దసరా బరిలో ఐదు సినిమాలు.. అసలు పోటీ మాత్రం ఈ రెండు చిత్రాల మధ్యే!

దసరా పండుగకు ఐదు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రజినీకాంత్ జైలర్ 2, విజయ్ దేవరకొండ రణబాలి మధ్య ప్రధాన పోటీ ఉండగా, మిగతా చిత్రాలు థియేటర్లు, షోల కోసం పోటీపడనున్నాయి.

దసరా 2026 సినిమాలు
దసరా 2026 సినిమాలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి, సమ్మర్ తర్వాత దసరా అనే పెద్ద సీజన్ ఉంది. ఇప్పుడు ఈ పండుగ సందర్భంగా ఐదు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వాటిలో ప్రసిద్ధ నటుల చిత్రాలతో పాటు ఇప్పుడిప్పుడే తమ ప్రతిభ చాటుతున్న వారి సినిమాలు ఉన్నాయి. దీంతో ఈ ఐదు సినిమాల్లో ఏది ఎక్కువ మంది ఆడియన్స్‌ను మెప్పిస్తుందనే అంశం ఆసక్తికర చర్చకు దారితీస్తుంది.

దసరా బరిలో ఐదు.. లెక్కకి ఎన్నున్నా పోటీ రెండిటి మధ్యేనా?

దసరా బరిలో ఐదు సినిమాలు ఉన్నప్పటికీ అసలు పోటీ మాత్రం రెండు సినిమాల మధ్యనే కనిపిస్తోంది. జైలర్ 2 వర్సెస్ రణబాలి అన్నట్టుగా పరిస్థితి మారింది. మరోవైపు ఆదర్శ కుటుంబం సినిమా పోటీ నుంచి తప్పుకుంది. రీజన్ ఏదైనా.. అసలు పండగ ఈ రెండు సినిమాలదేనా అనే చర్చ మొదలైంది.

వరుసగా పదకొండు రోజులు సెలవులు కావడంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఓ మంచి అవకాశం వచ్చింది. ఆడియన్స్ రిలాక్స్ మూడ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఇదే సరైన సమయం. అయితే రిలీజ్‌కి డేట్ ఇచ్చి కూడా ఆదర్శ కుటుంబం వెనక్కి తగ్గింది.

దీంతో రజినీకాంత్ జైలర్ 2, విజయ్ దేవరకొండ రణబాలి తో పాటు క్రేజీ కళ్యాణం, గరివిడి లక్ష్మి, సమ్మర్ హాలిడేస్ కూడా ఇదే పండగ సందర్భంగా విడుదలకు రెడీ అయిపోతున్నాయి.

అయితే వీటి వ్యాపార స్థాయి అంచనాలు ఈ రెండు బిగ్ టికెట్ సినిమాలతో పోల్చలేం. బాక్సాఫీస్‌ను ఏలడం కంటే తమ సినిమాకు తగినన్ని థియేటర్లు, షోలు దక్కించుకొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడమే ఈ మూడు చిత్రాల ముందు ఉన్న అసలు సవాలుగా మారింది.

కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకుల ఆదరణ

ఇక్కడ కట్‌ఔట్ మాత్రమే కాదు.. కంటెంట్ కూడా ముఖ్యం అనే ట్రెండ్ బాగా పెరిగిపోయింది. కథలో ఏ మాత్రం తేడా వచ్చినా, టేకింగ్ బోర్ కొట్టించినా మన ఆడియన్స్ ఏ మాత్రం స్పేర్ చేయడం లేదు. మొదటి షో పూర్తవ్వకముందే టాక్ స్ప్రెడ్ చేసేస్తున్నారు.

అందుకే ఐదు సినిమాలపై అంచనాల సంగతి ఎలా ఉన్నా.. హాలిడే మూడ్‌ను ఏ సినిమా క్యాష్ చేసుకుంటుందో అనే ఆసక్తి రెగ్యులర్ సినీ గోలలో కనిపిస్తోంది.

జైలర్ 2 వర్సెస్ రణబాలి

రజినీకాంత్ మాస్ ఇమేజ్‌తో జైలర్ 2 భారీ ఓపెనింగ్ సాధించే దిశగా ఉంటే, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలయికలో డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న రణబాలిపై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి.

ఈ రెండింటికి భారీ స్థాయిలో థియేటర్లు, ప్రైమ్ షోలు లభించనున్నాయి. కాబట్టి ఐదు సినిమాలు బరిలో ఉన్నప్పటికీ దసరా బాక్సాఫీస్ అసలు పోరు మాత్రం ఈ రెండు సినిమాల మధ్య ఉండబోతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

జైలర్ 2పై భారీ అంచనాలు

జైలర్ ఇచ్చిన బూస్ట్‌తో జైలర్ 2పై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే అది ఎలా ఉన్నా కూడా చూడాలనే సెక్షన్ ఎక్కువే ఉంటుంది.

ఆయన యాక్షన్ కానీ, మ్యానరిజమ్స్‌లో కానీ పెద్దగా తేడా ఉండదు. అయితే హిట్ అయిందంటే మాత్రం కలెక్షన్స్ రేంజ్ వేరుగా ఉంటుంది. తేడా కొడితే మాత్రం ఆ సైలెన్స్ కూడా భీభత్సంగా ఉంటుందని ఆయన గత ఫ్లాప్ సినిమాలు ప్రూవ్ చేశాయి.

రణబాలిపై కూడా ఆసక్తి

ఇక విజయ్ దేవరకొండ రణబాలి సంగతికి వస్తే.. సీమలోని పీరియాడికల్ కంటెంట్‌తో వస్తుంది. టేకింగ్ జనాలను ఆకట్టుకునేలా కథను తెరకెక్కిస్తే ఓ మంచి సక్సెస్ సాధించే ఛాన్స్‌లు ఉన్నాయి అంటున్నారు.

కానీ ఏదో డాక్యుమెంటరీ బిల్డప్ వస్తే మాత్రం భరించడం కష్టం అనేది మరికొంతమంది అంచనా.

ఇక మిగిలిన క్రేజీ కళ్యాణం, గరివిడి లక్ష్మి, సమ్మర్ హాలిడేస్ థియేటర్ల కోసం పోటీ పడాల్సి ఉంటుంది. మరి ఏ సినిమా విజయం సాధిస్తుంది? ఏ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి మరి.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »