ఈశ్వర్ సాయి–మాధురి రాథోడ్ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్.. వైరల్ ఆడియోతో కొత్త చర్చ

ఈశ్వర్ సాయి-మాధురి రాథోడ్ వ్యవహారంలో వైరల్ అవుతున్న ఆడియో కొత్త చర్చకు దారితీసింది. ఆడియోలోని వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

eshwar-sai-madhuri-rathod-viral-audio-new-twist
eshwar-sai-madhuri-rathod-viral-audio-new-twist

నారాయణ మూర్తి సినిమాల కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత, నటన, మ్యూజిక్ అన్నీ తానే సినిమాలు తీసినట్టు.. ఈశ్వర్ సాయి–మాధురి రాథోడ్ ఎపిసోడ్‌లో ప్రొడక్షన్ బ్యానర్ నుంచి మొదలు పెడితే టూ డైరెక్షన్ వరకు అన్నీ మాధురి రాథోడ్ నడిపించింది అనే ముచ్చట బయటపడింది. ఇట్లా గుట్టుగా జరుగుతున్న వ్యవహారం ఒక్కసారే బయటపడి బట్టబయలైంది కదా. దానికి కలర్ కోటింగ్ చేసే, కవరింగ్ చేసే ఉపాయం.. బన్ని ఈశ్వర్ సాయిని ఫ్రేమ్‌లో పెట్టి లైట్స్ ఆన్, కెమెరా, యాక్షన్ అని బోయపాటి రేంజ్‌లో డైరెక్షన్ చేసిందని ఆడియోలు బయటకు వచ్చినాయి. ఇట్లా ఇక అటోడో ఒకసారి మీరు కూడా విను.

స్టోరీ పెట్టొచ్చు కదా. ఏ స్టోరీ అంటే.. నువ్వు వాష్‌రూమ్‌కి వచ్చావు. ఇలా సడన్‌గా శరణ్య వచ్చింది. డోర్ ఓపెన్‌లోనే ఉంది. ఏ తప్పు చేయలేదు కాబట్టి డోర్ ఓపెన్‌లోనే ఉంది. తను వాష్‌రూమ్ యూజ్ చేసుకోవడానికి వచ్చాడు అనేసి చెప్తాము. తన వాష్‌రూమ్ లేదా అని అంటే రితిక్ ఉన్నాడు, అందులో అసిస్టెంట్ ఉన్నాడు. సో అది ఫుల్ అయిందని, అర్జెంట్ అని.. ఆ అర్జెంట్ అనే టైమ్‌లో నువ్వు వాష్‌రూమ్ యూజ్ చేసుకున్నావు. డోర్ కూడా ఓపెన్ ఉంది. అలాంటి టైమ్‌లో శరణ్య ఎంటర్ అయింది. సో అది చూసి మన ఇద్దరినీ అలా అనుకుంది. అండ్ మన ఇద్దరం రిలేషన్‌లో ఉన్నాం కరెక్టే. కాకపోతే ఆరోజు మాత్రం మేమిద్దరం అందులో ఉన్నట్టు మాత్రం లేదు. మేము.. మేము చేసుకోవాలనుకుంటే ఎక్కడైనా చేసుకోవచ్చు.. ఓయోలో, అక్కడికక్కడ. కాకపోతే అది షూటింగ్ స్పాట్. అక్కడ అయితే మేము ఏం చేయలేము. మేము మీద రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయినట్టు అనుకోకండి.

వినరా.. మాధురి రాథోడ్ ఇంత ఇరగదీసి ముచ్చట చెప్తున్నదో. ఈశ్వర్ సాయికి మనం రిలేషన్‌లో ఉన్నది నిజమే కావచ్చు. పబ్లిక్ అంతా మన గురించి అనుకునేది తప్పు అన్నట్టు కథలు అల్లాలి. మనం షూటింగ్ కోసం వేములవాడకు వచ్చినట్టు, ఒక హోటల్‌లో దిగినట్టు, ఆల్రెడీ నీ రూమ్ బాత్రూమ్‌లో ఒకళ్ళు ఉండి ఖాళీ లేనట్టు, అప్పుడే నీకు అర్జెంట్ బాత్రూమ్ వచ్చినట్టు, నీ యాగంలో నువ్వు నా రూమ్‌కి పరుగుపరుగున వచ్చి పడుతున్నట్టు, అప్పుడే నీ భార్య మనం ఉన్న రూమ్‌లోకి వచ్చినట్టు, ఆ గడియల తలుపు గడియ కూడా పెట్టినట్టు.. మంచిగా మసాలా వేసి నువ్వు కథలు అల్లమని ఎంత ముద్దుగా చెప్తున్నావో వినరా.

ఇక ఈ ఆడియో అయ్యాక.. అబ్బా దెబ్బ అయిపోయినాం రా బాబు. ఇన్ని రోజులు పాపం ఈశ్వర్ సాయి భార్యని తప్పు పట్టినం. మాధురి రాథోడ్ మంచిది అన్నట్టు వీడియోలు చేసినం, కామెంట్లు పెట్టినం, కథనాలు కూడా రాసినం. ఇప్పుడు మా యాత అంతా వృథా అయిపోయింది కదరా అన్నట్టు మస్తు బాధలో మునిగిరట సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు.

సరే.. ఎవరు ఏమనుకున్నా, ఎట్లా అనుకున్నా.. మాధురి రాథోడ్–ఈశ్వర్ సాయి ఎపిసోడ్‌లో ఎవలకి ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పటికైనా ముచ్చట విడిచిపెడితే మంచిది అని ఇంకొంతమంది అంటున్నారు.

మరి చూడాలి.. రేపు రేపు ఇంకెన్ని ట్విస్టులు వస్తాయో, ఏం కథనో.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »