గుడ్ న్యూస్ చెప్పిన దీపికా ప‌దుకొణే.. త్వ‌ర‌లోనే మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌

బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ రెండో సంతానానికి సిద్ధమవుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రెగ్నెన్సీ వార్తను పంచుకుంటూ ఈ జంట అభిమానులకు తీపి కబురు అందించింది.

రెండో ప్రెగ్నెన్సీని ప్రకటిస్తున్న దీపికా పదుకొనే, రణవీర్ సింగ్.
Deepika Padukone Second Pregnancy

బాలీవుడ్ స్టార్ క‌పుల్‌ దీపికా పదుకొనే, రణవీర్ సింగ్‌ల‌ ప్రేమ, వివాహం, ఆ త‌ర్వాత పేరెంట్స్ ప్ర‌మోష‌న్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. 2018 నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో ఈ జంట అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దీపికా కొంకణి సంప్రదాయం, రణవీర్ సింధీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా రెండు రకాలుగా వివాహ వేడుకలు నిర్వహించారు.

ఈ జంట ప్రేమ కథ 2013లో వచ్చిన గోలియోన్ కీ రాస్లీలా రామ్-లీలా సినిమా షూటింగ్ సమయంలో ప్రారంభమైంది. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరు 2015లో నిశ్శబ్దంగా నిశ్చితార్థం చేసుకుని, 2018లో వివాహం చేసుకున్నారు. ఇక 2024 సెప్టెంబర్ 8న తమ తొలి సంతానం ‘దువా’కు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ మరో సంతోష వార్తను అభిమానులతో పంచుకున్నారు. ఈ జంట త్వరలో రెండో సంతానానికి జ‌న్మ‌నివ్వ‌బోతున్నట్లు ప్రకటించారు.

గుడ్ న్యూస్ పంచుకున్న దీపికా..

ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ కలిసి ఒక జాయింట్ పోస్ట్ షేర్ చేశారు. ఆ ఫోటోలో వారి కుమార్తె ‘దువా’ ఒక పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకుని కనిపించడం విశేషం. ఈ క్యూట్ విజువల్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ పోస్టుకు క్యాప్షన్‌గా దీపికా రెండు ఈవిల్ ఐ (నజర్) ఎమోజీలు మాత్రమే పెట్టడం గమనార్హం. సాధారణంగా సెలబ్రిటీలు పెద్ద క్యాప్షన్లు రాస్తుంటారు. అయితే, చాలా సింపుల్‌గా ఈ గుడ్ న్యూస్‌ను షేర్ చేయడం ఫ్యాన్స్‌ను మరింత ఆనందపరిచింది.

ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తిస్తున్నారు. ఇప్పటికే ఒక బిడ్డకు తల్లిదండ్రులైన ఈ జంట ఇప్పుడు మరోసారి పేరెంట్స్ కాబోతుండటం వారి కుటుంబంలో ఆనందాన్ని రెట్టింపు చేసింది.

తల్లితనం గురించి దీపిక కామెంట్స్..

ఇటీవల జరిగిన వేవ్స్ 2025 స‌మ్మింట్‌లో పాల్గొన్న దీపికా పదుకొనే, తల్లితనం తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని భావోద్వేగంగా వెల్లడించారు. ఇంతకాలం తన కెరీర్, లక్ష్యాల చుట్టూ తిరిగిన జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని చెప్పారు.

“బిడ్డ పుట్టిన క్షణం నుంచి మీరు ఇంకో మనిషి బాధ్యతను తీసుకుంటారు. ఇప్పటివరకు నా జీవితం నా లక్ష్యాలు, నా ఆశయాల గురించే ఉండేది. ఇప్పుడు ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఒక చిన్నారి మీపై పూర్తిగా ఆధారపడుతుంది,” అని ఆమె పేర్కొన్నారు.

సాధారణ బాల్యం ఇవ్వాలనే లక్ష్యం

తన కుమార్తె దువాకు సాధారణమైన, భద్రతతో కూడిన బాల్యం ఇవ్వాలనేది తన ముఖ్య లక్ష్యమని దీపికా తెలిపారు. సినీ కుటుంబానికి చెందిన పిల్లలపై ఉండే మీడియా ఒత్తిడి నుంచి ఆమెను దూరంగా ఉంచాలని భావిస్తున్నట్లు చెప్పారు. తాను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న విలువలు, ముఖ్యంగా తన తల్లి నుంచి వచ్చిన వార‌సత్వం ఇప్పుడు పేరెంటింగ్‌లో ఉపయోగపడుతున్నాయని వెల్లడించారు.

రణవీర్ – దీపికా కెరీర్ అప్‌డేట్స్

ప్రొఫెషనల్‌గా చూస్తే రణవీర్ సింగ్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆయన నటించిన ‘ధురంధర్ 2’ సినిమా భారీ విజయాన్ని సాధించి బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకుపోతోంది.

మరోవైపు దీపికా పదుకొనే కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ‘కింగ్’ సినిమాలో షారుక్ ఖాన్‌తో కలిసి నటించనున్నారు. అదేవిధంగా దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘AA22xA6’లో అల్లు అర్జున్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.

Also read:

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »