కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పీఎం కుసుమ్ పథకం తాజాగా చర్చనీయాంశంగా మారింది. సోలార్ పంప్‌సెట్లు ఏర్పాటు చేసుకుని మిగులు విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా రైతులు నెలకు లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చు. ఈ కీలక పథకంలో కేంద్రం 60 శాతం సబ్సిడీ అందిస్తోంది. 2026 మార్చి నాటికి 34,800 మెగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని వేగంగా అమలు చేస్తోంది. పీఎం కిసాన్ తర్వాత రైతులకు అత్యంత ప్రయోజనకరంగా మారిన పథకంగా పీఎం కుసుమ్ గుర్తింపు పొందుతోంది.
పీఎం కుసుమ్ పథకం ఎలా పని చేస్తుంది?
ఈ పథకం కింద సోలార్ పంప్‌సెట్ల ఏర్పాటుకు కేంద్రం 60 శాతం సబ్సిడీ అందిస్తుంది. మరో 30 శాతం బ్యాంకు రుణం రూపంలో అందుతుంది. రైతులు కేవలం 10 శాతం మాత్రమే సొంతంగా చెల్లిస్తే సోలార్ పంప్‌సెట్ ఏర్పాటు పూర్తవుతుంది. ఈ పంప్‌సెట్ల ద్వారా పంట సాగుకు అవసరమైన నీటిని పొందడంతో పాటు మిగులు విద్యుత్‌ను రాష్ట్రంలోని డిస్కమ్‌లకు విక్రయించవచ్చు. డిస్కమ్‌లు ముందుగానే రైతులతో 25 ఏళ్ల ఒప్పందం చేసుకుంటాయి. దీంతో రైతులకు సుదీర్ఘకాలం పాటు స్థిరమైన ఆదాయం నిర్ధారణ అవుతుంది.
Also Read: PM-KISAN 2026 Guide: రైతులు ఎలా దరఖాస్తు చేయాలి? పూర్తి స్టెప్-బై-స్టెప్ వివరాలు
నెలకు ఎంత ఆదాయం వస్తుంది ? పూర్తి వివరాలు !
ఒక మెగావాట్ కెపాసిటీ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే రోజుకు దాదాపు 4,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఒక యూనిట్‌కు రూ.3.13 చొప్పున లెక్కిస్తే రోజుకు రూ.14 వేల వరకు ఆదాయం వస్తుంది. నెల మొత్తం లెక్కిస్తే రూ.4 లక్షలకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 25 ఏళ్ల ఒప్పందం ప్రకారం మొత్తం కోట్లల్లో ఆదాయం పొందవచ్చు. ఒకసారి పెట్టుబడి పెడితే దశాబ్దాల పాటు లాభాలు వస్తాయి కాబట్టి రైతులకు ఇది అత్యుత్తమ అవకాశంగా నిలుస్తోంది.
అర్హతలు, అవసరమైన పత్రాలు
ఈ పథకంలో రైతులు, రైతు సంఘాలు, సహకార సంఘాలు, నీటి వినియోగదారుల సంఘాలు, గ్రామ పంచాయతీలు అర్హులు. దరఖాస్తుకు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, డిక్లరేషన్ ఫారం, బ్యాంక్ పాస్‌బుక్, భూమి పత్రాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
పీఎం కుసుమ్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి రిజిస్ట్రేషన్ ఫారంపై క్లిక్ చేయాలి. అన్ని వివరాలు నింపి డిక్లరేషన్ బాక్స్ క్లిక్ చేసి సబ్‌మిట్ చేయాలి. తర్వాత లాగిన్ చేసి అప్లికేషన్ పూర్తి చేసి అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయాలి. దగ్గరలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో కూడా సహాయం పొందవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులు వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ సంచలన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
ఇంకా చదవండి: ఇళ్ల లేని వారికి గుడ్ న్యూస్! PMAY-U 2.0 కింద 2.88 లక్షల ఇళ్లు మంజూరు