రామ్‌చరణ్ ‘పెద్ది’పై భారీ అంచనాలు.. తిరుమ‌ల శ్రీ‌వారి సేవ‌లో జాన్వీ క‌పూర్‌

రామ్‌చరణ్ (Ramcharan) నటించిన ‘పెద్ది’ (Peddi Movie) విడుదల రోజే హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తిరుమల శ్రీవారి (Tirumala Temple) దర్శనం చేసుకోవడం ఆసక్తి రేపుతోంది. సినిమా విజయంపై ప్రత్యేక ఆశలు పెట్టుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

Janhvi Kapoor Prays at Tirumala on ‘Peddi’ Release Day, Eyes Big Success

Janhvi Kapoor | మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ పెద్ది. ఈ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో గురువారం విడుద‌లైంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. విడుదల రోజు నుంచే ప్రేక్షకుల్లో మంచి స్పందన కనిపిస్తుండగా, సినిమా విజయంపై సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ జాన్వీ కపూర్ తన కొత్త సినిమా ‘పెద్ది’ విజయం సాధించాలని కోరుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సినిమా విడుదల రోజే ఆమె ఆలయానికి వెళ్లడం ప్రత్యేక చర్చగా మారింది. అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్న జాన్వీ కపూర్ సుమారు 3,550 మెట్లు ఎక్కినట్లు సమాచారం. అనంతరం ఆమె స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సంప్రదాయ పట్టు చీరలో కనిపించడంతో భక్తులు, అభిమానుల దృష్టిని ఆకర్షించారు.

Read Also : అది న‌టుల‌కు మాత్ర‌మే ద‌క్కిన అరుదైన అవ‌కాశం.. సోనాక్షి సిన్హా ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..!

ఆలయం వద్ద ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. కొందరు అభిమానులు సెల్ఫీలు, ఫొటోల కోసం ప్రయత్నించగా, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ఇక ‘పెద్ది’ సినిమాపై జాన్వీ కపూర్‌కు ప్రత్యేక ఆశలు ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ తన కెరీర్‌లో కీలక మలుపు అవుతుందని ఆమె భావిస్తున్నారని, సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. రామ్‌చరణ్‌తో జతకట్టిన ఈ చిత్రం ఆమెకు మరో స్థాయి గుర్తింపు తీసుకువస్తుందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ‘పెద్ది’లో రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో కనిపించగా, జాన్వీ కపూర్ కథానాయికగా నటించారు. శివరాజ్‌కుమార్, జగపతిబాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

Read Also : ఎన్టీఆర్‌కు భార‌త ర‌త్న ఇవ్వాలి.. మ‌హానాడు వేదిక‌గా డిమాండ్ చేసిన చంద్ర‌బాబు..

ముందురోజు నుంచే కొన్ని ప్రాంతాల్లో పెయిడ్ ప్రీమియర్ షోలు నిర్వహించగా.. అధికారికంగా గురువారం సినిమా థియేటర్లలోకి వచ్చింది. రామ్‌చరణ్ లుక్, స్పోర్ట్స్ డ్రామా నేపథ్యం, ఎమోషనల్ ట్రీట్‌మెంట్ ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారాయి. తొలి షో నుంచే సినిమా పట్ల పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. జాన్వీ కపూర్ తిరుమల దర్శనం ఇది తొలిసారి కాకపోయినా ప్రతి కీలక సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి మాత్రం ‘పెద్ది’ విడుదల రోజే ఆమె స్వామివారిని దర్శించుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ ఈ మూవీపై భారీగా అంచ‌నాలు పెట్టుకుంది. ఇటీవ‌ల న‌టించిన ప‌లు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం భారీగా ఆశ‌లు పెట్టుకుంది.

Read Also : రాబోయే ఐదేళ్ల‌లో చుక్క‌లే ఇక‌..! భారీగా పెర‌గ‌నున్న ఉష్ణోగ్ర‌త‌లు..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »