Gold Price: ట్రంప్ వార్నింగ్ ఎఫెక్ట్.. వరుసగా రెండో రోజూ దిగివచ్చిన బంగారం.. తులంపై ఎంత తగ్గిందంటే?

Hormuz Strait Tensions ప్రభావంతో హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. తాజా ధరలు తెలుసుకోండి.

Today Gold Rate in Hyderabad April 8th 2026
AI Generated Image

హైదరాబాద్: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటైన హెచ్చరికలు ప్రపంచ వాణిజ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌ను ఉద్దేశించి ట్రంప్ చేసిన ‘వార్నింగ్’ అంతర్జాతీయ మార్కెట్లను ఒక్కసారిగా కుదిపేసింది. ఈ ఉద్రిక్తతల మధ్యే దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు అనూహ్యంగా దిగిరావడం విశేషం. ఏప్రిల్ 8వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు (Gold Prices) వరుసగా రెండో రోజూ భారీగా తగ్గుముఖం పట్టాయి.

ట్రంప్ హెచ్చరిక:

హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌ను నాశనం చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హెచ్చరికలతో క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ, బంగారం ధరలు మాత్రం నేలచూపులు చూశాయి. అయితే, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందనే వార్తలు ఇన్వెస్టర్లను ఊపిరి పీల్చుకునేలా చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,798 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read: ఈ రాశుల వారి ఆస్తి వివాదాలకు చెక్.. భారీ ధనలాభంతో ఇవాళ మీదే హవా!

హైదరాబాద్‌లో నేటి ధరలు ఇవే..

బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ క్షీణించాయి.

  • 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): నేడు రూ. 820 మేర తగ్గింది. దీంతో తులం బంగారం ధర రూ. 1,49,840 వద్దకు చేరుకుంది.
  • 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): సుమారు రూ. 750 మేర తగ్గడంతో, ప్రస్తుతం ధర రూ. 1,37,350 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరల్లో పెను మార్పు

బంగారంతో పోలిస్తే వెండి ధరలో భారీ పతనం నమోదైంది. నిన్నటి ధరతో పోలిస్తే నేడు హైదరాబాద్‌లో కిలో వెండి ఏకంగా రూ. 5,000 పడిపోయింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,55,000 మార్కు వద్ద విక్రయిస్తున్నారు.

యుద్ధ వాతావరణం, కాల్పుల విరమణ వార్తల మధ్య బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. Hormuz Strait Tensions ప్రభావంతో రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత మారే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »