Today Horoscope : నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయి? ఏ రాశుల వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది? ఎవరు ఆరోగ్యం, పెట్టుబడులు, కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈరోజు గ్రహ పరిస్థితుల ప్రభావం ఎలా ఉండనుందో తెలుసుకుందాం.
Today Horoscope
మేష రాశి
మేష రాశి వారు ఈరోజు చేపట్టే కార్యక్రమాలు, వ్యాపార వ్యవహారాలకు సంబంధించి ప్రణాళికలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశాలు లభిస్తాయి. కష్టపడి పనిచేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది.
- అనుకూల దైవం: శ్రీ సత్యనారాయణ స్వామి
- పూజ: స్వామివారికి తులసి అర్చన చేయడం మంచిది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి విద్యా సంబంధిత విషయాల్లో శుభ ఫలితాలు లభిస్తాయి. విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కుటుంబపరమైన సమస్యలను చక్కదిద్దుకోగలుగుతారు. అనవసరమైన బాధ్యతల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
- అనుకూల దైవం: వినాయక స్వామి
- పూజ: సంకటనాశన గణపతి స్తోత్రం పారాయణం చేయాలి.
మిథున రాశి
మిథున రాశి వారికి కుటుంబపరంగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. సామాజిక అంశాల్లో ఎదురయ్యే ప్రతికూలతలను సమర్థంగా ఎదుర్కొంటారు. ఉద్యోగ అవకాశాలు కలిసివస్తాయి. స్నేహితులు, బంధువులను కలుసుకునే అవకాశం ఉంటుంది.
- అనుకూల దైవం: పరమేశ్వరుడు
- పూజ: శివార్చన చేయడంతో పాటు గోసేవ చేయడం మంచిది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి సామాజిక సేవా కార్యక్రమాల్లో పురోగతి కనిపిస్తుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అయితే ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- అనుకూల దైవం: సూర్యనారాయణ స్వామి
- పూజ: ఆదిత్య హృదయం పారాయణం చేయడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారు ఈరోజు అనుకున్న పనులను సాధించగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు జరుగుతాయి. అద్భుతమైన అవకాశాలతో పాటు గుర్తింపు లభిస్తుంది. విందు, వినోదాలు సంతోషాన్ని కలిగిస్తాయి.
- అనుకూల దైవం: వల్లభ గణపతి స్వామి
- పూజ: గణపతి అష్టకం పారాయణం చేయాలి.
కన్య రాశి
కన్య రాశి వారు ఆదాయ మార్గాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో పలు విషయాలపై చర్చలు జరుగుతాయి. షేర్లు, పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.
- అనుకూల దైవం: శ్రీ మహావిష్ణువు
- పూజ: విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం మంచిది.
తుల రాశి
తుల రాశి వారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులను తిరిగి ప్రారంభిస్తారు. జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక ఆదాయాలు మెరుగుపడే అవకాశం ఉంది.
- అనుకూల దైవం: మహాలక్ష్మి అమ్మవారు
- పూజ: లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేయాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ కార్యాలయాల్లో కొంత ప్రతికూల వాతావరణం ఉండవచ్చు. చుట్టుపక్కల వ్యక్తుల వ్యవహారాలను గమనిస్తూ ముందుకు సాగాలి.
- అనుకూల దైవం: గౌరీ అమ్మవారు
- పూజ: గౌరీ స్తోత్రం పారాయణం చేయడం మంచిది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. లాభాలు పొందే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు కష్టపడతారు. శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. శత్రువులపై ఆధిపత్యం సాధిస్తారు.
- అనుకూల దైవం: లక్ష్మీ నృసింహ స్వామి
- పూజ: సుదర్శన అష్టకం పారాయణం చేయాలి.
మకర రాశి
మకర రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆస్తుల వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. విందు, వినోదాలు, ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి.
- అనుకూల దైవం: నటరాజ స్వామి
- పూజ: నటరాజ స్వామివారికి విభూదితో అర్చన చేయడం మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారు దూర ప్రయాణాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక విషయాల్లో గౌరవం లభిస్తుంది. ఉద్యోగ భద్రత పెరుగుతుంది. లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.
- అనుకూల దైవం: దుర్గా అమ్మవారు
- పూజ: దుర్గా కవచం పారాయణం చేయడం మంచిది.
మీన రాశి
మీన రాశి వారికి పలు సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ, సామాజిక, జన సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని వ్యాపారాలను కీలక దశకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
- అనుకూల దైవం: శ్రీ శక్తి గణపతి స్వామి
- పూజ: గణపతి స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి.
గమనిక: ఇవి సంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా అందించే సాధారణ దినఫలాలు మాత్రమే. వ్యక్తిగత జాతక పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు.


