భారత దేశ వృద్ధి కోసం పరిశ్రమలు, ప్రభుత్వం ఏకం కావాలన్న అనిల్ అగర్వాల్

ఫిక్కీ వేదికపై ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ప్రభుత్వం, ప్రైవేట్ రంగాల మధ్య మరింత సహకారం అవసరమని ఆయన పిలుపునిచ్చారు.

భారత దేశ వృద్ధి కోసం పరిశ్రమలు, ప్రభుత్వం ఏకం కావాలన్న అనిల్ అగర్వాల్

ఫిక్కీ వేదికపై ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ప్రభుత్వం, ప్రైవేట్ రంగాల మధ్య మరింత సహకారం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. సహజ వనరులు, ఇంధనం, తయారీ, భారీ పరిశ్రమల రంగాలలోని ప్రభుత్వ కంపెనీలను మరింతగా ప్రైవేటీకరించాలని అనిల్ అగర్వాల్ ప్రతిపాదించారు. ప్రైవేట్ నిర్వహణ వల్ల ఉత్పాదకత పెరిగి, ఉద్యోగాలు వస్తాయని, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. అయితే ఉద్యోగుల తొలగింపు ఉండకూడదని, ఉపాధిని మూడు రెట్లు పెంచాలనే రెండు షరతులతో ప్రైవేటీకరణ జరగాలని సూచించారు. కార్పొరేట్ కొనుగోళ్లకు బదులుగా ప్రజలకు షేర్లు పంచే విధానాన్ని ప్రస్తావిస్తూ, దీనివల్ల వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ అప్పులు తీర్చడానికి, మౌలిక సదుపాయాల కల్పనకు వాడవచ్చని పేర్కొన్నారు.

సరళమైన నిబంధనలు…
సుదీర్ఘమైన అనుమతుల ప్రక్రియ స్థానంలో స్వీయ ధ్రువీకరణ, సరళమైన నిబంధనలు తీసుకురావాలని అగర్వాల్ కోరారు. ప్రభుత్వం స్పష్టమైన నియమాలు పెట్టి ఆడిట్ల ద్వారా పర్యవేక్షిస్తే కొత్త పరిశ్రమలు వేగంగా ఎదుగుతాయని అన్నారు. అలాగే ఖనిజాలు, లోహాలు, హైడ్రోకార్బన్ రంగాలలో అన్వేషణ యువతకు, స్టార్టప్‌లకు గొప్ప అవకాశమని తెలిపారు. స్టార్టప్‌లు తాము కనుగొన్న వనరులను ఓఎన్జీసీ, హిందుస్థాన్ జింక్ వంటి పెద్ద కంపెనీలకు విక్రయించే వీలు కల్పిస్తే వందలాది స్టార్టప్‌లు పుట్టుకొస్తాయని, దేశీయ వనరుల వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు. ప్రైవేటీకరణ, స్వీయ ధ్రువీకరణ, అన్వేషణ అంశాలపై పరిశ్రమలు, ప్రభుత్వం, పౌరులు కలిసి ఒక జాతీయ ఉద్యమాన్ని నిర్మించాలని అనిల్ అగర్వాల్ కోరారు. ఆహార స్వయం సమృద్ధిని సాధించిన జై జవాన్ జై కిసాన్ ఉద్యమం తరహాలోనే, ఉద్యోగాల సృష్టికి, ప్రజల ఆదాయాలను పెంచడానికి, రూపాయిని బలోపేతం చేయడానికి అందరి సమష్టి కృషి అవసరమని ఆయన ఎక్స్ పోస్ట్‌లో స్పష్టం చేశారు.

About Author:

Vidya Burujukadi

కంటెంట్ రైటర్‌గా మన వార్త వెబ్ సైట్‌కి విద్య.బి పనిచేస్తున్నారు. ప్రధానంగా బిజినెస్ వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను ఆమె అందిస్తారు. విద్యకు తెలుగు మీడియా…

More About Author »