భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి ధరల వివరాలివే!

Gold and Silver Prices: వరుసగా మూడో రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలతో పాటు వెండి ధర కూడా గణనీయంగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో ఏర్పడిన ఈ మార్పులు కొనుగోలుదారులకు శుభవార్తగా మారాయి.

Today Gold and Silver Prices in Major Indian Cities
Today Gold and Silver Prices in Major Indian Cities

Gold and Silver Prices

  • వరుసగా మూడో రోజు బంగారం ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం పెరిగింది.

  • 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారంతో పాటు వెండి ధర కూడా ఒక్కసారిగా రూ.2,000 తగ్గింది.

  • అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, ఫెడ్ నిర్ణయాల ప్రభావంతో ఈ ధరల పతనం చోటు చేసుకుంది.

హైదరాబాద్: పసిడి ప్రియులకు ఇది నిజంగా శుభవార్త. గత కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన పసిడి ధరలు ఇప్పుడు శాంతించాయి. వరుసగా మూడవ రోజు కూడా బంగారం ధరలు భారీగా పతనం కావడంతో కొనుగోలుదారుల్లో హుషారు కనిపిస్తోంది. కేవలం బంగారమే కాకుండా, వెండి కూడా తన మెరుపును కాస్త తగ్గించుకొని సామాన్యులకు అందుబాటులోకి వస్తోంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నేటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

నేటి బంగారం, వెండి ధరలు:

  • బంగారం24 క్యారెట్లు: (10గ్రా)₹1,51,750 నుండి ₹1,420 తగ్గింది.
    22 క్యారెట్లు (10గ్రా)₹1,39,100 నుండి ₹1,300 తగ్గింది.
  • వెండి: వెండి 1 కేజీ ₹1,26,000. నిన్నటితో పోలిస్తే ₹2,000 తగ్గింది.

వెండి ధరల తగ్గుదల: బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి ధరపై ఏకంగా రూ. 2,000 వరకు తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర సుమారు ₹1,26,000 వద్ద కొనసాగుతోంది.

ఎందుకీ మార్పు?: అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, ఫెడ్ రిజర్వ్ కీలక నిర్ణయాల నేపథ్యంలో మదుపర్లు (గానీ, ఆస్తిని గానీ తక్కువ ధరకు కొని, భవిష్యత్తులో దాని ధర పెరిగినప్పుడు అమ్మి లాభం పొందాలని చూసేవారే) బంగారంపై పెట్టుబడులను తగ్గించడమే ఈ భారీ పతనానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

స్థానిక ధరలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో స్థానిక పన్నులను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »