“ఆ బాబు ఎక్కడికి పోవాలి? మీరు టికెట్ తీసుకోరా? అయితే చలో.. ఏమీ పికప్ చేయకు. ఇప్పుడు తీసుకో.. ఇక స్కానర్ చూపిస్తా. దీన్ని కొట్టు.. రాయితీగా టికెట్ తీసుకో.”
రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడితో టీటీ మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వినిపిస్తున్నాయి.
“అబ్బా.. గమ్మత్తుగా ఉందిలే. ఇట్లా కూడా టికెట్లు కొనే సిస్టమ్ ఉందా? ఇది ఎప్పటి నుంచి షురూ అయింది? ట్రైన్‌లో ఎక్కిన తర్వాత టీటీలు టికెట్ కొనకుండా ఉన్న ప్రయాణికులను పట్టుకుంటే.. టికెట్ ఇచ్చే పద్ధతి ఇదేనా?” అంటూ వీడియో తీసిన వ్యక్తి ప్రశ్నించారు.
ఈ వీడియో తీసిన వ్యక్తి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
తన పక్క సీటులో కూర్చున్న కొందరు ప్రయాణికులు టికెట్ లేకుండా రైలులో ఎక్కారని, వారిని టీటీ గుర్తించినట్లు ఆయన చెబుతున్నారు.
అయితే సాధారణంగా టికెట్ లేని ప్రయాణికులపై జరిమానా విధించి, నిబంధనల ప్రకారం టికెట్ జారీ చేయాల్సి ఉండగా.. తనకు కనిపించిన దృశ్యం మాత్రం అందుకు భిన్నంగా ఉందని ఆయన ఆరోపించారు.
టీటీ తన వ్యక్తిగత PhonePe స్కానర్ చూపించి.. అందులో డబ్బులు చెల్లిస్తే టికెట్ ఇస్తామని చెప్పినట్లు వీడియోలో ఆరోపించారు.
“సార్.. ఈ పద్ధతి ఏంటి? ప్రయాణికుల నుంచి మీ personal accountలకు ఎందుకు డబ్బులు వేయించుకుంటున్నారు?” అంటూ ఆయన ప్రశ్నించారు.
అంతేకాదు.. మరో టీటీ కూడా ఇదే విధంగా PhonePe, Google Pay వంటి personal payment scanners చూపించి డబ్బులు తీసుకున్నట్లు వీడియోలో ఆరోపించారు.
దీంతో వీడియో తీస్తున్న వ్యక్తి.. “రైల్వేకు అధికారిక స్కానర్లు లేవా? మీ personal accounts ఎందుకు ఉపయోగిస్తున్నారు?” అని ప్రశ్నించారు.
దీనికి రైల్వేకు సంబంధించిన అధికారిక payment scanners సరిగ్గా పనిచేయకపోవడం వల్లే personal PhonePe accounts ఉపయోగిస్తున్నామని టీటీలు చెప్పినట్లు ఆయన ఆరోపించారు.
“రైల్వే అంటే మా కుటుంబం లెక్క.. అందుకే మా personal PhonePeకు డబ్బులు కొట్టమంటున్నాం” అన్నట్టుగా టీటీలు సమాధానం ఇచ్చారని వీడియో తీసిన వ్యక్తి పేర్కొన్నారు.
ఈ సమాధానాలతో అసంతృప్తికి గురైన ఆయన.. తాను మొత్తం విషయాన్ని రికార్డ్ చేశానని, ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి ఉన్నతాధికారులు, ప్రజలకు విషయం తెలియజేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.
🚨A video circulating on Instagram is raising serious questions about railway payment procedures.
The video allegedly shows a TTE issuing a ticket and taking the passenger’s payment via a personal UPI account.
We are NOT making any accusation without an official inquiry.
But… pic.twitter.com/2MzI9holll
— Jharkhand Rail Users (@JharkhandRail) September 2, 2026
అయితే తనను పట్టించుకోకుండా టీటీలు ఈ విషయాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదని, “వీడియో అప్లోడ్ చేసుకో.. దానిదేముంది” అన్నట్టుగా సమాధానం ఇచ్చారని ఆయన ఆరోపించారు.
ఆ తర్వాత మరో బోగీలోకి వెళ్లి అక్కడ కూడా ప్రయాణికుల నుంచి PhonePe ద్వారా డబ్బులు తీసుకున్నట్లు వీడియోలో పేర్కొన్నారు.
ఈ ఘటన నిజమైతే.. ఇది కేవలం ఒక చిన్న తప్పిదం కాదని, రైల్వే ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసే తీవ్రమైన ఆరోపణగా మారుతుంది.
ప్రయాణికుల నుంచి జరిమానాలు లేదా టికెట్ చార్జీలు వసూలు చేసే సమయంలో వ్యక్తిగత UPI ఖాతాలు, PhonePe, Google Payలను ఉపయోగించడం నిబంధనలకు అనుగుణంగా ఉందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
ఇలాంటి వ్యవహారాలపై రైల్వే ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. నిజానిజాలను బయటపెట్టాల్సిన అవసరం ఉంది.
అలాగే ఈ ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఎందుకంటే రైల్వేపై ప్రయాణికులకు ఉన్న నమ్మకాన్ని కాపాడాలంటే.. టికెట్ తనిఖీల్లో పారదర్శకత చాలా ముఖ్యం.
టికెట్ లేకపోతే నిబంధనల ప్రకారం జరిమానా..
డబ్బు చెల్లిస్తే అధికారిక రసీదు..
కానీ personal UPI accountsకు payment ఎందుకు?
ఈ వీడియోలో వచ్చిన ఆరోపణలపై రైల్వే శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.