ఆసియాలోనే తొలి ఎన్విడియా వెరా రూబిన్ క్లస్టర్ హైదరాబాద్‌లో ఏర్పాటు..

ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 1 గిగావాట్ కంప్యూట్ సామర్థ్యంలో భాగంగా, హైదరాబాద్‌లోని తన మొట్టమొదటి ఏఐ ఫ్యాక్టరీలో వెరా రూబిన్ ఎన్‌వీఎల్72 ర్యాక్-స్కేల్ సిస్టమ్స్‌గా సుమారు 9,000 ఎన్విడియా రూబిన్ జీపీయూలను ఏర్పాటు చేసేందుకు ఏఎం ఇంటెలిజెన్స్ (AMI) కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేసింది.

ఆసియాలోనే తొలి ఎన్విడియా వెరా రూబిన్ క్లస్టర్ హైదరాబాద్‌లో ఏర్పాటు..

ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 1 గిగావాట్ కంప్యూట్ సామర్థ్యంలో భాగంగా, హైదరాబాద్‌లోని తన మొట్టమొదటి ఏఐ ఫ్యాక్టరీలో వెరా రూబిన్ ఎన్‌వీఎల్72 ర్యాక్-స్కేల్ సిస్టమ్స్‌గా సుమారు 9,000 ఎన్విడియా రూబిన్ జీపీయూలను ఏర్పాటు చేసేందుకు ఏఎం ఇంటెలిజెన్స్ (AMI) కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేసింది. గ్రీన్‌కో ప్రమోటర్లు ఏర్పాటు చేసిన ఈ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్‌ఫామ్.. ఎనర్జీ, కంప్యూట్, ఇన్నోవెషన్ సమ్మిళితంతో ఏఐ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ, ప్రపంచంలోనే అగ్రగామి ఇంటెలిజెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థగా ఎదిగేందుకు అడుగులు వేస్తోంది.

హైదరాబాద్ ఏఐ ఫ్యాక్టరీ ప్రత్యేకతలు , ఒప్పందం:

ఈ లక్ష్యం దిశగా తొలి అడుగు వేస్తూ, హైదరాబాద్‌లోని తన మొట్టమొదటి ఏఐ ఫ్యాక్టరీ కోసం 2027 మొదటి త్రైమాసికంలో (Q1 2027) డెలివరీ అయ్యేలా ‘వెరా రూబిన్’ కొనుగోలుకు పక్కా ఒప్పందాన్ని ఖరారు చేసినట్లు ఏఎంఐ ప్రకటించింది.

30 మెగావాట్ల (MW) సామర్థ్యం కోసం వెరా రూబిన్ ఎన్‌వీఎల్72 ర్యాక్-స్కేల్ సిస్టమ్స్‌గా ఏర్పాటు చేయనున్న 9,000 ఎన్విడియా రూబిన్ జీపీయూలు ఈ ఆర్డర్‌లో ఉన్నాయి. ఇది ఏఎంఐ హైదరాబాద్ ఏఐ ఫ్యాక్టరీని ఆసియాలోనే మొట్టమొదటి సరికొత్త ఏఐ కంప్యూట్ క్లస్టర్లలో ఒకటిగా నిలపనుంది.

భారత్, అమెరికా, ఫిన్లాండ్ , మలేషియా దేశాల్లో ఏఎంఐ ప్లాన్ చేసిన 1 గిగావాట్ ‘కంప్యూట్-యాజ్-ఎ-సర్వీస్’ సామర్థ్యంలో హైదరాబాద్ కేంద్రం మొదటి దశగా ఉండనుంది. దాదాపు 8 బిలియన్ డాలర్లకు పైగా మూలధన వ్యయంతో (క్యాపెక్స్) సమీప భవిష్యత్తులో ప్రారంభ దశగా 200 మెగావాట్ల సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఏఎంఐ యోచిస్తోంది.

అత్యాధునిక సాంకేతికత , సామర్థ్యం:

డేటా అత్యంత వేగంగా, సమర్థంగా బదిలీ అయ్యేందుకు వీలుగా ఎన్విడియా వెరా రూబిన్ ఆర్కిటెక్చర్‌తో పాటు హై-త్రూపుట్ ఆర్‌ఓసీఈ (RoCE) నెట్‌వర్కింగ్, అత్యాధునిక స్టోరేజ్ వ్యవస్థలను అనుసంధానిస్తున్నారు. దీని ద్వారా ట్రిలియన్ పారామీటర్ మోడల్స్, కొత్త తరం ఏజెంటిక్ ఏఐ అప్లికేషన్లతో సహా ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత సంక్లిష్టమైన ఏఐ మోడళ్లను నడిపించేలా హైదరాబాద్ ఏఐ ఫ్యాక్టరీని తీర్చిదిద్దుతున్నారు.

ఎన్విడియా వెరా రూబిన్ ఎన్‌వీఎల్72 సరికొత్త లో-ప్రెసిషన్ కంప్యూటింగ్ ఫార్మాట్ అయిన ఎన్‌వీఎఫ్‌పీ4 (NVFP4)ను పరిచయం చేస్తోంది. అంతకుముందు తరం ఎన్విడియా గ్రేస్ బ్లాక్‌వెల్‌తో పోలిస్తే, ఏఐ ఇన్‌ఫరెన్స్ టోకెన్-సర్వింగ్ ఖర్చులను దాదాపు 10 రెట్లు తగ్గించేలా ఈ ఆర్కిటెక్చర్‌ను తీర్చిదిద్దారు. ఈ ఫ్యాక్టరీ దాదాపు 450 ఎగ్జాఫ్లాప్స్ ఎన్‌వీఎఫ్‌పీ4 ఇన్‌ఫరెన్స్ కంప్యూట్ సామర్థ్యాన్ని అందించేలా ఇంజినీరింగ్ చేయబడుతోంది.

About Author:

Vidya Burujukadi

కంటెంట్ రైటర్‌గా మన వార్త వెబ్ సైట్‌కి విద్య.బి పనిచేస్తున్నారు. ప్రధానంగా బిజినెస్ వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను ఆమె అందిస్తారు. విద్యకు తెలుగు మీడియా…

More About Author »