మీర్జాపూర్’ సినిమా అప్‌డేట్ ఇచ్చిన టీమ్….

Mirzapur The Film: ప్రైమ్ వీడియోలో సంచలనం సృష్టించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఇప్పుడు ‘మీర్జాపూర్ ది ఫిల్మ్’ గా మారనుంది. షూటింగ్ పూర్తయినట్లు టీమ్ ప్రకటించగా, త్వరలో విడుదల తేదీ వెల్లడించనున్నారు. ఈ సినిమా సిరీస్‌కు ప్రీక్వెల్‌గా ఉండనుంది.

Mirzapur The Film shooting completed latest update
Mirzapur The Film shooting completed latest update

Mirzapur The Film

  • ప్రైమ్ వీడియోలో సంచలన విజయం సాధించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఇప్పుడు ‘మీర్జాపూర్ ది ఫిల్మ్’ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • ఆగస్టు 2025లో ప్రారంభమైన షూటింగ్‌ను కేవలం 6 నెలల్లో పూర్తి చేసినట్లు టీమ్ అధికారికంగా వెల్లడించింది.

  • ఈ సినిమా సిరీస్‌కు ప్రీక్వెల్‌గా ఉండనుండగా, గత మూడు సీజన్లలో చనిపోయిన పాత్రలు కూడా కనిపించనున్నట్లు సమాచారం.

యువతను విశేషంగా ఆకట్టుకున్న వెబ్‌ సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలై అంతటా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇప్పుడీ సిరీస్‌ సినిమాగా రానున్న విషయం తెలిసిందే. ‘మీర్జాపూర్‌ ది ఫిల్మ్‌’ పేరుతో రానున్న ఈ ప్రాజెక్ట్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌ను టీమ్‌ షేర్‌ చేసింది. షూటింగ్‌ పూర్తయిందని తెలిపింది.

త్వరలోనే విడుదల తేదీ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. గతేడాది ఆగస్టులో దీని రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి 6 నెలల్లోనే పూర్తి చేశారు. సిరీస్‌లకు ప్రీక్వెల్‌గా సినిమా ఉంటుందని గతంలోనే టీమ్‌ తెలిపింది. సిరీస్‌ మూడు పార్ట్‌లలో చనిపోయినవారంతా తెరపై కనిపిస్తారని వెల్లడించింది.

క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లకు గుర్మీత్‌సింగ్‌ దర్శకత్వం వహించారు. తొలి సీజన్‌ 2018 నవంబరు 16న విడుదలైంది. పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌, శ్రియ పిల్గోంగర్‌, హర్షిత గౌర్‌ తదితరులు నటించారు. దానికి మంచి స్పందన లభించింది. దీంతో దానికి సీక్వెల్‌గా 2020 అక్టోబరు 23న రెండో సీజన్‌ విడుదలవగా అది కూడా విపరీతమైన ఆదరణను సొంతం చేసుకోవడంతో మూడో సీజన్‌ 2024లో జులై 5న ప్రేక్షకుల ముందుకువచ్చింది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »