ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులకు కిసాన్‌ సమ్మానిధి వస్తుందా..? త్వరలోనే రైతుల ఖాతాల్లోకి 23వ విడత నిధులు..!

దేశవ్యాప్తంగా రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఎం కిసాన్‌ (PM Kisan) 23వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ-కేవైసీ (e-KYC), బ్యాంక్‌ లింకింగ్‌ (Bank Linking) తదితర ప్రక్రియలు పూర్తి చేయకపోతే నిధులు నిలిచేపోయే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

PM-Kisan Scheme
PM-Kisan Scheme : Eligibility Rules for Father and Son, 23rd Installment Expected in 2026

PM Kisan | ఆరుగాలం కష్టించి పంటలు సాగు చేసే రైతులకు ఆర్థికంగా ఊతమిచ్చేందుకు కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా రైతులకు ఏడాదికి రూ.6వేలు ఖాతాల్లో జమ చేస్తోంది. రైతులకు సాగు ఖర్చులను తగ్గించేడమే లక్ష్యంగా 2019లో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంతి రైతులకు ఈ నగదు బదిలీ పథకం ఉపశమనం కల్పిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతులు కిసాన్‌ సమ్మాన్‌ నిధి 23వ విడత నిధుల కోసం రైతాంగం ఎదురుచూస్తోంది.

Read Also : ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రం..! కాన్వాయ్‌లో వాహనాల తగ్గింపు..!

అయితే, ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా? అనే చాలామందిలో ఓ ప్రశ్న తలెత్తుతోంది. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పథకం ప్రయోజనం సాధారణంగా ఒకే కుటంబంలో అర్హత కలిగిన రైతుకు మాత్రమే వర్తిస్తుంది. ఇక్కడ కుటుంబం అంటే భర్త, భార్య, మైనర్‌ పిల్లలను పరిగణలోకి తీసుకుంటారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తండ్రి, కుమారుడు ఇద్దరూ వేర్వేరుగా కాపురం ఉంటే అర్హులుగా పరిగణించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నారు. భూ రికార్డుల్లో తండ్రి, కొడుకు పేర్లు వేర్వేరుగా ఉండడం, ఇద్దరికీ వేర్వేరు కుటుంబాలు ఉండి, ఇతర అర్హతలు ఉంటే మాత్రమం పథకానికి అర్హులేనని నిబంధనలు పేర్కొంటున్నాయి. అయితే, కొడుకు మైనర్‌ అయితే మాత్రం పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండదు. ఇలాంటి సందర్భాల్లో అతన్ని తండ్రి కుటుంబంలో భాగంగానే పరిగణిస్తారు. అలాగే భూమి పూర్తిగా తండ్రి పేరుపై ఉండి, కుమారుడు కేవలం వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తున్నా అతనికి పథకం వర్తించదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Read Also : బండి సంజ‌య్ కొడుకుపై లుక్ అవుట్ నోటీసు జారీ చేయాలి.. క‌విత డిమాండ్‌

ఇదిలా ఉండగా.. కిసాన్‌ సమ్మాన్‌ నిధి 22వ ఇన్‌స్టాల్‌మెంట్‌లో కేంద్ర ప్రభుత్వం మార్చి 13న రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇక ప్రస్తుతం రైతులు 23వ విడుత కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2వేల చొప్పున విడత విడుదల చేస్తారు. ఈ లెక్కన 23వ విడత జూలైలో వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఇన్‌స్టాల్‌మెంట్‌ రిలీజ్‌కు ముందు రైతులు తప్పనిసరిగా కిసాన్‌ సమ్మాన్‌ నిధి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘బెనిఫిషియరీ స్టేటస్’ ద్వారా తమ పేర్లు, వివరాలన ఒకసారి ధ్రువీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పీఎం కిసాన్‌ అకౌంట్‌కు సంబంధించి మొబైల్‌, బయోమెట్రిక్‌ ఈ-కేవైసీ పూర్తి చేయకుంటే త్వరలో విడుదల చేసే నిధులు ఆగిపోయే ప్రమాదం ఉంటుంది.

Read Also : ప్రధాని మోదీ పిలుపుతో రాష్ట్రాల పొదుపు మంత్రం.. సైకిల్‌పై కోర్టుకు జడ్జి, కార్యాలయానికి ఐఆర్‌ఎస్‌ అధికారి..!

ఆధార్‌ని బ్యాంక్‌ ఖాతాతో లింక్‌ చేయకపోయినా, డీబీటీ ఆప్షన్‌ యాక్టివ్‌ కాకపోయినా డబ్బులు ఖాతాలో జమయ్యేందుకు అవకాశం లేదని పేర్కొంటున్నారు. అలాగే, దరఖాస్తులో పేర్కొన్న భూమి వివరాలు ప్రభుత్వ రికార్డులతో సరిపోలకపోయినా తిరస్కరించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఒకే భూమి ఇద్దరి పేరిట ఉంటే.. నిర్ణీత షేర్‌ హోల్డర్‌ అకౌంట్‌లోనే డబ్బులు జమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఏవైనా సాంకేతిక సమస్యలుంటే రైతులు అధికారిక హెల్ప్‌లైట్‌ 155261 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచిస్తున్నారు. అలాగే, నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు పత్రాలతో లబ్ధి పొందినట్లు తేలితే ప్రభుత్వం ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేసే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read Also : వెస్ట్ ఆసియా టెన్షన్ మధ్య భారత్ సేఫ్… ఎనర్జీ భద్రతపై మోడీ స్ట్రాటజీ!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »