అనిశ్చిత మార్కెట్లలో పెట్టుబడి సౌలభ్యం కీలకం.. టాటా ఏఐఏ ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్ మెరుగైన రాబడులు..

అనిశ్చిత మార్కెట్లలో పెట్టుబడి సౌలభ్యం కీలకం.. టాటా ఏఐఏ ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్ మెరుగైన రాబడులు..

మార్కెట్ ఒడుదొడుకులు, మారుతున్న ఆర్థిక పరిస్థితుల మధ్య దీర్ఘకాలిక సంపద సృష్టికి పెట్టుబడిలో సౌలభ్యం, క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల ద్వారా అందుబాటులో ఉన్న టాటా ఏఐఏ ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్ లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ సంస్థలలో చురుకైన పెట్టుబడి వ్యూహాన్ని అనుసరిస్తోంది. 2026 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు ఈ ఫండ్ 14.89 శాతం రాబడిని అందించగా, నిఫ్టీ 500 బెంచ్‌మార్క్ 7.52 శాతం రాబడిని నమోదు చేసింది. ప్రారంభం నుండి వార్షిక ప్రాతిపదికన ఈ ఫండ్ 12.12 శాతం రాబడిని ఇవ్వగా, బెంచ్‌మార్క్ 4.75 శాతంగా నిలిచింది. గత ఏడాది కాలంలో ఫండ్ 7.22 శాతం రాబడిని ఇవ్వగా, బెంచ్‌మార్క్ మైనస్ 2.91 శాతంగా ఉంది.

మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడి వ్యూహం..
పిల్లల చదువు, ఇల్లు కొనుగోలు, పదవీ విరమణ వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టే వారికి మార్కెట్ అనిశ్చితి సమయాలలో పెట్టుబడి సౌలభ్యం కీలకంగా నిలుస్తుందని సంస్థ పేర్కొంది. ఆర్థిక మూలాలు, లాభదాయకత, వృద్ధి అవకాశాల ఆధారంగా వివిధ రంగాలు, మార్కెట్ విభాగాలలో అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ ఫండ్ పనిచేస్తోంది. మార్కెట్లో అనిశ్చితి, ఆశావాదం ఎప్పుడూ ఉంటాయని, నాణ్యమైన వ్యాపార సంస్థలపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగించడం దీర్ఘకాలిక సంపదకు అవసరమని టాటా ఏఐఏ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ హర్షద్ పాటిల్ తెలిపారు.

సంపద సృష్టితో పాటు జీవిత బీమా రక్షణ..
టాటా ఏఐఏ యూనిట్ లింక్డ్ ప్లాన్‌ల ద్వారా మార్కెట్ ఆధారిత సంపద సృష్టితో పాటు కుటుంబాలకు జీవిత బీమా రక్షణ కూడా లభిస్తుంది. పాలసీ నిబంధనలకు లోబడి అవసరాలకు అనుగుణంగా ఫండ్‌లను మార్చుకునే సౌలభ్యం పాలసీదారులకు ఉంటుంది. సెప్టెంబర్ 30, 2026 నాటికి ఈ ఫండ్ రూ. 1,340.55 కోట్ల ఆస్తులను నిర్వహిస్తుండగా, ఈక్విటీలలో 70 నుండి 100 శాతం వరకు పెట్టుబడులు ఉన్నాయి. ఐదు పర్సిస్టెన్సీ విభాగాలలో నాలుగింటిలో టాటా ఏఐఏ మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఈ ఫండ్ అధిక రిస్క్ స్వభావం కలిగి ఉన్నందున పెట్టుబడిదారులు తమ రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేసుకుని నిర్ణయం తీసుకోవాలని, గత రాబడులు భవిష్యత్ రాబడులకు హామీ కావని, మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది.

About Author:

Vidya Burujukadi

కంటెంట్ రైటర్‌గా మన వార్త వెబ్ సైట్‌కి విద్య.బి పనిచేస్తున్నారు. ప్రధానంగా బిజినెస్ వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను ఆమె అందిస్తారు. విద్యకు తెలుగు మీడియా…

More About Author »