Today Horoscope: ఈ రాశుల వారి ఆస్తి వివాదాలకు చెక్.. భారీ ధనలాభంతో ఇవాళ మీదే హవా!

Today Horoscope: నేటి రాశి ఫలాలు: మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి ఆదాయం, ఆరోగ్యం మరియు వృత్తిపరమైన ఫలితాలు. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Today Horoscope
Today Horoscope

Today Horoscope: హైదరాబాద్: గ్రహాల స్థితిగతులు , నక్షత్ర సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల ఫలాలు ఇలా ఉన్నాయి. ఇవాళ మేషం నుంచి మీనం వరకు ఆయా రాశుల వారి వృత్తి, వ్యాపార, ఆరోగ్య స్థితిగతుల్లో వైవిధ్యమైన ఫలితాలు కనిపించనున్నాయి. ముఖ్యంగా ఆర్థిక అంశాల్లో కొన్ని రాశుల వారికి అదృష్టం వరించనుండగా, మరికొన్ని రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండాలని సూచనలు అందుతున్నాయి.

మేష రాశి:

ఆరోగ్యం మెరుగుపడుతుంది, పాత అనారోగ్య సమస్యల నుండి కోలుకుంటారు. ఆపదలో ఉన్నప్పుడు స్నేహితుల అండ లభిస్తుంది. కార్యాలయంలో మీ పనితీరు మెరుగ్గా ఉండటం వల్ల ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే వైవాహిక జీవితంలో చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి బాగుండాలంటే ఉదయాన్నే ‘ఓం హం హనుమతే నమః’ మంత్రాన్ని 11 సార్లు పఠించండి.

వృషభ రాశి:

కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత అసహనం కలిగించవచ్చు. గతంలో మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం పొందే సమయం వచ్చింది. అదృష్టం తోడుగా ఉంటుంది, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. సృజనాత్మక రంగం (Creative field) లో ఉన్నవారు మాత్రం ఇవాళ కొన్ని ఆటంకాలను ఎదుర్కోవాల్సి రావచ్చు.

మిథున రాశి:

ఆరోగ్య పరంగా చాలా బాగుంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి, పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోసం ‘ఓం గం గణపతయే నమః’ మంత్రాన్ని జపించడం మంచిది.

కర్కాటక రాశి:

ఆరోగ్య విషయంలో మీ జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలను అలక్ష్యం చేయకండి. మీ కలలు నిజమయ్యే కాలం దగ్గరపడింది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు, అది భవిష్యత్తులో ఇబ్బందులకు దారి తీయవచ్చు. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇబ్బందులు తప్పవు.

సింహ రాశి:

ఈ రోజంతా ఉల్లాసంగా, వినోదభరితంగా గడుపుతారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమై, భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ సోదరుడు మీకు అండగా నిలుస్తారు, మీరు ఆశించిన దానికంటే ఎక్కువ సహాయం వారి నుండి అందుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి ఇవాళ అత్యంత అనుకూలమైన రోజు.

కన్యా రాశి:

గ్రహాల ప్రభావం(horoscope) వల్ల ఖర్చులు పెరగవచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల సలహా తీసుకోండి. కొత్త ప్రాజెక్టుల విషయంలో తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. తెలిసిన మహిళల ద్వారా ఉద్యోగ లేదా వ్యాపార అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ఉదయాన్నే ‘ఓం హం హనుమతే నమః’ మంత్రాన్ని 11 సార్లు పఠించండి.

తులా రాశి:

ఇవాళ ఆదాయం మీరు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో సంయమనం అవసరం. అయితే, మీరు ప్రారంభించే కొత్త వ్యాపార పథకాల పట్ల మీ భాగస్వాములు (Partners) ఆసక్తి చూపుతారు , వారి మద్దతు మీకు లభిస్తుంది.

వృశ్చిక రాశి:

శారీరకంగా, మానసికగా కొంత నీరసంగా అనిపించవచ్చు. వ్యాపారస్తులకు ఆప్తమిత్రుడి సాయంతో ధనలాభం కలుగుతుంది. ఇంట్లో చిన్నపాటి కలహాలు వచ్చే సూచనలు ఉన్నాయి, కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆఫీసులో మాత్రం వాతావరణం అనుకూలంగా ఉంటుంది, మీ పనితీరుతో అందరినీ మెప్పిస్తారు.

ధనుస్సు రాశి:

చాలా కాలంగా రాకుండా ఆగిపోయిన బాకీలు లేదా రావాల్సిన డబ్బు ఎట్టకేలకు మీ చేతికి అందుతుంది. ఇది మీకు మానసిక ఊరటనిస్తుంది. స్నేహితుల మద్దతు ఉన్నప్పటికీ, వారితో మాట్లాడేటప్పుడు సంయమనం కోల్పోవద్దు. మాట జారడం వల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు.

మకర రాశి:

దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది ఉత్తమ సమయం. మీలోని సృజనాత్మకతకు, కొత్త ఆలోచనలకు ఇవాళ మంచి గుర్తింపు లభిస్తుంది. ఊహించని విధంగా ప్రశంసలు లేదా బహుమతులు పొందే అవకాశం ఉంది.

కుంభ రాశి:

ధనలాభం ఉన్నప్పటికీ, ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. సోదరీమణుల నుండి పూర్తి సహకారం అందుతుంది. బాధలో ఉన్నప్పుడు ఓ ప్రత్యేక స్నేహితుడు అండగా నిలుస్తారు. కళాకారులు, రంగస్థల నటులు, క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి.

మీన రాశి:

ఇతరులకు సాయం చేయడం వల్ల మీకు మనసుకి ప్రశాంతత లభిస్తుంది. గత కొద్ది రోజులుగా ఆఫీసులో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఈరోజుతో తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి మరింత మెరుగుపడటానికి ప్రతిరోజూ ‘ఓం గం గణపతయే నమః’ మంత్రాన్ని 11 సార్లు భక్తితో పఠించండి.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »