ఇంటీరియో బై గోద్రెజ్ తాజా సోఫా.. మనకు నచ్చినట్లుగా మార్చుకునే సౌకర్యం!

ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ ఇంటీరియో బై గోద్రెజ్ తన తాజా సోఫా క్యాంపెయిన్‌ను ఆవిష్కరించింది. "అప్‌మోడ్స్. యువర్ సోఫా, యువర్ వే!" పేరిట రూపొందించిన ఈ క్యాంపెయిన్‌తో మనకు తగినట్లుగా మార్చుకునే సౌకర్యాన్ని అందిస్తోంది.

ఇంటీరియో బై గోద్రెజ్ తాజా సోఫా.. మనకు నచ్చినట్లుగా మార్చుకునే సౌకర్యం!

ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ ఇంటీరియో బై గోద్రెజ్ తన తాజా సోఫా క్యాంపెయిన్‌ను ఆవిష్కరించింది. “అప్‌మోడ్స్. యువర్ సోఫా, యువర్ వే!” పేరిట రూపొందించిన ఈ క్యాంపెయిన్‌తో మనకు తగినట్లుగా మార్చుకునే సౌకర్యాన్ని అందిస్తోంది. ఒక కుటుంబం కొత్త సోఫా కోసం ఇంటీరియో బై గోద్రెజ్ స్టోర్‌కు వెళ్లినప్పుడు జరిగే సరదా సంఘటనల ఆధారంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు.

సోఫా విషయంలో కుటుంబంలోని ప్రతి ఒక్కరి అవసరాలు వేరుగా ఉంటాయి. టీనేజ్ కొడుకు ఛేజ్ సోఫా కావాలని కోరుకుంటే, తండ్రి ఛార్జింగ్ పోర్ట్ ఉన్న సోఫా కావాలంటాడు. భార్య స్టోరేజ్ ఉన్న సోఫా గురించి చెబుతుంది, అమ్మమ్మ మాత్రం కుక్కకు ఇష్టమైన నీలిరంగు సోఫా కావాలని అంటుంది. అందరి అవసరాలను ఒకచోట చేర్చేలా అప్‌మోడ్స్ సోఫాలను మనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చని సేల్స్‌పర్సన్ వివరిస్తాడు.

ఇంటీరియో బై గోద్రెజ్ హెడ్ రెషు సరాఫ్ మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి సొంత ఆలోచనలు ఉంటాయని, మా అప్‌మోడ్స్ రేంజ్‌తో వినియోగదారులు తమకు నచ్చిన విధంగా సోఫాను రూపొందించుకోవచ్చని తెలిపారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరి సౌకర్య భావన వేరుగా ఉంటుందని, అదనపు లెగ్‌రూమ్, ఫోన్ ఛార్జింగ్ స్థలం, స్టోరేజ్ లేదా ఇష్టమైన రంగు వంటి ఎంపికలు ఇందులో ఉంటాయని పేర్కొన్నారు.

సింగిల్, డ్యూయల్-టోన్ కాంబినేషన్లతో సహా 25 రంగుల ఆప్షన్లు, లెదర్ , ఫ్యాబ్రిక్ ఎంపికలతో ఇది అందుబాటులో ఉంది. 1750కి పైగా విభిన్న కాన్ఫిగరేషన్‌లతో కుటుంబంలో ఎవరూ రాజీ పడకుండా సోఫాను తీర్చిదిద్దుకోవచ్చు. థండర్ ఫిలిమ్స్ నిర్మాణంలో, సందీప్ యాదవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యూట్యూబ్, సోషల్ మీడియా , ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం కానుంది. ఆధునిక భారతీయ ఇళ్ల కోసం కార్యాచరణ, ఆకర్షణ , మనకు తగినట్లుగా మలచుకునే సౌకర్యాన్ని మిళితం చేసే ఫర్నిచర్ పరిష్కారాలను సృష్టిస్తూ ఇంటీరియో తన డిజైన్ విధానాన్ని ముందుకు తీసుకువెళుతోంది.

About Author:

Vidya Burujukadi

కంటెంట్ రైటర్‌గా మన వార్త వెబ్ సైట్‌కి విద్య.బి పనిచేస్తున్నారు. ప్రధానంగా బిజినెస్ వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను ఆమె అందిస్తారు. విద్యకు తెలుగు మీడియా…

More About Author »