పొరపాటున కూడా ఈ వస్తువులను ఇతరుల నుండి అప్పుగా తీసుకున్నారో అంతే సంగతి

వాస్తు శాస్త్రం(Vastu tips) ప్రకారం ఇతరుల నుంచి కొన్ని వస్తువులను అరువుగా తీసుకోవడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించి ఆర్థిక నష్టం, గొడవలు, మనశ్శాంతి లోపించవచ్చు. చీపురు, తెల్లటి వస్తువులు, ఇనుప సామగ్రి, గడియారం, దుస్తులు వంటి వాటిని అప్పుగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ వాస్తు సూచనలు పాటిస్తే ఇంట్లో శుభశక్తి నిలుస్తుంది.

Vastu tips
Vastu tips

Vastu tips

హైదరాబాద్: వాస్తు శాస్త్రం(Vastu tips) ప్రకారం, మన చుట్టూ ఉండే వస్తువులు మన జీవితంపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. చాలామంది తమకు అవసరమైనప్పుడు పక్కింటి వారి దగ్గరో లేదా స్నేహితుల దగ్గరో వస్తువులను అప్పుగా అడిగి తీసుకుంటారు. ఇది చూడటానికి సాధారణమైన విషయంగా అనిపించినప్పటికీ, వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను ఇతరుల నుండి తీసుకోవడం వల్ల మన ఇంటి శ్రేయస్సు దెబ్బతింటుంది. అరువు తెచ్చుకున్న వస్తువులతో పాటు అవతలి వారి ప్రతికూల శక్తి కూడా మన ఇంట్లోకి ప్రవేశించి, ఆర్థిక ఇబ్బందులకు, గొడవలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇతరుల నుండి పొరపాటున కూడా అరువు తీసుకోకూడని వస్తువులు

1. చీపురు :
వాస్తు శాస్త్రంలో చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే పొరపాటున కూడా వేరొకరి ఇంటి నుండి చీపురును అప్పుగా తీసుకురాకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లోని ఐశ్వర్యం తగ్గిపోవడమే కాకుండా, ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుంది. ఇతరుల చీపురును వాడటం వల్ల ప్రతికూల శక్తి ఇంటిని చుట్టుముడుతుంది.

2. తెల్లటి వస్తువులు :
ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఉప్పు, పాలు, పెరుగు, చక్కెర వంటి తెల్లటి పదార్థాలను ఇతరుల నుండి తీసుకోకూడదు, ఎవరికీ ఇవ్వకూడదు. సూర్యాస్తమయం తర్వాత వీటిని తీసేకోవడం వల్ల ఇంట్లోని శుభ శక్తి క్షీణిస్తుంది. దీని ప్రభావంతో ఇంట్లో ప్రశాంతత తగ్గి, ధన నష్టం కలుగుతుంది

3. ఇనుప వస్తువులు :
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇనుమును శని దేవుడికి చిహ్నంగా భావిస్తారు. వేరొకరి నుండి ఇనుప వస్తువులను అరువుగా తీసుకోవడం వల్ల, ఆ వ్యక్తిపై ఉండే శని గ్రహ ప్రతికూల ప్రభావం మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఇది ఇంట్లో అనవసరమైన గందరగోళానికి, మానసిక ఒత్తిడికి కారణమవుతుంది.

Vastu tips
Vastu tips

4. గడియారం :
గడియారం మనిషి సమయాన్ని సూచిస్తుంది. వాస్తు ప్రకారం(Vastu tips), వేరొకరి గడియారాన్ని మనం ధరించినప్పుడు, వారి జీవితంలోని కష్టాలు లేదా దురదృష్టం మనకు సోకే ప్రమాదం ఉంది. ఇది మీ పురోగతిని అడ్డుకుంటుంది. అలాగే ఇంట్లో ఎప్పుడూ ఆగిపోయిన గడియారాలను ఉంచకూడదని గుర్తుంచుకోండి.

5. దుస్తులు, చెప్పులు :
మరొకరు ధరించిన బట్టలను అడగడం లేదా వాటిని ధరించడం ఏమాత్రం మంచిది కాదు. ఒకరి శక్తి ఆ వ్యక్తి దుస్తులలో ఉంటుందని నమ్ముతారు. ఇతరుల దుస్తులు ధరిస్తే మీకు దురదృష్టం కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా వేరొకరి చెప్పులు, రుమాలు (Handkerchief) వాడటం వల్ల వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

జీవితంలో ఏదైనా వస్తువు తక్కువైతే కొనుక్కోవాలి లేదా ప్రత్యామ్నాయం చూసుకోవాలి కానీ, పై వస్తువులను అరువుగా తెచ్చుకోవడం మనశ్శాంతిని దూరం చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »