పిల్లల కోసం స్పెషల్ స్నాక్.. పైన కరకరలాడుతూ.. లోపల సాఫ్ట్‌గా ఉండే సేమియా కట్లెట్స్ రుచి అద్భుతం!

సాయంత్రం స్నాక్‌గా పిల్లలు ఇష్టపడే క్రంచీ సేమియా వెజ్ కట్లెట్స్‌ను(Semiya Cutlets) ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. అటుకులు, ఆలుగడ్డలు, కూరగాయలతో చేసిన ఈ రెసిపీ టేస్ట్‌తో పాటు పోషకాహారం కూడా అందిస్తుంది.

Crispy Semiya Veg Cutlets Recipe at Home
Crispy Semiya Veg Cutlets Recipe at Home

Semiya Cutlets

  • సేమియా కోటింగ్ వల్ల ఈ వెజ్ కట్లెట్స్ బయట క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా ఉంటాయి.

  • అటుకులు, ఆలుగడ్డలు, కూరగాయల కలయికతో పిల్లలకు పోషకాహారం కూడా అందుతుంది.

  • సాయంత్రం స్నాక్‌కు తక్కువ సమయంలో ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్‌లో తయారు చేసుకోవచ్చు.

హైదరాబాద్: సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏదైనా కొత్తగా, రుచిగా తినాలని అడుగుతుంటారు. రోజూ చేసే బజ్జీలు, పకోడీలు కాకుండా ఈసారి వెరైటీగా “సేమియా వెజ్ కట్లెట్స్” ట్రై చేయండి. రంగురంగుల కూరగాయలు, అటుకులు, ఆలుగడ్డల కలయికతో చేసే ఈ స్నాక్ చూడటానికి స్వీట్ షాప్ స్టైల్ లో ఉండి, రుచిలో అద్దిరిపోతుంది. పైన సేమియా కోటింగ్ ఉండటం వల్ల ఇవి చాలా క్రంచీగా ఉంటాయి. అతి తక్కువ సమయంలో ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే ఈ క్రిస్పీ కట్లెట్స్ రెసిపీ మీకోసం..

కావాల్సిన పదార్థాలు:

  • బేస్ కోసం: అటుకులు (2 కప్పులు), ఉడికించిన ఆలుగడ్డలు (4).
  • కూరగాయలు: ఉల్లిపాయ, క్యాప్సికం, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, మొక్కజొన్న గింజలు (స్వీట్ కార్న్).
  • మసాలాలు: జీలకర్ర పొడి, చాట్ మసాలా, మిరియాల పొడి, కారం, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర.
  • కోటింగ్ కోసం: సన్నని సేమియా (300 గ్రా), మైదా పిండి, శనగపిండి.

తయారీ విధానం:

ముందుగా అటుకులను కడిగి, నీరు పిండేసి మెత్తగా చేసుకోవాలి. అందులో ఉడికించి తురిమిన ఆలుగడ్డలను కలపాలి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ, క్యాప్సికం, క్యారెట్, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అన్ని మసాలాలు (ఉప్పు, కారం, చాట్ మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, నిమ్మరసం) వేసి గట్టిగా పిండిలా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన ఆకారంలో (సిలిండర్ లేదా రౌండ్ కట్లెట్స్ లాగా) చుట్టుకుని పక్కన పెట్టుకోండి.

మూడు వేర్వేరు ప్లేట్లలో, ఒకదానిలో పొడి శనగపిండి, రెండో దానిలో మైదా-నీళ్ల పలుచని మిశ్రమం, మూడో దానిలో చిన్నగా నలిపిన సేమియాను సిద్ధం చేసుకోండి.

తయారు చేసుకున్న కట్లెట్‌(Semiya Cutlets)ను మొదట శనగపిండిలో దొర్లించి, ఆపై మైదా మిశ్రమంలో ముంచి, చివరగా సేమియా ముక్కలు అన్ని వైపులా అంటుకునేలా బాగా రోల్ చేయాలి.

తర్వాత కడాయిలో నూనె వేడి చేసి, మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ కట్లెట్స్‌(Semiya Cutlets)ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు నిదానంగా వేయించాలి.

అంతే! వేడివేడి సేమియా వెజ్ కట్లెట్స్(Semiya Cutlets) రెడీ. వీటిని టమాటా సాస్‌తో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: సేమియా కట్లెట్స్‌ను ఎయిర్ ఫ్రయర్‌లో చేయవచ్చా?

A: అవును. కట్లెట్స్‌పై కొద్దిగా నూనె బ్రష్ చేసి 180°C వద్ద 12–15 నిమిషాలు ఎయిర్ ఫ్రై చేయవచ్చు.

Q2: అటుకుల బదులు బ్రెడ్ వాడవచ్చా?

A: వాడవచ్చు. కానీ అటుకులతో చేసిన కట్లెట్స్ మరింత క్రిస్పీగా, లైట్‌గా ఉంటాయి.

Q3: ఈ కట్లెట్స్‌ను ముందే చేసి నిల్వ చేయవచ్చా?

A: అవును. ఫ్రై చేయకుండా ఫ్రిజ్‌లో 1 రోజు వరకు స్టోర్ చేసి అవసరమైనప్పుడు వేయించవచ్చు.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »