Jacqueline Fernandez | మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసులో అప్రూవర్‌గా మారేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో జాక్వెలిన్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నది. ఈ కేసు కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వ్యాపారవేత్తలు, ప్రముఖులను టార్గెట్ చేసుకొని కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లుగా సుకేశ్ చంద్రశేఖర్ ఆరోపణలు ఎదుర్కంటున్నారు. అతనితో జాక్వెలిన్‌కు ఉన్న సంబంధాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. అయితే, ఈ కేసులో తాను బాధితురాలినేనని.. ప్రభుత్వ సాక్షిగా మారేందుకు అనుమతించాలంటూ జాక్వెలిన్ కోర్టును ఆశ్రయించింది. అయితే, సోమవారం ప్రత్యేక కోర్టులో హీరోయిన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.
Read Also : ఫార్ములా ఈ–కారు కేసులో చార్జిషీట్‌కు రంగం సిద్ధం… కేటీఆర్‌ను ఏ1గా పేర్కొనే అవకాశం
వాదనలు తోసిపుచ్చిన ఈడీ..
జాక్వెలిన్ వాదలను ఈడీ తోసిపుచ్చింది. సుకేశ్ నేర చరిత్ర గురించి తెలిసినా సుకేశ్‌తో సంబంధాలు కొనసాగించిందని కోర్టుకు స్పష్టం చేసింది. ఆర్థిక నేరగాడినుంచి పెద్ద ఎత్తున విలావంతమైన వస్తువులు, ఖరీదైన గిఫ్ట్‌లతో పాటు పలు ఆర్థిక ప్రయోజనాలను పొందినట్లుగా ఈడీ పేర్కొంది. సుకేశ్ తన నేరాలతో సంపాదించిన డబ్బుతో జాక్వెలిన్‌కు ఇచ్చాడని, విదేశీ టూర్లకు సైతం ఏర్పాట్లు చేశాడని దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో జాక్వెలిన్ తనకు ఏమీ తెలియని చెప్పడం నమ్మశక్యం కాదని ఈడీ కోర్టుకు చెప్పింది. ‘సుకేష్‌తో ఎప్పటికప్పుడు టచ్లో ఉండడం, పలు మార్గాల్లో ప్రయోజనాలను పొందడం చూస్తే అది కేవలం అమాయకత్వం కాదని స్పష్టమవుతోందని ఈడీ తెలిపింది. సుకేశ్‌కు డబ్బు నేరాలతోనే వస్తుందని తెలిసినా.. ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదని ఆరోపించింది.
Read Also : థ్యాంక్స్ సీఎం రేవంత్..! సీఎం రేవంత్ చిత్రపటానికి 2008 డీఎస్సీ టీచర్స్ పాలాభిషేకం..!
వెనక్కి తగ్గిన నటి..
ఈడీ సమర్పించిన వాదనలు నేపథ్యంలో జాక్వెలిన్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. ప్రత్యేక న్యాయమూర్తి ప్రశాంత్ శర్మ ధర్మాసనం అనుమతితితో పిటిషన్‌ను శ్రీలంకన్ బ్యూటీ ఉపసంహరించుకుంది. ఈ కేసులో జాక్వెలిన్‌ను ఈడీ ఇప్పటికే పలుమార్లు విచారించింది. తర్వాత దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌లో ఆమెను నిందితురాలిగా చేర్చింది. ఈ వ్యవహారం బాలీవుడ్‌లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం ఢిల్లీ జైలులో ఉన్నాడు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖుల పేర్లను వాడుకొని పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Read Also : రాయదుర్గం భూములు వేలం వేయనున్న కాంగ్రెస్ సర్కారు..! ఒక్కో ఎకరానికి రూ.139 కోట్లు..!


