దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ప్రస్తుతం దేశంలోని 23 పోస్టల్ సర్కిల్స్‌లో మొత్తం 452 Post Office Passport Seva Kendras (POPSK) పనిచేస్తున్నాయని కేంద్ర కమ్యూనికేషన్స్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాజ్యసభలో వెల్లడించారు.
పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. పాస్‌పోర్ట్ సేవలను గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించేందుకు పోస్టాఫీసుల ద్వారా ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనివల్ల ప్రజలకు ప్రయాణ దూరం, సమయం మరియు ఖర్చులు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
అధికారిక గణాంకాల ప్రకారం, గత మూడు సంవత్సరాల్లో పాస్‌పోర్ట్ దరఖాస్తుల సంఖ్య కూడా భారీగా పెరిగింది.
2023లో: 35,05,818 దరఖాస్తులు
2024లో: 32,38,811 దరఖాస్తులు
2025లో: 39,59,325 దరఖాస్తులు
ఈ సంఖ్యల్లో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (PCC) దరఖాస్తులు కూడా ఉన్నాయి. పాస్‌పోర్ట్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడంతో మరింత మంది ప్రజలు ఈ సేవలను వినియోగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రాల వారీగా కేంద్రాలు
దేశవ్యాప్తంగా పోస్టల్ సర్కిల్స్ వారీగా పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల సంఖ్యను కూడా వెల్లడించారు. ఇందులో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 52 POPSKలు ఉండగా, మహారాష్ట్రలో 42, పశ్చిమ బెంగాల్‌లో 41 కేంద్రాలు పనిచేస్తున్నాయి. దక్షిణ భారత రాష్ట్రాల్లో తమిళనాడులో 32, కర్ణాటకలో 23, ఆంధ్రప్రదేశ్‌లో 21 కేంద్రాలు ఉన్నాయి.
Also Read: ముస్సూరీలో కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుకలు.. ఏయే క్రియేటర్స్ హాజరు కానున్నారో తెలుసా?
తెలంగాణలో కూడా పాస్‌పోర్ట్ సేవలను విస్తరించేందుకు 14 Post Office Passport Seva Kendras ఏర్పాటు చేశారు. వీటి ద్వారా జిల్లాల స్థాయిలో ప్రజలు సులభంగా పాస్‌పోర్ట్ సేవలను పొందే అవకాశం కలిగింది.
ఇంతకుముందు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయాలంటే పెద్ద నగరాల్లో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సమయం, ఖర్చు ఎక్కువగా అయ్యేది. పోస్టాఫీసుల ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో ఈ సమస్యలు తగ్గినట్లు ప్రభుత్వం చెబుతోంది.
POPSK కేంద్రాలు ప్రారంభం కావడం వల్ల చివరి మైలు కనెక్టివిటీ (Last-Mile Connectivity) పెరిగి పాస్‌పోర్ట్ సేవలు మరింత ప్రజానుకూలంగా మారాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువత విదేశీ ఉద్యోగాలు, విద్య అవకాశాల కోసం పాస్‌పోర్ట్ పొందడంలో ఇది సహాయకరంగా మారింది.
Passport services, now closer than ever.
With 452 POPSKs across 23 Circles, India Post is bringing passport services to the last mile, reducing travel, time, and cost for citizens.
To know more about it, visit-
🔗https://t.co/3Z91DMk5kG#POPSK #IndiaPost #PassportServices…— India Post (@IndiaPostOffice) March 12, 2026