనుల్లో ఆకస్మిక విజయాలు సాధించే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు ఉన్నాయి. దైవానుగ్రహం అనుకూలంగా ఉంటుంది.

అనుకూల దైవం: సుబ్రహ్మణ్య స్వామి

పూజ:కార్తికేయ స్తోత్ర పారాయణం

మకర రాశి

మకర రాశి వారు వృత్తి, ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. చేపట్టిన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

అనుకూల దైవం: నందీశ్వరుడు
పూజ: శివాలయంలో నందీశ్వర దర్శనం, అర్చన

కుంభ రాశి

కుంభ రాశి వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. కుటుంబం, సామాజికంగా ఎదురవుతున్న ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.

అనుకూల దైవం: లలిత అమ్మవారు
పూజ: లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు వివిధ రూపాల్లో అనుకూలతలు, ప్రయోజనాలు లభిస్తాయి. సన్నిహితుల కుటుంబ శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు సమకూర్చుకునే అవకాశం ఉంది.

అనుకూల దైవం: మహాగౌరి అమ్మవారు
పూజ: గిరిజా స్తోత్ర పారాయణం

ముఖ్య గమనిక

ఇవి సంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా అందించే సాధారణ దినఫలాలు మాత్రమే. వ్యక్తిగత జాతకం, గ్రహస్థితులను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »