కొచ్చిలో ముత్తూట్ ఫైనాన్స్ ఆశా శక్తి కార్యక్రమం.. ఎర్నాకుళంలో 239 మంది ఆశా వర్కర్లకు సత్కారం..

సమాజ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ముందున్న ఆశా వర్కర్ల సేవలను గుర్తిస్తూ ముత్తూట్ ఫైనాన్స్ ఆశా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించింది.

కొచ్చిలో ముత్తూట్ ఫైనాన్స్ ఆశా శక్తి కార్యక్రమం.. ఎర్నాకుళంలో 239 మంది ఆశా వర్కర్లకు సత్కారం..

సమాజ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ముందున్న ఆశా వర్కర్ల సేవలను గుర్తిస్తూ ముత్తూట్ ఫైనాన్స్ ఆశా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొదటి దశ కోసం రూ. 30 లక్షలు కేటాయించిన ఈ కార్యక్రమాన్ని కేరళలోని ఎర్నాకుళం జిల్లా నుండి దశలవారీగా అమలు చేయనున్నారు. నేషనల్ హెల్త్ మిషన్‌లో నమోదైన ఎర్నాకుళంలోని 60 ఏళ్లు పైబడిన 239 మంది ఆశా వర్కర్లను మొదటి దశలో సత్కరించారు. వారి నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఒక్కొక్కరికి రూ. 10,000 నగదుతో పాటు జ్ఞాపికను అందజేశారు.

 ప్రముఖుల హాజరు..
నవంబర్ 20, 2026న కొచ్చిలోని పాలారివట్టంలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ ప్రధాన కార్యాలయంలో కేరళ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కే మురళీధరన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉమా థామస్, ముత్తూట్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్లు జార్జ్ ఎం జార్జ్, జార్జ్ ఎం జాకబ్, వీపీఎస్ లేక్‌షోర్ వైద్యురాలు డాక్టర్ చిత్రతర, ఎర్నాకుళం డీఎంఓ డాక్టర్ ఆర్ షాహిర్షా, ఎన్‌హెచ్‌ఎం జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ హనీష్ ఎంఎం, కొచ్చి కార్పొరేషన్ కౌన్సిలర్ షిబీ సోమన్ పాల్గొన్నారు.

ఆశా వర్కర్ల సేవలపై ప్రశంసలు..
క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా వర్కర్లను సత్కరించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి, మరింత ఉత్సాహంతో సేవలు అందించడానికి తోడ్పడుతుందని మంత్రి కే మురళీధరన్ పేర్కొన్నారు. ప్రజారోగ్య వ్యవస్థకు, ప్రజలకు మధ్య వారధిగా నిలిచే ఆశా వర్కర్ల అంకితభావం ఎన్నో కుటుంబాల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిందని, జీవితంలో కీలక కాలాన్ని సమాజ సేవకు అంకితం చేసిన మహిళలను గౌరవించడం సంతోషంగా ఉందని జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావడానికి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని సంస్థ తెలిపింది.

 

About Author:

Vidya Burujukadi

కంటెంట్ రైటర్‌గా మన వార్త వెబ్ సైట్‌కి విద్య.బి పనిచేస్తున్నారు. ప్రధానంగా బిజినెస్ వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను ఆమె అందిస్తారు. విద్యకు తెలుగు మీడియా…

More About Author »